14.6 C
New York
Saturday, September 25, 2021

డైవర్స్ తీసుకున్న వాళ్లలో అక్రమ సంభంధాలు మొదలయ్యేది అందుకే… !!!!

పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులని ఒకటిగా కలిపి ఉంచే ఒక గొప్ప బంధం… భారత దేశం లో పెల్లి కి ఎంతో విశిష్టత, పవిత్రత ఉన్నాయి. ఫారన్ దేశాలతో పోలిస్తే ఇండియాలో పెళ్లికి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఎన్ని ఇబ్బందులు ఎదురయినా జీవిత చరమాంకం వరకు తమ లైఫ్ పార్టనర్ తో కలిసి వుండడానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఒక్కోసారి తమ భార్య నుంచి లేదా భర్త నుంచో విడిపోవాల్సి రావడం వాళ్ళకు తప్పక పోవచ్చు. మనసుకు ఎంత బాధ అనిపిస్తున్నా అన్నెళ్లుగా కలిసి జీవించిన వ్యక్తితో ఇక కలిసి ఉండలేకపోవడం అన్నది కొంచెం ఎక్కువ బాధ కలిగిస్తుంది. ఇక ఈ మోడ్రన్ వరల్డ్ లో పెళ్ళిలతో సమానంగా విడాకులు కూడా తీసుకుంటున్నారు… అయితే తమ కొత్త జీవితాల కోసం… భవిష్యత్తు కోసం విడిపోయిన జంటలు ఆ తర్వాత ఏ విషయాల్లో రియలైజ్ అయ్యారో అన్న విషయాల మీద ముంబై కి చెందిన ఒక రిలేషన్ షిప్స్ మీద కౌన్సెలింగ్ లు నిర్వహించే ఒక సంస్థ సర్వే చేసిందట వాళ్ళ సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయట… ఇప్పుడు మీకోసం ఆ సర్వే వివరాలు….

1. తమ జీవితంలో అంతా అయిపోయింది అన్నట్టు ఫీల్ అవుతారట!!!!

అదేంటి వాళ్ళే కావాలని విడాకులు తీసుకున్నప్పుడు మళ్ళీ అంతా అయిపోయింది అని ఎందుకు ఫీల్ అవుతారు అనుకోకండి… కొన్ని సంవత్సరాల పాటు తమ జీవిత భాగస్వామితో గడిపిన ఒక్క రోజులో అంత ఈజీగా మర్చిపోలేరు కదా అందుకే వాళ్ళలో తమ.లైఫ్ పార్టనర్ కు దూరం అయ్యాము అన్న బాధ వుంటుందట ఇక ఏవరైతే తమ లైఫ్ పార్టనర్ ను ఎక్కువ ప్రేమిస్తారో వారికి ఇష్టం లేకున్నా అవతలి వ్యక్తి కి విడాకులు ఇస్తారో అలాంటి వారికి లైఫ్ ఎండ్ అయిన ఫీలింగ్ లోకి వెళ్ళి పోతారట… వాళ్ల లైఫ్ లో అమ్మానాన్న, అక్కాచెల్లళ్ళు, అన్నతమ్ముళ్లు, ఫ్రెండ్స్ ఇలా ఎంత మంది ఉన్నా కూడా తమ పార్టనర్ తో ఉన్న రిలేషన్ షిప్ అనేది ఎప్పుడూ స్పెషలే అందుకే విడాకుల తర్వతా బాగా డల్ అయిపోతారు.

2. తామొక ఫెయిల్యూర్ అనుకుంటారు

పెళ్ళి అనేది బంధువులు, ఫ్రెండ్స్ ఇలా ఎంతో మందిని పిలిచి గ్రాండ్ గా చేసుకునే ఒక సెలబ్రేషన్ అయితే ఆ పెళ్ళి ఫెయిల్ అయ్యి తమ పార్టనర్ తో డైవర్స్ తీసుకోవడం అంటే తాము లైఫ్ లో ఫెయిల్ అయినట్టే అని చాలా మంది అనుకుంటారట… సొసైటీ లో ఒక పొజిషన్ లో వుండి విడాకులు తీసుకున్న వాల్లయితే వాళ్ళ పరువు కూడా పోయినట్టు ఫీల్ అవుతారట… నాలుగు గోడల మధ్య తమ జీవితాల్లో జరిగిన వాటికి అనుగుణంగా ఏ జంట అయినా విడాకులు తీసుకుంటుంది. కానీ ఈరోజుల్లో ప్రతిదీ పర్సనల్ కాకుండా బయట జనాల ఆమోదం తో కూడా జరుగుతుంది… పలనా అతను తన వైఫ్ నుంచి డైవర్స్ తీసుకున్నాడు అని తెలిస్తే ఇక అందరూ అతన్ని ఒక ఫెయిల్యూర్ గానే జమ కడతారు… సో ఒక విధంగా చెప్పాలంటే విడాకులు తీసుకున్న కపుల్స్ మీద సొసైటీ ఎఫెక్ట్ కూడా బాగానే ఉందట.

3. సంతోషంగా వుండలేరు!!!

ఎంతో సంతోషంగా జీవితం మీద, భవిష్యత్తు మీద గంపెడాశలతో పెళ్లి చేసుకునీ కొన్ని సంవత్సరాల పాటు ఒక వ్యక్తితో అన్నీ పంచుకుని సడెన్ గా ఆ వ్యక్తికి దూరం అవడం అన్నది బయట నుంచి చూసేవాళ్లకు అంతగా తెలియకపోవచ్చు… కానీ దాన్ని అనుభవించే వారికి అదొక నరకంగా అనిపిస్తుంది. తమలో అంతవరకు ఉన్న సంతోషాలు, సరదాలు అన్నీ మయం అయిపోతాయి… అప్పటి వరకు జంటగా వున్నవాళ్ళు సడెన్ గా ఒంటరితనం అనుభవించాల్సి వస్తుంది… అన్ని రోజులు కష్ట నష్టాల్లో తోడున్న ఒక ఆత్మీయుడు దూరం అవుతారు… ఇక పెళ్ళై పిల్లలు ఉన్న వారికైతే ఆ బాధ ఇంకా ఎక్కువగా వుంటుందట… తాము చేసిన తప్పుల వలన తమ పిల్లలు తల్లిని లేదా తండ్రిని మిస్ అవడం వాళ్ళ ప్రేమకు దూరం అవడమన్నది వాళ్ళు భరించలేక పోతారట… జీవితంలో ఏదో పెద్ద తప్పు చేసిన వారిలా తమని తాము నిందించుకుంటారట.

5. సూసైడ్ చేసుకోవాలి అనిపిస్తుదంట!!!!

విడాకులు తీసుకున్న తర్వతా చాలామంది ఒంటరితనం తో బాధ పడడం అన్నది చాలా మంది లో జరిగే విషయమే… అయితే వీళ్లలో కొంత మంది ఇంకా ఎక్స్ ట్రీమ్ లెవల్ కు వెళ్ళిపోతారట… తాము ఇంక బ్రతక కూడదని వారికి అనిపిస్తుందట… దాంతో సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వారికి ఎక్కువగా వస్తాయట ఆ టైమ్ లో గనక వార పక్కన మంచి చెడూ గురించి చెప్పి వారి మనసును డైవర్ట్ చేసే వారు లేకపోతే ఖచ్చితంగా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తారన్న విషయం వారి సర్వే లో తెలిసిందట. నిజం చెప్పాలంటే ఈ విశాల విశ్వంలో మనిషి ఒంటరివాడే అయితే తన తోటి మనిషి తోడుతో ఆ విషయంలో మనిషి గెలుస్తూ వస్తున్నాడు… మళ్లీ అదే మనిషి తను ప్రేమించిన వ్యక్తులు దూరం అయితే మాత్రం తట్టుకోలేక పోతున్నాడు. 

6. మరొకరితో సంబంధం పెట్టుకోవాలనుకుంటారు !!!

ఎవరైనా ఒక కపుల్ డైవర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళలో ఒకరు మెంటల్ గా , ఫిజికల్ గా చాలా డిస్టర్బ్ అవుతారు. తాము అన్ని విధాల మోసపోయామని ఇక తమ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయిందని అనుకుంటారట… దాంతో వాళ్ళు మరొక వ్యక్తిలో తమకు కావాల్సిన ప్రేమను, ఓదార్పును వెతుక్కుంటారట… ఆ టైమ్ లో వాళ్ళ మైండ్ సెట్ కూడా తాను త్వరగా ఎవరో ఒకరితో రిలేషన్ షిప్ స్టార్ట్ చేయాలని కోరుకుంటుందట… మరొక కొత్త పార్టనర్ కోసం చాలా ఆరాట పడతారట.

7. జీవితంలో ఇదొక చాప్టర్ మాత్రమే అనుకుంటారు!!!!

నాణేనికి మరొక వైపు అన్నట్టు పెళ్లి చేసుకుని కొన్నేళ్ళు కాపురం చేశాక విడాకులు తీసుకునే జంటల్లో అంతా అయిపోయింది అనుకునే వాళ్లతో పాటు లైఫ్ లో ఇది కేవలం ఒక చాప్టర్ మాత్రమే ఇలాంటివన్నీ మరిచిపోయి ముందుకు వెళ్లాలి అని డైవర్స్ ను కూడా పాజిటివ్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారట అయితే ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మందట… మనసు పెద్దది చేసుకుని తమని మోసం చేసిన తమ లైఫ్ పార్టనర్ ను కూడా క్షమించేసి లైఫ్ లో ముందుకు వెళ్ళడం అన్నది నిజంగా గొప్ప విషయమే సో నిజంగా అంత గొప్పగా ఆలోచించే వాళ్ళు వున్నప్పుడు వారికి మళ్ళీ ఒక కొత్త జీవితం ఖచ్చితంగా దొరుకుతుంది అన్నది నిజం.

సో ఫ్రెండ్స్ అవండి డైవర్స్ తీసుకున్న తర్వాత భార్య భర్తలు తమ జీవితంలో ఎలా బిహేవ్ చేస్తారు సొసైటీ నుంచి వచ్చే కామెంట్స్ ను ఎలా తట్టుకుంటారు?? ఎదురుకుంటారు… డైవర్స్ వాళ్ళ జీవితాలని ఎలా ప్రభావితం చేస్తుంది అన్న విషయాల మీద సర్వే లో తెలిసిన విషయాలు…

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!