23.6 C
New York
Monday, September 20, 2021

వాక్సినేషన్ లో అగ్రరాజ్యం కన్నా ముందు అడుగు లో భారత్

vaccination లో  భారత్ ఇప్పుడు అమెరికా కంటే ముందు ఉంది.. ఇప్పటివరకు కరోనా వాక్సిన్ మొదటి డోసును అమెరికా 16. 9 కోట్ల మంది ప్రజలకు అందిస్తే భారత్ 17. 2 కోట్ల మందికి అందించింది.. కొన్ని రోజుల ముందు వరకు అమెరికా భారత్ మధ్య vaccinations  లో  చాల గ్యాప్ ఉండేది.. second  wave  తరువాత డోసులు ఇవ్వడంలో జోరు పెరగడంతో భారత్ అమెరికాని వెనక్కి నెట్టేసింది.. 

వాస్తవంగా చూస్తే అమెరికా వాక్సినేషన్ లెక్కలని భారత్ తో పోల్చలేము.. అనేక అంశాల్లో భరత్ కు అమెరికాకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి.. భారత జనాభా 130 కోట్లకు పైగా ఉంటె అమెరికా జనాభా కేవలం 35 కోట్లే.. సాంకేతికతని అందిపుచ్చుకోవడం లో అమెరికా భరత్ కన్నా ముందు ఉంది.. అక్షరాస్యతలో అమెరికాకన్నా భారత్ వెనుకబడి ఉంది..  మొత్తంగా   అమెరికా ఒక అభివృద్ధి చెందిన దేశమైతే.. భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే.. 

అమెరికా లో మొదటి wave  లో కరోనా వ్యాపించినంత తీవ్రంగా భారత్లో వ్యాపించలేదు..   అమెరికాలో second wave వెనువెంటనే వచ్చేసింది .. భారత్లో  second wave కి first wave కి మధ్య చాలా గ్యాప్ వచ్చింది.. భారత్లో అనేకమంది మొదట వాక్సిన్ ను వ్యతిరేకించారు.

ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ఎక్కువ vaccine లను ఉత్పత్తి చేసే సామర్ధ్యం మనకు ఉంది..  ప్రపంచంలో vaccine లకి రాజధాని భారత్ అని పేరు కూడా ఉంది.. అందుకే ఇతర దేశాలకి వాటిని  ఎగుమతి చేయాల్సి వచ్చింది మోడీ ప్రభుత్వం.. అన్ని దేశాలు కరోనాని ఎదుర్కోవడం ఒక ఎత్తయితే..  భారత్ ఎదుర్కోవడం ఒక ఎత్తు.. ఇక్కడ ఉన్నన్ని క్లిష్ట పరిస్థితులు ఎక్కడా లేవు.. ఇన్ని సమస్యలని అధిగమించి కూడా భారత్ నిలబడగలగడం సామాన్యమైన విషయం కాదు.. ఒక అద్భుతం కూడా..

Related Articles

Stay Connected

0FansLike
2,948FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles