21.9 C
New York
Tuesday, September 28, 2021

Indian Government Last Warning To Twitter Over New IT Rules

ట్విట్టర్.. ఇదొక స్వేచ్ఛ సామాజిక మాధ్యమమే కావొచ్చు కానీ ఆ స్వేచ్చకి కూడా హద్దులుంటాయి.. ఒక సంస్థ ప్రపంచంలో ఎంత పెద్దదైనా సరే భారత దేశ ప్రజాస్వామ్యానికి తల ఒగ్గాల్సిందే.. గత కొన్ని రోజులుగా ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్యలో కోల్డ్ వార్ పరిస్థితి నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.. గత వారం ట్విట్టర్ కార్యాలయం పై ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లతో రైడ్ చేయించింది కేంద్ర ప్రభుత్వం.. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం పైనే కేసువేసి అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వాన్నే సవాల్ చేసింది.. 

ట్విట్టర్ వెనక్కి తగ్గక పోవడంతో.. కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సమాయత్తమైంది మోడీ ప్రభుత్వం.. ట్విట్టర్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు భారత్లో పనిచేయవని.. భారత్ చట్టాలకు లోబడే తమ పనులు ఉండాలని హెచ్చరించింది.. భారత్ పలుమార్లు హెచ్చరించినా ట్విట్టర్ తీరు మార్చుకోవడం లేదు.. కేంద్ర ప్రభుత్వంలో కొందరు ప్రముఖులు తమ అకౌంట్కు blue tick ను ట్విట్టర్లో  సెట్ చేయించుకుంటారు.. అలాంటి blue tick ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్సనల్ అకౌంట్ నుంచి తొలగించింది ట్విట్టర్ యాజమాన్యం.. ఉప రాష్ట్రపతి అకౌంట్ పై బ్లూ టిక్ తొలగించడం తో ట్విట్టర్లో తీవ్ర విమర్శలని ఎదుర్కొంది ట్విట్టర్.. కొద్దీ సేపటి తరువాత ఉప రాష్ట్రపతి పర్సనల్ అకౌంట్ కు blue tick ను తిరిగి చేర్చింది .. 

ట్విట్టర్ ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.. అయితే ట్విట్టర్కు కేంద్రం లాస్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. అప్పటికీ ట్విట్టర్ యాజమాన్యం గనుక పద్ధతి మార్చుకోకపోతే త్వరలోనే ఇండియాలో ట్విట్టర్ బాన్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంధీ ..

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!