14.6 C
New York
Saturday, September 25, 2021

దేశంలో ఒక్క జనసేన పార్టీ మాత్రమే కార్యకర్తలకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ , 50 వేల రూపాయలు మెడికల్ క్లైమ్ అందజేస్తోంది – నాదెండ్ల మనోహర్

పేద, మధ్యతరగతి ప్రజల కోసమే జనసేన పార్టీ నిరంతరం పనిచేస్తుందని.. జనసేన పార్టీ మాత్రమే కార్యకర్తలకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ సభ్యత్వాల నమోదులో నాదెండ్ల మనోహర్ , జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ పాల్గొన్నారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సురెన్స్ పత్రాలు, మెడికల్ కిట్లను ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ అందజేశారు. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ ఆశయ సాధన ప్రకారం పార్టీ ముందుకు వెళుతుందన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మార్పు కోరుకుంటూ యువత జనసేనలో చేరుతున్నారని… గత 4 నెలల్లో 5 లక్షల మంది జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులుగా చేరారని, దేశంలో ఒక్క జనసేన పార్టీ మాత్రమే కార్యకర్తలకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ , 50 వేల రూపాయలు మెడికల్ క్లైమ్ అందజేస్తోందని తెలియజేసారు. దురదృష్టవశాత్తు ఎవరికి అయినా ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే, వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని ప్రతి కార్యకర్త కు 5 లక్షలు రూపాయలు ఇన్సూరెన్స్ చేశారు. అలాగే ప్రమాదం జరిగి హాస్పటల్లో చికిత్స పొందే వారికి ఖర్చులు నిమిత్తం 50 వేల రూపాయలు 24 గంటల్లో అందజేయడం జరుగుతుందని తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్‌ లో జనసేన పార్టీని పటిష్టంగా ఏర్పాటు చేసేందుకు యువత ముందుకు రావాలని, జనసేన యొక్క భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరు సైనికులుగా శక్తివంచన లేకుండా పనులు చేయాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేసి మండల గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. గ్రామ, మండల, నియోజక వర్గ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ప్రజల పక్షాన జనసేన పార్టీ పోరాటాలు చేస్తుందని, ప్రజలలో నమ్మకం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ఇన్సూరెన్స్ కలిగించినందుకు కార్యకర్తలు అభినందనలు తెలపటం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్దాంతాలు ప్రజలందరికి తెలియజేసి, ప్రజల యెుక్క సమస్యలను పరిష్కరించే దిశగా జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు, అందరికి అందుబాటులో ఉండాలని, జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ గారు  తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని మండలాలకు చెందిన జనసైనికులు మరియు నాయకులు తదితురులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!