19.5 C
New York
Tuesday, September 28, 2021

జనసేనాని వ్యూహాత్మకంగా వేస్తున్న ఈ కమిటీలో ఇంత రహస్యం దాగి ఉందా…??

2014 లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జనసేన వరుస ఓటములతో ముందుకు సాగుతుంది. అయిన కూడా తమకు ఓటమి ముఖ్యం కాదని ప్రజల కోసం.. వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్నామని.. ప్రజల కోసం ఎంత వరకైనా పోరాడుతామని జనసేన నాయకులు కార్యకర్తలు అంటారు. ఇక ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇక ప్రస్తుతం జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి మరింత బలంగా తయారవ్వడానికి ప్రణాళికలు రచిస్తోంది.. అంతే కాదు ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో.. గ్రామ పంచాయతి ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ కంటే ఎక్కువ  స్థానాల్లో ముందుంది. కొన్ని చోట్ల వైసీపీకి సమానంగా పోటీ ఇచ్చింది. యువతకు అవకాశం కల్పించి వారిని ప్రజల తరుపున పోరాడేలా చేసింది. జనసేన పార్టీ మొదటితో పోలిస్తే ప్రస్తుతం భారీగా పుంజుకుంది అని గ్రామ పంచాయతీ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే చెప్పాయి. ఓల్డ్ పార్టీ టీడీపీ కంటే ఎక్కువ స్థానాల్లో ముందుకు సాగిన జనసేన.. వచ్చే ఎన్నికలు ఏవైన వైసీపీకి పోటీ ఇవ్వాలని ముందుకు సాగుతుంది.. దీనిలో భాగంగానే జనసేన ప్రస్తుతం జిల్లా స్థాయి.. మండల స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే పనిలో పడింది. ఈ వ్యహారాన్ని నాదెళ్ల మనోహర్ చూస్తున్నారు. ప్రతి జిల్లాలో పర్యటించి.. దానికి అనుగుణంగా ప్రణాళికలు వేస్తూ.. ఎవరు ఎక్కడ ఉంటే బాగుంటుందో ఆలోచించి వారికి వివిధ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇక ఇది రాబోయే ఎన్నికలకే అనేది తెలుస్తోంది. క్రియాశీలకంగా పని చేయాలని.. రోజు ప్రజలతో మమేకం అవుతూ.. వారి సమస్యలను గుర్తించి ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. అయితే 2014 తో పోలిస్తే జనసేన బలంగా తయారయ్యింది.. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు దీనిని తెలుపుతున్నాయి..అంతే కాకుండా బీజేపితో కలిసి పని చేస్తునందున బిజెపి ఓట్లు కుడా జనసేన కు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక ఎన్నికలకు చాలా సమయం ఉన్న కూడా ఇప్పటి నుంచి జిల్లా మండల కమిటీలను వేయడం అనేది వచ్చే ఎన్నికల్లో వైసీపీ.. టిడిపిలను వెనక్కి నెట్టడానికే అనేదు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న అంశం.

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!