21.9 C
New York
Tuesday, September 28, 2021

ఏపీకి ప్రత్యేక హోదాపై గళం విప్పుతున్న జనసేన పార్టీ

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని… ఆమరణ దీక్ష చేపడతానని జనసేన గుంటూరు నాల్గవ పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే అప్పట్నుంచి పెద్దగా ఏపీకి స్పెషల్ స్టేటస్‌పై ఎక్కడా స్పందించలేదు. ఆచరణ విషయంలో కూడా ఎలాంటి ముందడుగు వేయలేదు. ప్రత్యేక హోదా విషయంలో గతంలో పవన్ కల్యాణ్ ప్రకటనలు, ట్వీట్లు పెట్టారే తప్పా బలమైన కార్యాచరణ చేపట్టడం లేదని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు హోదా పోరులో పవన్ ఏం చేయనున్నారు? ఎలాంటి ప్రణాళికలు రూపొందించనున్నారు? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఏపీకి హోదా కోరుతూ అధికార టీడీపీ ఢిల్లీ వేదికగా నిరసనలు, దీక్షలు చేపట్టింది. హోదాకోసం వామపక్షాలతో కలిసి పవన్ విజయవాడలో పాదయాత్ర కూడా చేశారు. కానీ హోదాపై ఆయన నిరంతరం ఉద్యమాలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో హోదాకోసం పవన్ కల్యాణ్ పవన్ తన జోరు ఎలా పెంచుతారు? ఎలా ముందుకు వెళ్తారు ? అన్నది ఏపీ రాజకీయాల్లో కీలక అశంగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో అన్నిపార్టీలు కూడా ప్రత్యేక హోదా అంశాన్ని విస్మరించాయి. 2019 ఎన్నికల్లో పోటీ చేయడం పవన్ జనసేన పార్టీ కూడా ఘోరంగా ఓడిపోవడంతో జనసేనాని కూడా హోదా అంశాన్ని పక్కన పెట్టారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మరోసారి పార్టీని బలోపేతం చేయడంపై పవన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీంతో పాటు… ప్రభుత్వ వైఫల్యాల్ని కూడా ఎండగట్టేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. మరోసారి ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే తమ పార్టీ బలమైన నినాదాన్ని అందుకోవాలని జనసేన నాయకులు భావిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో అన్ని పార్టీలు ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టేశాయి. మరి ఈ సమయంలో పవన్ కల్యాణ్ మరోసారి హోదాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక హోదా ప్రాతిపదికన మరోసారి జనసేనాని ఉద్యమాలకు సిద్ధమవుతారా లేదా? అన్న అంశం తెరపైకి వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధన నిమిత్తం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ‘మౌన నిరసన’కు దిగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నటులు తమ మద్దతు తెలిపారు. మద్దతు తెలిపిన వారిలో ‘మెగా’ కుటుంబానికి చెందిన యువ హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ తో పాటు యువ కథానాయకులు సందీప్ కిషన్, తనీష్, నిఖిల్, శివ బాలాజీ కూడా ఉన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పవన్ ‘మౌన నిరసన’కు వారు తమ మద్దతు తెలిపారు. ‘ప్రజలకు మంచి చేసే ఏ పనికైనా నా మద్దతు ఉంటుంది’ అని వరుణ్ తేజ్, ‘ఇచ్చిన మాట కోసం పోరాడాల్సిన సమయం’ అని సాయిధరమ్ తేజ్, ‘వైజాగ్ లో 26న జరిగే ‘మౌన నిరసన’లో బాధ్యత గల పౌరుడిగా పాల్గొంటున్నా’ అని సందీప్ కిషన్, ‘మనం ఐక్యంగా ఉండాల్సిన సమయం’ అని తనీష్, ‘అందరికీ ఒకటే విఙ్ఞప్తి, మనస్ఫూర్తిగా మధ్యలో తొణుకు బెణుకులు లేకుండా, వెనకడుగు వేయకుండా, మనకు వాగ్దానం చేసిన ప్రత్యేక హోదా వచ్చే వరకూ పోరాడుదాం…’ అని నటుడు శివబాలాజీ పేర్కొన్నారు. కాగా, గోపీచంద్, రఘు కుంచె కూడా తమ మద్దతు తెలిపారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయమై ఒక తెలుగు వాడిగా తన మద్దతు ఉంటుందని ప్రముఖ నటుడు సంపూర్ణేష్ బాబు అన్నారు. ఒక మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ… ‘జల్లికట్టు’పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం ఎత్తి వేయాలని తమిళ ప్రజలు చేసిన పోరాటం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తితో త్వరలో నిర్వహించే మౌన నిరసన కార్యక్రమంలో తాను పాల్గొంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తనకు ఎటువంటి ఆహ్వానం లేదని, స్వచ్ఛందంగానే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నానని చెప్పారు. ఈ ‘మౌన నిరసన’ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతున్నారనే విషయం తనకు తెలియదని సంపూ చెప్పారు

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!