17.8 C
New York
Tuesday, September 21, 2021

ఆంధ్రాలో రెమిడెసివర్ బ్లాక్ మార్కెట్ ను ముఖ్యమంత్రి అడ్డుకోవాలంటూ జనసేనాని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలంలో ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సక్రమంగా అందటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఆక్సిజన్‌ అందక ప్రాణాలుపోతున్నా, అత్యవసరమైన రెమిడెసివర్‌ ను బ్లాక్‌ మార్కెట్లో లక్షల రూపాయలకు అమ్ముతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్య ధోరణితో వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ఒక్కో ఇంజక్షన్‌ ను రూ.40 వేలకు అమ్ముతుంటే సామాన్యులు, పేదలు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోలగరని ఈ సందర్భంగా ప్రశ్నించారు. జిల్లాలవారీగా రెమిడెసివర్‌ ఇంజక్షన్లకు, ఆక్సిజన్‌ కోసం ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశామని ప్రకటించారు. అసలు ఏ అధికారులు స్పందించడం లేదని ప్రజలు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆక్సిజన్‌ డిమాండ్‌, సరఫరా, వినియోగంపై అత్యవసరంగా ఆడిట్‌ చేపట్టి ఆక్సిజన్‌ నిరంతరాయంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జనసేనాని. అర్జెంట్ గా ఔషధాల బ్లాక్‌ మార్కెట్‌ ను అడ్డుకునే చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి 20 నిమిషాలకు ఒకరు కరోనాతో చనిపోతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయని.. అంతకంటే ఎక్కువ మంది చనిపోతున్నట్లుగా  తన దగ్గర క్షేత్ర స్థాయి సమాచారం వుందన్నారు. ఆక్సిజన్‌ అందక చనిపోతున్నా అలాంటిదేమీ లేదంటూ.. శ్మశానంలో ఉన్న లెక్కలు తప్పు అంటూ అధికారులు ప్రకటనలు ఇస్తున్నారని విమర్శించారు. కరోనా మరణాల లెక్కలను ఈ ప్రభుత్వం దాయగలదు.. మరి కరోనాతో చనిపోయిన వారి కుటుంబీకుల కన్నీటికి అడ్డుకట్ట వేయగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓ వైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే ఇలాంటి ఆపద సమయంలో ఇంటింటికీ ఇంటర్నెట్‌ ఇవ్వడం గురించీ, మహిళలకు మేకలు, గొర్రెలు ఇవ్వడం గురించి ప్రభుత్వం దృష్టి పెట్టడం కరెక్ట్ కాదన్నారు పవన్ కళ్యాణ్. ఇంటింటికీ కావాల్సింది ఇంటర్నెట్‌, మేకలు మాత్రమే కాదు.. కరోనా నుంచి రక్షించే మందులు, ఆక్సిజన్‌ కూడా అని గ్రహించాలి. ‘వీటిపై మన ఆంధ్రా ముఖ్యమంత్రి దృష్టి పెట్టి మన రాష్ట్రం రోమ్‌ కాదు.. మన పాలకులు నీరో వారసులూ కారు అని నిరూపించాలి’ అన్నారు. ఈ విపత్కర తరుణంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయడం ద్వారా విద్యార్దులను.. వారి కుటుంబాలను ముప్పు నుంచి కాపాడవచ్చన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
2,950FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!