23.2 C
New York
Tuesday, September 21, 2021

అసలు జనసేన జండా కి అర్ధం ఏంటి ?

ఒక పార్టీకి నాయకుడు ఎంత ముఖ్యమో, పార్టీ గుర్తు అంతే ముఖ్యం.. ఒక్కో పార్టీ కి ఒక్కో గుర్తు ఉంటుంది. ఒక్కో గుర్తు ఒక్కో అర్ధాన్ని సూచిస్తుంది. జనసేన పార్టీ చిహ్నం దేనికి గుర్తు.. అసలు ఆ చిహ్నంలో ఉన్న అంతరార్ధం ఏమిటి.?జనసేన పార్టీ చిహ్నం మన దేశం యొక్క చరిత్రను, పోరాటాలను సూచిస్తుంది. జనసేన గుర్తులాంటి చిహ్నన్ని ఇప్పటి వరకు మనం ఎక్కడ చూసి ఉండం. జనసేన చిహ్నం చూడగానే రక్తం ఉరకలు వేస్తుంది. పౌరుషం ఉప్పొంగుతుంది.  జనసేన చిహ్నంలో ఉండే తెల్ల రంగు భారత నాగరికత, సంస్కృతిని, అనేక వేల సంవత్సరాల నిలకడైన శాంతి, స్థిరత్వమును సూచిస్తుంది. ఎరుపు రంగు, విప్లవ చిహ్నం. లోతైన, నిజమైన మార్పును సూచిస్తుంది.ఆరు మూలల నక్షత్రం, పార్టీ ఆదర్శాలకు ప్రతిరూపం. నక్షత్రంలోని తెలుపు భాగం సరైన మార్గం చూపించే స్వయంప్రకాశిత గుణాన్ని సూచిస్తుంది.మధ్యలో ఉండే కేంద్ర బిందువు ప్రతి జీవిలోనున్న ఆత్మ. ఇదే అఖండ సత్యం. వ్యక్తులుగా, దేశంగా మనం చేసే ప్రతి పనినీ మూర్తీభవిస్తుంది. నల్లని చారలు విప్లవ వాంఛకు, దాని వ్యతిరేక శక్తులకు సమతూకంగా వ్యవహరించి పక్షపాతధోరణిని అసమ్మతిని దూరం చేస్తుంది. చిహ్నం ఇలా ఉండగా. జెండా సైతం అదే తీరు.. జనసేన జెండా ఓ ఉప్పెన, ఉప్పొంగే లావా, జాతి తాలూకు ఆశయం, రెపరెపలాడే జెండా యువతలో ఉత్తేజాన్ని నింపుతుంది. పలుకుబడి లేకుండా, పైసలు లేకుండా రాజకీయాలపై, ప్రజా సేవ పై ఆసక్తి ఉన్న యువతకు అవకాశం కల్పించి సమాజ సేవ కోసం నాయకులుగా, ప్రజా నాయకులుగా, సేవకులుగా, సైనికులుగా తయారు అయ్యలే జెండా రూపు ఉంది

Related Articles

Stay Connected

0FansLike
2,952FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!