17.8 C
New York
Tuesday, September 21, 2021

పార్టీ బలోపేతం దిశగా వ్యూహాలు రచిస్తున్న జనసేనాని

జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీలో కొన్ని కీలక మార్పులు చేసే యోచనలో ఉన్నట్టు కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.. ఈ అంశం పై ఎవరికి వారు కథనాలు ప్రచారం చేస్తున్నారు.. వీటిలో వాస్తవం ఎంత ఉందనేది.. జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించే వరకు స్పష్టత రాదు.. అయితే పవన్ అభిమానులు జనసైనికులు మాత్రం పవన్ పాలన చూడాలని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. జనసేనాని రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోననే ఆసక్తి రోజు రోజుకీ పెరిగిపోతుంది

పవన్ పైనున్న అభిమానం ఓట్లలో మారక పోవడానికి కులం, అవినీతి,  కుట్రలే కారణం..  ట్విట్టర్లో ఏ నాయకుడికి లేనంత ట్రెండింగ్ జనసేనానికి ఉంది.. అదే ఫాలోయింగ్ ఎన్నికల ఓట్లలో లేకపోవడానికి ప్రస్తుత అవినీతి రాజకీయమే కారణం..సమాజంలోని అన్ని వ్యవస్థల్ని ప్రభావితం చేసే శక్తి రాజకీయాధికారానికి వుంది.. ఈ అవినీతి రాజకీయాన్ని తట్టుకొని ఎదిరించాలంటే సమయంతో పాటు వ్యూహం చాలా అవసరం.. మరో రెండు మూడేళ్ళలో రెండు రాష్ట్రాలతో పాటు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.. రాబోయే ఎన్నికలే లక్షయంగా పవన్ వ్యూహరచనలో ఉన్నట్టు తెలుస్తోంది..  2013 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న పవన్ కు సినీ అనుభవంతో పాటు రాజకీయ అనుభవం కూడా ఉంది.. ఇన్నేళ్ల అనుభవం, కృషి తో పవన్ తీసుకోబోయే నిర్ణయాలు ఖచ్చితంగా అధికారం దిశగా అడుగులు పడతాయని మేధావులు సైతం విశ్లేషిస్తున్నారు..

Related Articles

Stay Connected

0FansLike
2,950FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!