22.4 C
New York
Friday, September 17, 2021

రాజధాని ఎక్కడికీ పోదంటూ నాదెండ్ల మనోహర్ సంచలనమైన కామెంట్స్

జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ తాజాగా సీఎం ఎక్కడి నుంచైనా రాష్ట్రాన్ని పాలించవచ్చని, రాజధాని ఎక్కడికీ పోదంటూ సంచలనమైన  కామెంట్స్ చేశారు. అలాగే కేబినెట్ విస్తరణలో జనసేనకి అవకాశమిస్తున్నారనే వార్తలు తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. పదవులు కోసం జనసేన ఎప్పుడూ పాకులాడదని, జనసేన నిర్మాణాత్మకమైన రాజకీయం చేస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇరిగేషన్ వివాదాలు అనేవి నిజాయితీగా వచ్చాయా, రాజకీయ కారణాల వల్ల వచ్చాయా అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. గతంలో ఇద్దరు సీఎంలు మధ్య మంచి స్నేహం ఉందని.. మా సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం అన్నారు. మరిప్పుడెందుకు అలా చెయ్యడం లేదని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల సీఎంల పోరాటాలపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మరోవైపు నేటి నుండి జనసేన మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో పండుగ వాతావరణం కనిపించబోతుంది. కరోనా మహమ్మారి గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో అడుగు పెట్టబోతుండటంతో రాష్ట్రంలోని వివిధ సమస్యలపై చర్చలు జరిపి  భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పవన్ పర్యటన నేపథ్యంలో నిన్న పార్టీకి సంబంధించిన కొందరు నేతలతో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమై చర్చించారు. ప్రధానంగా నిరుద్యోగ క్యాలెండర్, ఉద్యోగులు, రైతాంగ సమస్యలపై పీఏసీ లో చర్చించినట్లు నాదెండ్ల మనోహర్ తెలియజేశారు.  ఏపీ రాజకీయాల్లో కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మళ్లీ దూకుడు పెంచడంతో కార్యకర్తలు మంచి జోష్ లో ఉన్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. దీంతో పాటు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కీలత నేతలతో సమావేశమై ప్రధాన అంశాలపై చర్చించనున్నారు.

వరుస సినిమా షూటింగులు, కరోనా కారణంగా కొద్ది నెలలుగా రాజకీయాల్లో అంతగా యాక్టివ్ ఉండని ఆయన పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు సిద్ధమయ్యారు. పవన్ పర్యటన కోసం జనసేన నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే జులై 7న పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసులో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రాలోని తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ క్యాలెండర్ తో సహా మరికొన్ని ముఖ్యాంశాలపై ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles