3 C
New York
Saturday, December 4, 2021

అవినీతి మంత్రి పురస్కారం పేరుతో వెల్లంపల్లిని ఎందుకు సన్మానించలేదు – పోతిన మహేష్

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ను తరచూ టార్గెట్ చేసే జనసేన పార్టీ.. తాజాగా, ఆయన పుట్టిన రోజుపై కొన్ని  అనుమానాలను వ్యక్తం చేస్తోంది. అలాగే మంత్రి వెల్లంపల్లి రూ. 1,000 కోట్ల భారీ అవినీతికి పాల్పడ్డారని సంచలన ఆరోపణలు కూడా చేసింది. ఈ మేరకు స్వాత్రంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా జనసేన పార్టీ ముఖ్య నేత పోతిన వెంకట మహేష్ మంత్రి వెల్లంపల్లిపై సంచలన కామెంట్స్  చేశారు. మంత్రి పుట్టిన తేదీపై కొన్ని అనుమానాలను లేవనెత్తారు. ఆగస్టు 15న మంత్రి వెల్లంపల్లి పుట్టిన రోజు అని కొందరు చెబుతున్నారని, అయితే ఆయన బర్త్ డే ఇవాళ కాదని మరికొందరు వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారని కామెంట్ చేశారు.  దీనిపై ఆ పార్టీ నేతలే అనేక సందేహాలు తెలియపరుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. నిజంగా ఆగస్టు 15వ తేదీనే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జన్మించిన రోజు అయితే అందుకు సంబంధించిన ఆధారాలు బహిర్గతం చేయాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. 2009 వరకు తిథుల ప్రకారం పుట్టిన రోజు చేసుకునే వారని అంటున్నారని.. 2010 తర్వాతే ఆగస్టు 15న పుట్టిన రోజు వేడుకలు ఎందుకు చేసుకుంటున్నారో మంత్రి సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మంత్రిపైనే ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నికల అఫిడవిట్‌లో కూడా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తన పుట్టిన తేదీని ప్రస్తావించకపోవడం కొన్ని అనుమానాలను కలిగిస్తుందన్నారు. ఇక, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బాగా పని చేశారంటూ అధికారులకు పతకాలు ఇచ్చారని.. మరి రాష్ట్రంలో అవినీతి మంత్రి పురస్కారం పేరుతో వెల్లంపల్లిని ఎందుకు సన్మానించలేదో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నట్లు పోతిన మహేష్ కామెంట్ చేశారు. రూ. 1,000 కోట్లు దోచుకుని అవినీతిలో నంబర్ వన్ స్థానంలో నిలిచిన వెల్లంపల్లికి పతకం ఇస్తే అందరూ సంతోషించే వారని పోతిన మహేష్ సంచలన కామెంట్స్ చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
3,045FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!