22.4 C
New York
Friday, September 17, 2021

సీఎంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.?

పవన్ కళ్యాణ్.. అతడు కోట్ల ప్రజల గుండె చప్పుడు. ఆరిపోయే దీపానికి వెలుగునిచ్చే దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ది వన్ అండ్ ఓన్లీ మిస్టర్ పర్ఫెక్ట్. సినిమాల్లో ఒక వెలుగు వెలిగి, ఆ తరువాత ప్రజా సేవ మీద ఉన్నటువంటి మక్కువతో రాజకీయాల్లోకి వచ్చి, ఒక రాజకీయ పార్టీని స్థాపించి, జయాపజయాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రజలందరితో కలిసిపోరాడటానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల తరువాత ఇకమీదట సినిమాలు చేయబోనని అధికారికంగా ప్రకటించారు. కాగా అభిమానుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయడానికి అంగీకరించారు. మొన్నటి వరకూ రాజకీయాల్లో కాస్త బిజీగా కనిపించిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్‌ బిజీ అయిపోయారు. ప్రస్తుతం పింక్‌ సినిమా రీమేక్‌లో నటిస్తోన్న ఆయన.. ఆ తర్వాత వరుసగా మరో 4 సినిమాలకు చేసేందుకు అంగీకారం తెలిపారు. పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ అంటేనే 2 పడవల ప్రయాణం చేస్తారని అంటారు. అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు బ్యాలెన్సింగ్‌ చేసుకుంటూ ముందుకెళ్లాలని ఇప్పుడు ఫిక్సయ్యారట. ఉదయం సినిమా షూటింగ్‌లు.. సాయంత్రాలు రాజకీయాలకు సంబంధించిన అప్‌ డేట్స్ తెలుసుకొనే పనిలో ఉంటున్నారాయన. పూర్తికాలం రాజకీయాలకే పరిమితం కావాలన్నఅభిప్రాయాన్ని సవరించుకుంటూ.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని డిసైడైన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు ఊహించని రీతిలోమద్దతు లభిస్తోంది. మళ్లీ సినిమాల్లోకి వెళ్లడం ద్వారా పవన్ కమిట్‌మెంట్ తప్పారంటూ పార్టీ నుంచి వెళ్లపోయిన జేడీ లక్ష్మీనారాయణ వాదన సరికాదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. సినిమాల్లోకి పవన్ రీఎంట్రీని టీడీపీ, లోక్‌సత్తా పార్టీల నేతలు స్వాగతించారు. సాధారణంగా పక్కవాళ్ల వ్యక్తిగత విషయాలకు దూరం పాటించే లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ అనూహ్యంగా పవన్ సినిమాలపై స్పందించడం చర్చనీయాంశమైంది. ప్రజల్లో ఉంటూ రోజూ నటిస్తే ప్రజాస్వామ్యానికి చేటు జరుగుతుందని, సినిమాల్లో నటిస్తూ పార్టీని నడుపుకోవాలన్న పవన్ ఆలోచనలో తప్పులేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయి ఖాళీగా ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, ఎమ్జీఆర్ లాటివాళ్లు కూడా సినిమాలు తీశారని, తెలుగునాట ఎన్టీఆర్ బాటలో జనసేనాని నడవాలనుకోవడం మంచిదేనని నాయకులు అంటున్నారు. దీని పై స్పందించిన పవన్ ఫ్యాన్స్..”మా అన్న చేసింది ముమ్మాటికి కరెక్ట్. మా అన్నకి అందరిలాగా లక్షల కోట్ల ఆస్తులు, కోట్ల రూపాయాల ఆదాయాన్నిచ్చే కంపెనీలు లేవు. ఫ్యామిలీ కోసం, తనపై ఆధారపడ్డవాళ్ల కోసమే సినిమాలు చేస్తున్నారు. మా అన్న ను విమర్శిస్తున్నవాళ్లు జీవితంలో ఏనాడైనా సమాజం కోసం కనీసం వెయ్యిరూపాయల డబ్బు వదులుకున్నారా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి మనసున్న మంచి మనిషిని, మహానాయకుడైన మా అన్న పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా సీఎం చేస్తామంటూ బల్ల గుద్ది చెపుతున్నారు. ఇది విన్న పలు రాజకీయ పార్టి నేతలు పవన్ సీఎం అయితే ప్రమాణస్వికారం లో “సీఎం గా జనసేనుడు..కోణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను..” వాయిస్ ని గుర్తు చేసుకుని హడలి పోతున్నారు అంటూ ప్రధానంగా ఏపి రాజకీయాలో వినిపిస్తున్న టాక్. ఇదిలా ఉంటె.. తాజాగా పవన్ కళ్యాణ్ మరో సినిమాను కూడా అంగీకరించినట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ‘బద్రి’ సినిమాతో తాను పరిచయం చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్‌తో దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పవన్ చేయనున్నారని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ తరవాత మరో సినిమా రాలేదు. సుమారు ఎనిమిదేళ్ల తరవాత మళ్లీ ఆ కాంబో రిపీట్ కాబోతోందని అంటున్నారు. ఇప్పటికే పవన్‌కు పూరి స్టోరీలైన్ చెప్పారట. ప్రస్తుతం పవన్ అంగీకరించిన సినిమాలు పూర్తవ్వగానే పూరి సినిమా పట్టాలెక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను పూరి సీఎంగా చూపించబోతున్నారట.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles