23.2 C
New York
Sunday, September 19, 2021

బండి సంజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జనసేనాని

కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. వీ హనుమంతరావు ప్రజల నాయకుడని ఆయన అన్నారు. ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకున్నారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. వీ హనుమంతరావు సంపూర్ణంగా కోలుకుని త్వరలోనే ప్రజా సేవకు ఆయన పునరంకితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఇష్టడే రాజకీయ నాయకుల్లో వీ హనుమంతరావు ముఖ్యులు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలోనూ, ప్రజా వాణిని బలంగగా వినిపించడంలోనూ వీహెచ్ శైలి ప్రత్యేకమైనదని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. వీహెచ్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో రాజకీయ సేవ చేయాలని తన తరపున, జనసేన తరపున ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాన్ తెలిపారు. అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాన్ కూడా బండి సంజయ్  కి పుట్టినరోజు  శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్‌కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంజయ్ ధృఢ చిత్తం, పోరాట పటిమ తెలంగాణలో ఆయనను రాజకీయ ధృడ సంకల్పం కలిగిన నేతగా నిలిపాయి. యువ కార్యకర్తగా రాజకీయరంగ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగిన సంజయ్ తెలంగాణ ప్రజలకు, భారతీయ జనతా పార్టీకి మరిన్ని సేవలు అందిస్తారన్న విశ్వాసం నాకుంది. ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలని నా తరఫున, జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను’ అంటూ పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. బండి సంజయ్ ఇందుకు ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles