17.8 C
New York
Tuesday, September 21, 2021

త్వరలో జనం లొకి రాబోతున్న జనసేనాని

రాజకీయమంటే పోటీలు, గెలుపోటములు ఉంటాయి.. ఆ గెలుపోటములు ప్రభావితం చేసేది ఆ నాయకుల పోరాటాలు, యాత్రలు.. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ పాదయాత్ర సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. అధికార పక్షంలో ఉన్న వాళ్లకు అటువంటి యాత్రలు కుదరవు కానీ.. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లకు తప్పదు కదా… అందుకే 2004 లో దివంగత వైఎస్ నాడు శ్రీకారం చుట్టిన పొలిటికల్ పాదయాత్రలు నేటికీ కొనసాగుతున్నాయి. 2009లో చంద్రబాబు వస్తున్నా మీ కోసం అంటూ బస్సు యాత్ర చేసినా ప్రయోజనం లేకపోయింది. అందుకే 2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశారు. అదే సమయంలో వైసీపీ తరపున షర్మిల కూడా పాదయాత్ర చేసినప్పటికీ చంద్రబాబుకే మంచి ఫోకస్ ఏర్పడింది. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్రతో పాత రికార్డులన్నీ చెరిగిపోయాయి. ఇక ఇప్పుడు 2024 ఎన్నికల సీజన్ వచ్చేస్తుంది. పాదయాత్రల సమయం మొదలయింది. అందుకే ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తారని సమాచారం. ప్రస్తుతానికి జనసేనలో జరుగుతున్న అంతర్గత చర్చల ప్రకారం వచ్చే ఏడాది ఆగష్టు నుండి 2023 ఏప్రిల్ వరకు ఆంధ్రాలో సుదీర్ఘ పాదయాత్ర చేయాలని పవన్ ఆలోచిస్తున్నారని సమాచారం.  గతంలో పాదయాత్రలు చేసిన రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ వీరందరికంటే కూడా హిస్టరీ క్రియేట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారా అంటే అవుననే అంటున్నాయి జనసేన వర్గాలు. ఏపీలో అధికారంలోకి రావాలంటే తప్పకుండా పాదయాత్ర చేయాల్సిందే అనే పరిస్థితికి జనసేనాని  వచ్చేశారట. ఇప్పటివరకు పాదయాత్రలు చేసిన 3 రాజకీయ పార్టీలు అఖండ మెజారిటీతో గెలుపొందిన విషయం విధితమే. ఈ విషయంపైనే తాజాగా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. గడిచిన ఎన్నికల ముందు జగన్ దాదాపు 18 నెలల పాటు 134 నియోజకవర్గాలలో 3600 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి సక్సెస్స్ అయ్యారని మనం 3 ఏళ్ళ ముందు నుంచీ పాదయాత్ర చేసుకుంటూ ప్రజలలో ఉంటే తప్పకుండా అధికారంలోకి వస్తామని కొందరు నేతలు పవన్ వద్ద ప్రస్తావించారట. గతంలో మన పార్టీ నేతలు ప్రజలలోకి వెళ్లకపోవడం వలనే తీవ్రంగా నష్టపోయామని మనం ఇప్పటినుంచే పాదయాత్ర మొదలు పెడితే గ్రామాలలో సైతం పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తామని తెలిపారట. పవన్ కళ్యాణ్ కూడా గతంలో జగన్ పాదయాత్ర మెచ్చుకుంటూ తాను కూడా పాదయాత్ర చేపట్టాలని అనుకున్న విషయాన్ని గుర్తు చేశారట. అయితే పవన్ కళ్యాణ్ ఈ పాదయాత్ర విషయంలో పక్కా ప్రణాళికతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా సరే పాదయాత్ర చేపట్టాల్సిందేనని పవన్ పార్టీ కీలక నేతలతో అన్నట్లుగా కూడా తెలుస్తోంది. కానీ పార్టీలో ఓ ముఖ్య నేత మాత్రం ఇప్పుడే పాదయాత్ర మొదలు పెడితే ఎన్నికల సమయానికి పార్టీకి ఉన్న క్రేజ్ తగ్గిపోతుందని వద్దని వారిస్తున్నారట. అంతేకాదు ఈ పాదయాత్ర అసలు కలిసి రాదని, మనం ప్రజలలో పాజిటివ్ కంటే కూడా అధికారం కోసమే ఈ యాత్ర చేపడుతున్నారు అనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధినేతకి సలహాలు ఇస్తున్నారట. అయితే పవన్ కళ్యాణ్ ముందుగా అనుకున్నట్టుగానే వచ్చే ఏడాది ఆగష్టు నుండి 2023 ఏప్రిల్ వరకు మహా పాదయాత్రను మొదలుపెడితే జనసేనానికి ఉన్న సినీ క్రేజ్ దృష్ట్యా అభిమానులని అదుపు చేయడం కష్టమవుతుంది కాబట్టి.. ఏమైనా శృతిమించి సంఘటనలు ఎదురయ్యే అవకాశాలున్నాయి కాబట్టి పవన్ దీనిపై పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. మరోవైపు ఈసారి పవన్ మొత్తం 175 నియోజక వర్గాలలో పూర్తిస్థాయిలో పాదయాత్ర చేపడుతారని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఒకవేళ ఈ సుదీర్ఘ యాత్ర దిగ్విజయంగా చేపడితే భారీ మెజారిటీతో జనసేన అధికారంలోకి వస్తుందని అంచనాలు వేస్తున్నారు పార్టీ సీనియర్ నేతలు. మరి పవన్ యాత్రకి అడుగుపడుతుందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.!

Related Articles

Stay Connected

0FansLike
2,950FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!