22.4 C
New York
Friday, September 17, 2021

హౌస్ అరెస్ట్ లతో జనసేన ప్రభంజనాన్ని ఆపలేరు

ఏపీలో జాబ్ క్యాలెండర్ వివాదం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ గోడును పవన్‌ కు విన్నవించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి సభ్యులు, విద్యార్ధి సంఘాల నేతలు పవన్​ కు వినతి పత్రం అందించారు. దీంతో, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది జనసేన పార్టీ.. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఎంప్లాయిమెంట్‌ ఆఫీసుల్లోనూ వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జన సైనికులకు పిలుపునిస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేశారు పవన్ కల్యాణ్. రాజకీయ నిరుద్యోగుల కోసం లేని పదవులు సృష్టించారు.. కానీ, ఆ చొరవ, ఆసక్తి నిరుద్యోగులపై లేదంటూ ఆ వీడియోలో మండిపడ్డారు  రాష్ట్రంలో 45 లక్షల మంది నిరుద్యోగులుంటే ఏపీపీఎస్సీ ద్వారా కేవలం 36 ఉద్యోగాలు ప్రభుత్వం ప్రకటించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాదయాత్రలో అన్న వస్తున్నాడు నిరుద్యోగుల సమస్యలు తీరుస్తాడన్న జగన్మోహన్ రెడ్డి.. ఆనాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని ఆవేదన చెందారు. ఏటా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు ఇస్తామన్న హామీని అమలు చేయడం లేదని ఆగ్రహించారు. నాడు – నేడు అంటూ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారని… ఉపాధ్యాయులు లేకుండా సౌకర్యాలు ఉంటే సరిపోతుందా? అని నిలదీశారు. 20 లక్షల మంది గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతుంటే 25 ఉద్యోగాలు విడుదల చేశారని… ఇక, పోలీసు శాఖలో ఏటా 6500 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ లో 450 పోస్టులు మాత్రమే ప్రకటించి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు అని వాపోయారు.  నిరుద్యోగులకు జనసేన అండగా ఉంటుంది, ఈరోజు అన్ని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇస్తామని.. జన సైనికులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. నిరుద్యోగులు లక్షల మంది ఉద్యోగాల కోసం వెయిట్‌ చేస్తుంటే కేవలం 10 వేల ఉద్యోగాలను వేయడం ద్వారా జగన్‌ ప్రభుత్వం ఏం చెబుతోంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఏపీలో ఆందోళన చేస్తున్నారు. మళ్లీ జాబ్‌ క్యాలెండర్ ను విడుదల చేయాల్సిందే అంటూ వారు డిమాండ్‌ చేస్తున్నారు. నిరుద్యోగుల పోరాటంకు జనసేనాని పవన్ కళ్యాణ్‌ మద్దతు పలికారు. రాష్ట్రంలో మొత్తం 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగుల కోసం పవన్‌ పార్టీ పెద్ద పోరాటమే చేయబోతున్నట్లుగా జనసైనికులు అంటున్నారు. కొత్త జాబ్ క్యాలెండర్‌ ను విడుదల చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని పవన్‌ కళ్యాణ్ అన్నారు. ఇదిలా ఉండగా జనసేన అధ్యక్షులు ఆదేశాలమేరకు నిరుద్యోగ యువతకి అండగా  ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజిలో వినతిపత్రం ఇవ్వడానికి సిద్దమవుతున్న రామచంద్రపురం నియోజకవర్గం ఇంఛార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారిని,పార్థసారధి, బుంగారాజు గారిని, జనసైనికులను హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు మాట్లాడుతూ అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఈ విధంగా జనసేన కార్యకర్తలను హౌస్ అరెస్ట్ లు చేసి భయపెట్టో.. బెదిరించో తాము ఒక మంచి లక్ష్యంతో చేపట్టిన ఈ నిరుద్యోగ పోరాటాన్ని ఆపలేరని ఇలాంటి కుటిల రాజకీయ చర్యలతో జగన్ పార్టీకి మాయని మెచ్చే మిగులుతుందని జనసేన ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదని, ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన పార్టీ ప్రజలతోనే ఉంటుందని, ప్రజల కన్నీళ్లు తుడవటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలియజేసారు.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles