23.2 C
New York
Monday, September 20, 2021

6 జిల్లాలలో జనసేన హవా – మార్పు మొదలైంది

రాష్ట్ర వ్యాప్తంగా 65 శాతం పంచాయతీల్లో జనసేన మద్దతు దారులు ద్వితీయస్థానంలో నిలవడం మార్పునకు సంకేతమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ అన్నారు. 1209 సర్పంచ్‌లు, 1776 ఉప సర్పంచ్‌లు, 4,456 మంది వార్డు సభ్యులుగా జనసేన భావజాలం, మద్దతు కలిగిన వారు గెలుపొందటం సంతోషంగా ఉందన్నారు. ఈ విజయం వ్యవస్థలో వస్తున్న మార్పునకు నిదర్శనమన్నారు. మొత్తం మీద 27 శాతం ఓటింగ్‌ను తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పొందారని తెలిపారు. జనసేన మద్దతు దారులు గెలుపొందిన చోట  కేరళ తరహాలో పంచాయతీలు అభివృద్ధి చేయనున్నట్టు పవన్‌ తెలిపారు. ఇదిలా ఉంటె.. మార్చి 10 వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రతిపక్షాలు ప్రచారం నిర్వహిస్తన్నాయి. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1,500 స్థానాల్లో జనసేన మద్దతుదారులు గెలిచినట్టు స్వయానా జనసేనాని చెప్పడంతో జనసైనికులు మరింత జోష్‌తో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవిళ్లు ఊరుతున్నారు. ఇక పొలిటికల్ హబ్ బెజవాడలో జనసేన గట్టిగానే ప్రచార హోరిని వినిపిస్తుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులకు దీటుగా ప్రచారంలో దూసుకెళ్తుంది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపుతో మార్పు మొదలైందని.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తు‌తో ఇతర పార్టీలకు చమటలు పట్టేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం విజయవాడ లో ఉన్న 64 వార్డులో జనసేన 37వార్డులో అభ్యర్థులను పోటీలోకి దింపారు. వైసీపీ, టీడీపీ మేయర్ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో జనసేన అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో వైసీపీ , టీడీపీకి చెందని బడ నేతలు సైతం రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారని.. ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన జనసేనని సిద్ధాంతంతో గెలుపు బహుటా ఎగరేస్తామని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన మహేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, రాష్ట్రంలోని మిగిలిన మున్సిపాలిటీల్లోనూ జనసేన తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పంచాయతీ ఫలితాలను పునరావృతం చేయాలని క్యాడర్‌కు అగ్రనాయకత్వం సూచిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు జనసేనా మెల్లమెల్లగా పావులు కదుపుతోంది. 2019 ఎన్నికల తర్వాత స్పీడు పెంచింది.. బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని ఉమ్మడి ప్రణాళికలతో ప్రజా సమస్యలపై పోరాట చేస్తోంది జనసేన. త్వరలో జరగనున్న తిరుపతి ఉప ఎన్నికతో పాటూ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే అభ్యర్థులను బరిలో దింపింది. ముందుగా సంస్థాగతంగా క్యాడర్‌ను పెంచుకునేందుకు స్థానికల ఎన్నికలను వాడుకుంటోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ఉప ఎన్నిక తిరుపతి పార్లమెంటు స్ధానంలోనే. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఈ స్ధానంలో త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. ఇందుకోసం ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ తమ అభ్యర్ధులను ప్రకటించగా.. త్వరలో బీజేపీ-జనసేన కూటమి తరఫున ఉమ్మడి అభ్యర్ధిని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాక ముందే ప్రధాన పార్టీల అభ్యర్ధులు దాదాపు ఖరారు కావడంతో ఈ ఉప ఎన్నిక ఏ రేంజ్‌లో జరగబోతోందో ఇట్టే అర్ధమవుతోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ అంతా సజావుగానే సాగిపోయింది. వైసీపీ పాలనలో సగం కరోనాకే సరిపోవడంతో ఇక మిగిలిన సమయంలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలకు అవకాశం దొరికింది. ఇందులోనూ మూడు రాజధానుల ప్రక్రియను నెత్తికెత్తుకోవడంతో ఇక మిగిలిన అంశాలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఇది కాస్తా కోర్టులో ఆలస్యం అవుతుండటంతో తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే తిరుపతిలో సొంత ఎంపీ దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో వైసీపీ ప్రభుత్వానికి ఈ సీటు నిలబెట్టుకోవడం ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో ఇదంత కష్టమేమీ కాకపోయినా ఉప ఎన్నికల్లో ఉండే ప్రత్యేక పరిస్ధితులే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి సవాల్‌గా మారుతున్నాయి. విపక్ష టీడీపీతో పాటు బీజేపీ-జనసేన కూటమి అభ్యర్ధులు రంగంలోకి దిగుతుండటంతో పరిస్ధితి మరింత హీటెక్కింది. తిరుపతి ఉప ఎన్నికలో ఉండే ప్రత్యేక పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ వైసీపీతో పాటు ప్రధాన విపక్షం టీడీపీ కూడా ముందుగానే అభ్యర్ధులను ఖరారు చేశాయి. వైసీపీ తరఫున సీఎం జగన్‌ వ్యక్తిగత ఫిజియోథెరపిస్టు గురుమూర్తి, టీడీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన పనబాక లక్ష్మి అభ్యర్ధిత్వాలు ఖరారయ్యాయి. గత ఎన్నికల్లో బల్లి దుర్గాప్రసాద్‌కు గట్టిపోటీ ఇచ్చినా పనబాక లక్ష్మికి ఓటమి తప్పలేదు. గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న పనబాక వాస్తవానికి తిరుపతిలో గట్టి అభ్యర్ధే. అయితే కీలకమైన తిరుపతితో పాటు ఇతర నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలే ఆమె విజయావకాశాలను ప్రభావితం చేయబోతున్నాయి. వైసీపీ అభ్యర్ధి అయిన గురుమూర్తికి మాత్రం జిల్లాలో బలంగా ఉన్న వైసీపీ శ్రేణుల అండతో పాటు అధికార పార్టీ నుంచి పూర్తి సహకారం లభించబోతున్నాయి. చివరికి గురుమూర్తి ఎన్నికల ఖర్చు కూడా భరించేందుకు సీఎం జగన్‌ సై అన్నారు. తిరుపతిలో ఉండే ప్రత్యేక పరిస్ధితులను సొమ్ముచేసుకుటూ ఈసారి ఎలాగైనా అక్కడ పాగా వేయాలని పట్టుదలగా ఉన్న బీజేపీ-జనసేన కూటమి ఒకప్పుడు టీడీపీలో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్‌బాబును రంగంలోకి దింపబోతోంది. మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి కూడా అయిన రావెల పేరును బీజేపీ-జనసేన కూటమి త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. పనబాకతో పాటు గురుమూర్తికి గట్టిపోటీ ఇచ్చేందుకు రావెలను మించిన అభ్యర్ధి లేడని కూటమిలోని ఇరుపార్టీలు భావిస్తున్నాయి. అయితే ధనప్రవాహం ఫలితాలను శాసించే అవకాశమున్న తిరుపతి ఉప ఎన్నికల్లో ఒకప్పటి జనసేన నేత, ప్రస్తుత బీజేపీ నేత అయిన రావెల ఏ మేరకు నెగ్గుకొస్తారో చూడాల్సిందే.రావెల గెలుపు కోసం బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ఘన్‌రెడ్డి ఇప్పటికే తిరుపతిలో పాగా వేశారు. 

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles