19.5 C
New York
Tuesday, September 28, 2021

కోనసీమలో కరోనా సమస్యలపై స్పందించిన జనసేనాని

కోనసీమలోని గొల్లవిల్లి గ్రామంలో ఇప్పటికే 20మందికి పైగా  కరోనా రక్కసి కారణంగా కన్నుమూశారనే విషయం తెలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. “చాలా బాధ కలిగించే విషయమిది. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం గొల్లవిల్లి గ్రామం విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. రెడ్ జోన్ ప్రకటించి, బ్లీచింగ్ జల్లిస్తే అక్కడి ప్రజల్లో భయాందోళనలు తగ్గవు. తక్షణమే ప్రత్యేక వైద్య బృందాలను అక్కడకు పంపించాలి. ఆ గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు ఇంటింటి ఆరోగ్య సర్వే, పరీక్షలు చేసి మందులు సరఫరా చేయాలి. సమీప ఆసుపత్రులలో మౌలిక వైద్య సదుపాయాలు మెరుగు చేస్తే అందరికీ ప్రయోజనం కలుగుతుంది. కోనసీమ ప్రాంతంలో అనేక చమురు సంస్థలు తమ వాణిజ్య కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాయి. ఆ సంస్థలు సామాజిక బాధ్యతతో గొల్లవిల్లితోపాటు కోనసీమ గ్రామాల్లో వైద్య సేవలు మెరుగు పరచేందుకు అవసరమైన చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. కరోనా మొదటి వేవ్ సమయంలో కోనసీమలోని చమురు సంస్థలు సుమారు రూ.200 కోట్లతో వైద్య వసతులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి. ఏ మేరకు వాటిని అమలు చేశాయో ఉన్నతాధికారులు తక్షణమే సమీక్షించి.. ఆ హామీ కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలి. గొల్లవిల్లి లాగే మరికొన్ని గ్రామాలు కరోనాతో సతమతం అవుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందించే విషయంలో ప్రత్యేక ప్రణాళిక అనుసరించాలి. పల్లెలకు అంబులెన్సులు కూడా చేరడం లేదు. ప్రైవేట్ అంబులెన్సులకు భారీ మొత్తాలు చెల్లించలేక పేదలు ఇక్కట్ల పాలవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా కొన్ని అంబులెన్సులు సిద్దంగా ఉంచాలి. అలాగే కోనసీమ రైతులకు మద్దతు ధర, మార్కెట్ కల్పనపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. రైతన్నల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం తిప్పించుకుంటోందని దుయ్యబట్టారు. అన్నం పండించే రైతుకు అండగా ఉండని ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు. నవరత్న పథకాల పేరుతో జగన్ రైతులకు మేలు చేశామంటున్నారని కానీ రైతులకు ఏ రకంగా గిట్టుబాటు ధర కల్పించాలి? అని మాత్రం ఆలోచించడం లేదని దుయ్యబట్టారు. పచ్చటి కోనసీమకు అందరి దిష్టి తగిలిందన్నారు.  కానీ వాస్తవంలో పొలాల్లో మంచినీళ్లు వేసే పైపులు కూడా పగిలిపోయి, నేల నుంచి ఉప్పునీటి ఊట వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ నీళ్లు అంటే కొబ్బరి నీళ్లలా ఉంటాయన్న నానుడి ఉందనీ, ఇప్పుడు మాత్రం ఉప్పునీళ్లు వస్తున్నాయని చెప్పారు. కోనసీమ ప్రాంతంలో కాలువలు పూడికతో నిండిపోయినా పట్టించుకునే నాథుడే లేడని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ విమర్శించారు. గొల్లవిల్లితోపాటు పరిసర ప్రాంతాలలో కోవిడ్ బాధితులకు సాయం చేయడంలోను, ప్రజల ఇబ్బందులను అధికారుల దృష్టికి  తీసుకువెళ్లడంలోనూ జనసేన నాయకులు, జన సైనికులు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో వీరంతా డబుల్ మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!