14.6 C
New York
Saturday, September 25, 2021

జనసేనుడికి మహిళలు అంటే ఎంత గౌరవమే .. !

జనసేన పార్టీ ప్రజల కోసం స్థాపించిన పార్టీలో కుల మతాలు, వర్గ బేధాలు, ఆడ మగ అనే లింగ బేధాలు ఉండవు. అసలు వాటికి జనసేన లో చోటు లేదు. ఇక పార్టీ కోసం పనిచేసే వారిని అన్ని పార్టీలో కార్యకర్తలు అంటారు కానీ జనసేనలో జనసైనికులు అంటారు. ఇక అన్ని పార్టీలో మహిళ కార్యకర్తలు అంటారు కానీ జనసేన వాటికి భిన్నం. జనసేనలో మహిళ కార్యకర్తలను వీర మహిళలు అని అంటారు. అసలు ఎందుకు వీర మహిళలు అని అంటారు.? పవన్ కళ్యాణ్ మహిళ  కార్యకర్తలను వీర మహిళ అని ఎందుకు అంటున్నారు.?  సమాజంలో జరుగుతున్న అన్యాయం, స్త్రీ తాలూకు భద్రత మొదలుగునవి నన్ను ఇంత చిన్న వయస్సులో పార్టీ పెట్టడానికి ప్రభావితం చేశాయని, ఇంట్లో నుండి ఆడపిల్ల బయటకు వెళ్తే భద్రతగా తిరిగొచ్చే పరిస్థితి లేదు. నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఇలాంటి సంఘటనలు చూసానని.. వనరులు పెరగవు. వున్న వనరులను ఎంత ఎక్కువ శాతం వినియోగించుకోగలమో అదే ఆర్ధిక శాస్త్రం. ఇది తల్లి దగ్గర నుండి నేర్చుకోవొచ్చు. ఒక మహిళ ఇల్లు నడిపే విధానం, వంట గదిని నడిపే విధానం చూస్తే మనకి వారి గొప్పతనం అర్ధమవుతుంది.. అందుకే మహిళలకు పార్టీలో సమప్రాధాన్యత ఉంది అని పవన్ అంటారు. మహిళలు తాలూకు సాధికారిత కావాలంటే సొసైటీ సపోర్ట్ చెయ్యాలి. పొలిటికల్ సిస్టమ్ ద్వారా సొసైటీ మద్దతు తెలపాలి.. ప్రతీ మహిళలో నిగూఢమైన, చాలా బలమైన శక్తి ఉంటుంది. ఆ పరిస్థితులు కల్పించే వరకూ మనకి అది తెలీదు. పోలాండ్ నుండి వచ్చిన విద్యార్థులు నువ్వు మహిళలకు ఎం చేయగలవు అని అడిగారు. మనం ఎం చేయనవసరం లేదు, వారి దారిలోకి ఎవరూ వెళ్లకుండా ఉంటే చాలు. మగాళ్ళకి మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ ఉండదు. ఆడవాళ్ళకి మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ ఉంటుంది. కొన్ని కుటుంబాలు మహిళలకు ఇచ్చే భద్రత సమాజం అంతా సంపూర్ణంగా మహిళలకు ఇస్తే తప్ప, మహిళా సాధికారిత రాదు. మహిళలకు సాధికారత కల్పించాలంటే ముందుగా వారికి భద్రత కల్పించాలి. వారిలో ఏదొక భయం ఉంటుంది. మహిళలు సమస్యల మీద ప్రణాళికా బద్దంగా చేస్తే మిగతావారు భయపడతారు. ఈ దేశం ఆరాదించేది స్త్రీ శక్తిని. మహిళలలో అపారమైన శక్తిని నేను చూసా…అందుకే నేను వీరమహిళ అని పేరు పెట్టా…నేను ఏమి చేసినా నాకు చిన్నప్పటి నుండి ఆడపడుచుల ఆశీస్సులు వున్నాయని జనసేన అధినేత పవన్ అంటారు. పోరాడే దుర్గాదేవిలా, చదువు చెప్పే సరస్వతిలా.. మహిళలు ఉండాలి ఉన్నారు కూడా. మహిళల అనుకుంటే ఏదైనా చేయగలరు వారిని సాధారణ వ్యక్తుల్ల చూస్తే అది తప్పు. ప్రతి రంగంలోను స్త్రీ ముందుంది.. దేశ రాజకీయాలను సైతం ఆమె శాశిస్తుంది. అందుకే ఆమెను రాజకీయాల్లో కార్యకర్తగా కాకుండా వీర వణితగా చూడాలని నిర్ణయించిన పవన్ కళ్యాణ్ జనసేన వీరమహిళగా నామకరణం చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!