23.6 C
New York
Monday, September 20, 2021

ఎవరైనా సరే.. ఏం పీకుతారు.? ఏం చేస్తారు.? – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

కరోనా నృత్యకేళిలో సినీ ప్రముఖుల దగ్గర్నుండి నిరుపేదల వరకూ రోజుకు కొన్ని వేలమంది మృత్యువాత పడుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా పరిణామాలపై స్పందిస్తూ హాస్పటల్స్ లో బెడ్స్ మరియు ఆక్సిజన్ కొరతల విషయంలో వైసిపీ ప్రభుత్వాన్ని నిలదీసిన సంగతి తెలిసిందే..!   ఈ సందర్భంగా రాజకీయాలు, రాజకీయ పార్టీల గురించి ఆయన ఆవేశంగా మాట్లాడారు. “మీకు ఓట్లు కావాలి. కానీ సమస్యలు అడిగితే హైకమాండ్, పార్టీ అధ్యక్షుడు నిర్ణయం అంటున్నారు. మేం ఏం చేయలేం అంటున్నారు. ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్లలేని మీకు 2021లో ఓట్లు అడిగే హక్కు లేదు. కడుపుమండి మాట్లాడుతున్నాను. దాదాపు 6 సంవత్సరాలు ఓపిక పట్టాం. ఏదో అద్భుతం జరుగుద్ది అని. ఈ రోజుకీ ఎక్కడి సమస్యలు అక్కడే అలాగే ఉన్నాయి. నేను బీజేపీ పక్షం కాదు. టీడీపీ పక్షం కాదు. నేను ఏ పార్టీ పక్షం కాదు. నేను ప్రజా పక్షం. తెలుగు రాష్ట్రాల ప్రజల పక్షం. భారతదేశ ప్రజల పక్షం కానీ. భారతీయ జనతా పార్టీ పక్షం నేను కాదు. దేశానికి చాలా బలమైన నాయకులు కావాలి. ఈ దేశ సమస్యలు పరిష్కరించాలంటే ఒక పార్టీ సరిపోదు. ఒక నాయకుడు సరిపోడు. అనేక పార్టీలు కావాలి. అనేకమంది నాయకులు కావాలి. నేను సమస్యల గురించి మాట్లాడితే నాకూ ఇబ్బందులు వస్తాయి అంటున్నారు. ఏం పీకుతారు ఎవరైనా సరే? ఏం చేస్తారు? కోడిగుడ్డు మీద ఈకలు పీకితే పీకండి. నేను కూడా ఏం చేయగలనో నేను కూడా చేసి చూపిస్తాను. నాకు భయాల్లేవు. ధైర్యమే ఉంది. ఒక ప్రాణం. పోతే ప్రజల కోసం పోగొట్టుకుంటాను కానీ ఎవరెవరి కోసమో నేను పోగొట్టుకోను. మీకోసం అవసరమైతే జైలు కెళతాను. దెబ్బలు తింటాను. నువ్వు ఏ పార్టీతో కలిసి పనిచేస్తావ్ అని అడుగుతారు. నా మనసులో ప్రజలు తప్ప పార్టీలుండవ్. ప్రజా పార్టీ. కులాలుండవ్. మతాలుండవ్. ప్రజలకు నష్టం కలిగించే ఏ పార్టీకీ నేను మద్దతివ్వను. చంద్రబాబు కానీ నరేంద్రమోదీ కానీ వీరెవరూ నాకు బంధువులు అన్నదమ్ములు ఎవరూ కాదు. సొంత కుటుంబాన్ని వదిలివచ్చిన వాడ్ని రాజకీయాల్లోకి. నాకు ఒకటే కుటుంబం ప్రజా కుటుంబం. అది మీరే. ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిని కలిసినా కానీ ఈ రోజుకీ నాకొక ఫేవర్ చేయండని నేనెవరినీ అడగలేదు. కారణం నా నైతిక బలం కోల్పోకూడదని. నా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు ఒక సర్టిఫికెట్ అవసరమైతే ఏ ఒక్క కేంద్ర మంత్రినీ అడగలేదు. సమస్యలు నేను భరిస్తాను కానీ సమస్యల నుంచి పారిపోను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డినీ ఇదే అడుగుతున్నా. మీరు కూడా ఈ ఉద్యోగులకు అండగా నిలబడండి. ఇది అన్ని పార్టీల సమష్టి బాధ్యత. మీరు తిరగండి.. ఓట్లు సంపాదించుకోండి.. మీరు ముఖ్యమంత్రి గా మరో పదేళ్ళున్నా నాకేం సంబంధం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా.. నిర్మాణాత్మక రాజకీయాలు చేయడానికి పవన్ కల్యాణ్ మీకు అండగా నిలుస్తాడు. మీతో పాటు ప్రయత్నిస్తాడు. టీడీపీ కానీ, వైఎస్సార్ సీపీని కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టు పార్టీ కానీ, లోక్‌సత్తా పార్టీ నాయకులు కానీ.. పదవి కోసమే పార్టీలు కాదు. ప్రజా సమస్యలపై పోరాటం చేయటం కోసం పార్టీలు. నేను ముఖ్యమంత్రిని అయితేనే ఇది చేస్తాను అనే ఆలోచనలకు స్వస్తి చెప్పాలని కోరుతున్నాను. అందరు సమష్టిగా కూర్చుని సమస్యలను కలసికట్టుగా పరిష్కరించాలనే నేను మనస్ఫూర్తిగా ముందుకు వచ్చాను. నా అభిమానులు నన్ను కాబోయే సీఎం.. సీఎం.. అంటే నాకు లోపలేమీ అనిపించదు. అది వాళ్లకు సరదా ఏమో కానీ నాకు బాధ్యత. అందరు చేసే తప్పు మీరు చేయకండి. అధికారానికి జ్ఞానం కావాలి. అనుభవం కావాలి. ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, మంత్రి కావాలన్నా, సీఎం కావాలన్నా అనుభవం కావాలి. ఎబిలిటీలు చాలా అవసరం. పదేళ్లు రాజకీయాల్లో ఉండి అనుభవంతో చెప్తున్నా. లాల్‌ బహదూర్‌ శాస్త్రి.. రైలు ప్రమాదం జరిగితే ఇది నా తప్పు అని రిజైన్ చేసి వెళ్లిపోయారు. అలాంటి గొప్ప నాయకులు నడిపించిన దేశమిది. ఇప్పుడు ఎన్ని తప్పులు జరిగినా, ఏం జరిగినా ఒళ్లు మందమెక్కేసింది. ఏనుగు చర్మమైపోయింది. కానీ ఏనుగులకు కూడా అంకుశం ఉంటుందని గుర్తు పెట్టుకోండి. మీరంతా అంకుశం కావాలి. ప్రజలు అంకుశమై ప్రజా ప్రతినిధులకు మాడుపై గుచ్చుతుంటే వాళ్లు పనిచేస్తారు. కరోనా బారిన పది ఇన్నివేలమంది మన కళ్ళముందే చనిపోతున్నారంటే ఇది ప్రభుత్వాల వైఫల్యం. ఇలాంటి దుస్థితిలో కూడా శవాలతో రాజకీయం చేస్తున్నట్లు కోవిడ్ మెడిసిన్ ను బ్లాక్ లో రాజకీయ నాయకులే అమ్ముతుండటం చాలా బాధాకరమైన విషయం. ప్రజలు ప్రభత్వాలను నిలబెట్టే పరిస్థితి రాకముందే ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవాలని కోరుకుంటున్నాను. అని మీడియాతో తెలియజేసారు. 

Related Articles

Stay Connected

0FansLike
2,948FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles