23.2 C
New York
Sunday, September 19, 2021

పంచకట్టు లో పవన్ కళ్యాణ్ తెలుగు తనం ఉట్టిపడేలా తన తత్వం… తెలుగు అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అంత ఇష్టం.?

ఏ దేశమేగిన ఎందు కాలిడిన, పొగడరా నీతల్లిభూమి భారతిని, నిలపర నీజాతి నిండు గౌరవం.. ఈ మాట సరిగ్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సరిగ్గా వందకి వంద శాతం సరిపోతుంది. మన సంస్కృతిని, మన కట్టుబాట్లను, పుట్టిన నేలను.. అసలు మరువకూడదు. ఎన్ని నూతన కట్టుబాట్లు ఫ్యాషన్స్ వచ్చిన కూడా మన సంప్రదాయం మనదే. దాంట్లో ఉండే మజానే వేరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం సాంస్కృతి, సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. లుంగీ పంచె కట్టు కట్టి అందరికి ఆదర్శగా నిలుస్తారు. ఇక సినిమాల్లో కూడా నేతన్నల కాటన్ దుస్తులను, సాధారణ డ్రెస్సింగ్ తో కనిపిస్తాడు పవన్. దేశ భాషలందు తెలుగు లెస్స.. అని కొనియాడిన కూడా మన భాషను మనం దూరం పెడుతున్నాం. కనీసం ఇంట్లో కూడా మాట్లాడటానికి ఆసక్తి చూపించడంలేదు. మనకు తెలివి ఉందని అందుకే తెలుగు కాకుండా ఇంగ్లీషు మాట్లాడుతున్నాం అని ఇంగ్లీషు అన్నిటికీ కారణం అని అనుకుంటున్నాం కానీ మన ఆలోచన తప్పు. తెలుగు మన కన్న తల్లిలాంటిది.. బిడ్డకి ఏదైనా ప్రమాదం జరిగితే, బాధలో ఉంటే మొదట మనల్ని దగ్గరికి తీసుకుని ఓదార్చి బాధ తీర్చేది అమ్మ.. కానీ వేరే వారు కాదు. తెలుగు కూడా అంతే. ఇక తెలుగును వదిలి మనం ఇంగ్లీషు వంటి పాశ్చాత్య భాషలు కోరుకుంటున్నాం. దేశాన్ని వదిలి పోవడానికి సిద్ధ పడుతున్నాం. కన్న తల్లికి కాకుండా ఎవ్వరికో సేవ చేయడానికి పోతున్నాం. ఇక కట్టు బొట్టులోను అదే తీరు, పంచెను వదిలి ప్యాంట్ కు వచ్చాం, కాటన్ బట్టలు వదిలి జీన్స్ ప్యాంట్ లకు వచ్చాం. పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ ఏంటో అందరికి తెలుసు. ఇక పవన్ కళ్యాణ్ మన సంస్కృతి సంప్రదాయాలను ఆచరిస్తాడు. నేతన్నల నేసిన కుర్తాను దరిస్తాడు, కొన్ని సందర్భాల్లో పంచె లుంగీ కదుతాడు. ఇది వృత్తులకు , సంప్రదాయాలకు ఆయన ఇచ్చే గౌరవం.  జనసేనాని పార్టీ స్థాపించి ఏడూ లక్ష్యాలను నిర్దేశించుకున్నాడు.. వాటిలో భాషా వైవిధ్యానికి గౌరవం, మన సంప్రదాయాలు మరియు సంస్కృతికి రక్షణ అనే అంశాలను సైతం నిర్దేశించారు. నిజమైన నాయకుడు ఎప్పుడు తను చెప్పిన అంశాలను ముందు ప్రజలు పాటించడం కాదు తాను పాటిస్తూ ప్రజలకు సైతం పాటించేలా చేస్తాడు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అదే చేస్తున్నారు.పవన్ కి తెలుగన్న, తెలుగు నెలన్న ప్రాణం. మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతున్నారు అంతే కాదు తన కుటుంబంలో వ్యక్తులు కూడా పవన్ లాగే కొన్ని సార్లు పంచె కట్టులో కనిపిస్తారు. అయితే పవన్ అభిమానులుగా ఉన్న మనం, పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తున్న మనం కూడా.. పవన్ కళ్యాణ్ లాగే సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించి.. ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles