20.1 C
New York
Thursday, October 21, 2021

జనసేన నాయకుల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా జనసేనుడి ఆలోచనలు

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన పార్టీ ప్రయాణం చేయడం జనసేన పార్టీ నాయకులకు ఏ మాత్రం కూడా నచ్చడం లేదు అనే అభిప్రాయాన్ని కొంతవరకు వ్యక్తం చేస్తున్నారు. బిజెపి కారణంగా తాము నష్టపోయామనే అభిప్రాయంలో చాలామంది జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమికి భారతీయ జనతా పార్టీ ప్రధాన కారణమని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే.! బహిరంగంగానే దీనిపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా చేశారు. అలాగే 

తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నా సరే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి సీట్ కేటాయించడం పట్ల జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులలో అసహనం వ్యక్తమైంది.  ఈ విషయంలో తమ అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ ఏ మాత్రం కూడా గౌరవించలేదు అని జనసేన పార్టీ నాయకులు ఆగ్రహించిన సంగతి తెలిసిందే.! ఇలా చేయడం ద్వారా అధికార పార్టీకి అలాగే తెలుగుదేశం పార్టీకి పరోక్షంగా సహాయం చేసినట్టుగా ఉంటుంది అనే అభిప్రాయాన్ని చాలామంది జనసేన పార్టీ నాయకులు కూడా వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ అదేవిధంగా తోట చంద్రశేఖర్ ఇద్దరూ కూడా పవన్ కళ్యాణ్ ముందు డెడ్లైన్ పెట్టారని, భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లే అవకాశం ఉంటే మాత్రం ఆలోచన విరమించుకోవాలని, ఒకవేళ తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళితే మాత్రం స్పష్టంగా చెప్పాలని, లేకపోతే తాము కలిసి రాలేమని అని స్పష్టంగా చెప్పారని కూడా మీడియా వర్గాలు అంటున్నాయి. బిజెపి కారణంగా ఇప్పటికే ప్రజల్లో చులకనయ్యామని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే లేకపోతున్నామని విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కూడా గట్టిగా మాట్లాడలేక పోతున్నామని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేని స్థితిలో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుంటే.. సోషల్ మీడియాలో మాత్రం జనసేన నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంతో గాని కొంత మంది మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది నాయకులు ఏకపక్ష వైఖరితో జనసేన పార్టీలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. అయితే దీనికి సంబంధించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం త్వరలోనే పార్టీ నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ తో ఇబ్బంది పడుతున్న పార్టీ నాయకులతో త్వరలోనే ఆయన సమావేశాలు కూడా నిర్వహించాలని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మనోహర్ తో పాటు కొంతమంది నాయకులతో ఆయన వరుసగా సమావేశాలు నిర్వహిస్తారని టాక్. ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి ఏంటనే దానిపై పవన్ కళ్యాణ్ ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారని అంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ముందుకు వెళ్ళాలి అంటే పార్టీలో విభేదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఎంత ఎంత వేగంగా సాధ్యమైతే అంత వేగంగా పార్టీ నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. నాదెండ్ల మనోహర్ దూకుడు కారణంగా చాలామంది నాయకులు పార్టీలో ఉండటానికి ఇష్టపడటం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే వాళ్ళందరి సమస్యలను పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట.  పార్టీ నేతల అభిప్రాయాలను కూడా తీసుకుని బీజేపీ విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి ఏంటనే దానిపై ఆయన ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని  అంటున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
2,990FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!