14.6 C
New York
Saturday, September 25, 2021

కొత్త నియోజకవర్గ వేటలో జనసేనుడు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్న పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికలను టార్గెట్ చేశారు. ఈమధ్యనే  ఆంధ్ర పర్యటనకు వచ్చిన ఆయన తాజాగా నిరుద్యోగుల సమస్యపై పోరాటానికి సిద్ధమయ్యారు. మరోవైపు 2024 ఎన్నికల కోసం కొత్త నియోజకవర్గం వెదుక్కునే పనిలో బిజీగా ఉన్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే పవన్ కల్యాణ్ నియోజకవర్గం వేటలో బిజీ అయ్యారని సమాచారం. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ డిజాస్టర్ ఎదుర్కొన్నారు. గాజువాక, భీమవరం 2 చోట్లా పోటీ చేసి ఓడిపోయారు పవన్. కేవలం తన సామాజిక వర్గం ఓట్లు గెలిపిస్తాయనే నమ్మకం పెట్టుకుని ఆ 2 చోట్లపై గెలుపు తనదే అని భరోసాతో బరిలో దిగారు. కానీ ఫలితం రివర్స్ అయ్యింది. 2 చోట్ల ఓటమి తప్పలేదు. అది ఒకందుకు మంచే జరిగింది.. ఎందుకంటె ప్రస్తుత రాజకీయ ఎత్తుగడలు పవన్ కి అర్ద్మయ్యేలా తెలిసింది.  అందుకే గత పరాజయాలను బేరీజు వేసుకుంటూ ఈసారి కోస్తా నుండి కాకుండా కొత్త నియోజక వర్గం నుండి పోటీ చెయ్యాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గతంలో తాను సీమ నుంచే పోటీచేస్తానని చెప్పినా చివర్లో నిర్ణయం మార్చుకున్నారు. ఈసారి  మాత్రం సీమకే ఫిక్స్ కావాలనుకుంటున్నారట. నియోజకవర్గం మారుస్తున్నారు అనడానికి ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన ఎన్నికల్లో ఓడిన తరువాత ఇటు గాజువాక వైపు కానీ అటు భీమవరం వైపు కానీ కన్నెత్తి చూడలేదు. ఎందుకంటె వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో న్యం చేస్తామని మాయమాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తిత్వం పవన్ కి లేదు. అలా అని తాను న్యాయం చెయ్యాలన్న.. నిలబడాలన్న జనసేన ప్రస్తుతం అధికారంలో లేదు. అందుకే వైజాగ్ విషయంలో మౌనం వహించాడు జనసేనుడు. ఇందుకు ఉదాహరణగా ప్రస్తుతం విశాఖలో స్టీల్ ఉద్యమం ఎగసి పడుతోంది. బీజేపీ మినహా ఏపీలో రాజకీయ పార్టీలన్నీ ఉక్కు ఉద్యమానికి మద్దతుగానే నిలుస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగే పరిస్థితి లేదు. త్వరలోనే అధికారికంగా ఆ పని పూర్తి కానుంది. ఇప్పటికే ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ ఉద్యమ ప్రభావం గాజువాకపై ఎక్కువగా ఉంటుంది. అంటే కచ్చితంగా బీజేపీ లేదా వైసీపీ ఎవరు అక్కడ పోటీలో నిలిచినా వారిని ఓటర్లు తిరస్కరించే అవకాశం ఉంది. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లోనే అది రుజువైంది. అధికార వైసీపీ నేతలకు గాజువాక ఓటర్లు ఓట్ల రూపంలో షాక్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్నామని చెప్పుకున్న వైసీపీనే అక్కడి ఓటర్లు తిరస్కరించారంటే.. ఇక బీజేపీ మద్దతుతో బరిలో నిలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ పవన్ తనకు సరైన నియోజకవర్గం వెతికే పనిని అత్యంత నమ్మకస్తులకు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే వారు ఇప్పటికే పవన్ కు తిరుపతి సూచించారని ప్రచారం ఉంది. ఇటీవల తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల కోసం ఆ ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేశారు పవన్ కల్యాణ్. అక్కడ జనసేనకు మంచి గ్రిప్ ఉందని, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తన సామాజిక వర్గం బలంతో పాటు, అన్ని వర్గాలు మెగా ఫ్యామిలీకి అండగా ఉంటాయని డిసైడ్ అయ్యారట.. అలాగే వచ్చే ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేయకుండా ఒక చోటే ఫిక్స్ అవ్వాలని పవన్ నిర్ణయానికి వచ్చారట. 2 నియోజక వర్గాల్లో పోటీ చేస్తే.. ఓటమి భయంతో 2 చోట్లా పోటీచేస్తున్నారనే విమర్శలు ఎదుర్కోవాలసి వస్తుందని.. అలాగే బీజేపీ పొత్తులో వారికి కొన్ని సీట్లు.. జనసేన నేతలకు సీట్లు కేటాయించడం కష్టం అవుతుంది. తానే 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒకరికి మిగతా అభ్యర్థులకు ఇబ్బంది అనే అంశాన్ని కూడా పవన్ గుర్తించినట్టు సమాచారం. పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసమే అధికారంలోకి రావాలనుకుంటున్న మన జనసేనుడి లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందో తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు నిరీక్షించాల్సిందే మరి.!

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!