23.2 C
New York
Sunday, September 19, 2021

కె.సి.ఆర్. గారు, మన్మోహన్ సింగ్ గారు త్వరగా కోలుకోవాలి

కోవిడ్ బారిన పడిన పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న విషయం తెలుసుకుని 

“ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తన గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని, తన ఆరోగ్యంగా నిదానంగా కుదుటపడుతోందని, తాను క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ..

కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు సూచించారు. అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో 7వేలు.. తెలంగాణలో 4వేలకుపై కరోనా కేసులు నమోదవుతున్నాయి. కానీ, అంతకు కొన్ని రెట్లు కేసులున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు మరింత సన్నద్ధతో వ్యవవహరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అలాగే ఏపీలో కరోనా బారినపడిన వారికి అవసరమైన మేరకు బెడ్స్, అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. పరిస్థితిని ముందే అంచనా వేసి వాటిని ఏర్పాటు చేయకపోవడం వల్లే ఆందోళనకరస్థితి నెలకొందన్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ లేవని రోగులను చేర్చుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. రోగులకు అవసరమైన మందుల కొరత కూడా ఏర్పడిందని.. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యవసర కరోనా కేంద్రాలను భారీగా తెరిచి వైద్య పరీక్షల సంఖ్యను పెంచడంతోపాటు వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు చేపట్టాలన్నారు. కరోనా నిరోధంలో ప్రభుత్వాల చర్యలు ఎలా ఉన్నా ప్రజలు తమవంతు బాధ్యతగా స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. తాజాగా తనకందిన సమాచారం ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిసిందని వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. కె.సి.ఆర్. గారు సంపూర్ణ ఆరోగ్యవంతులై ఎప్పటిలాగే ప్రజా సేవలో నిమగ్నం కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. వారికి కోవిడ్ స్వల్ప లక్షణాలే ఉన్నాయనీ, ఎలాంటి ఇబ్బందీ లేదని వైద్యులు చెప్పడం తెలంగాణ ప్రజలందరికీ ఊరటను కలిగిస్తుంది. అలాగే మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా కరోనాతో ఎయిమ్స్ లో చేరినట్లు సమాచారం అందింది. ఒక ఆర్థిక వేత్తగా, దేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించిన మన్మోహన్ సింగ్ గారు ఈ వ్యాధి నుంచి బయటపడి ఆరోగ్యవంతులు కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. 

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles