8.8 C
New York
Tuesday, December 7, 2021

మీ పార్టనర్ ఇంతకు ముందు ఎవరితో చేశారో తెలుసుకోండి… లేకుంటే? KNOW YOUR PARTNERS EX.. OTHERWISE?

అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒక రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు వారు మధ్య ఉన్న ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు… ముఖ్యంగా ఇంతకుముందు వరకు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి వాళ్ళ అనుభవాలు ఏంటి వాళ్ల కుటుంబ నేపథ్యాలు వాళ్ళ ఫ్రెండ్స్ ఒకవేళ పాస్ట్ లో కనుక వాళ్లకి వేరే ఏమైనా లవ్ స్టోరీ లు ఉంటే గనుక కొంతమంది అవి కూడా కలిసి షేర్ చేసుకుంటూ ఉంటారు… అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇద్దరు వ్యక్తులు ఒక రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు వాళ్ల గత జీవితం తాలూకు శృంగారపరమైన సంబంధాల గురించి కూడా షేర్ చేసుకోవాలి అన్నది… ఎందుకంటే మీరు ఒక కొత్త వ్యక్తితో శృంగారపరమైన సంబంధం పెట్టుకున్నప్పుడు అతను ఇంతకు ముందు ఎలాంటి వారితో శృంగారం జరిపే వాడు??? అప్పుడు అతనికి ఏమైనా సమస్యలు వచ్చాయా?? ఇలా కొంచెం సున్నితంగా అనిపించే అంశాల గురించి కూడా పట్టించుకోవడం అవసరం… అయితే ఇప్పుడు ఉన్న ఈ మోడరన్ వరల్డ్ లో ఇలాంటివి దాదాపుగా అందరూ చేస్తున్నారు… కానీ ఒక్కోసారి తమ పార్టనర్ ను సరిగా అర్థం చేసుకోలేక వాళ్లతో గొడవలు పడి విడిపోతున్నారు… ఇలాంటి విషయాల గురించే  లండన్ కి చెందిన ఒక ప్రైవేటు సంస్థ  ప్రపంచ వ్యాప్తంగా యూత్ గురించి సర్వే చేసిందట… దాంట్లో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి… ఇప్పుడు ఆ వివరాలు మీకోసం…

1 ఇతరులతో శృంగార సంబంధాలు కామన్ అయ్యిపోయింది!!!

ఒకసారి వయసులోకి వచ్చాక ఏ అమ్మాయి లేదా అబ్బాయి అయినా తాము ఇష్టపడ్డ భార్య తో రొమాన్స్ లేదా శృంగారం లాంటివి చేసే ఉంటారు… అయితే కొన్ని కారణాల వల్ల వాళ్లు అలా చేసిన పార్టనర్తో విడిపోవడం జరుగుతూ ఉంటుంది… మళ్లీ తమ జీవితంలో కొత్త పాట్నర్ ని వెతుక్కునప్పుడు కచ్చితంగా వాళ్లతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది… అలాంటి ఆలోచన మంచిదే అయినప్పటికీ మీ గురించిన అన్ని విషయాలను ఒప్పుకునే మీ పార్ట్నర్ ముఖ్యంగా శృంగారం విషయం దగ్గరికి వచ్చేసరికి మీకు వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయన్న విషయం తెలిసి కొంచెం హర్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది… కానీ ఇక్కడే ఎవరైనా సరే కొంచెం మెచ్యూరిటీతో ఆలోచించాల్సిన అవసరం ఉంది… ఎందుకంటే ఏ వ్యక్తికైనా ఒకరికంటే ఎక్కువ మందితో శృంగారం చేయడం అన్నది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది… అలాంటప్పుడు మీరు ప్రేమలో పడ్డ లేదా పెళ్లి చేసుకున్న మీ పార్ట్నర్ కు కూడా అలాంటి సంబంధాలు ఉన్నాయని తెలిస్తే పెద్ద మనసుతో వాళ్ళని స్వీకరించడం నేర్చుకోండి… ఒకరికంటే ఎక్కువ మందితో శృంగారం చేయడం పెద్ద తప్పేమీ కాదు… కానీ ఒకసారి అతను మీతో రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీతో ఎంత నిజాయితీగా ఉన్నారన్న విషయాన్ని మాత్రమే మీరు పట్టించుకోండి.

2. మీ హెల్త్ మీ పార్టనర్ హెల్త్ కూడా ముఖ్యం!!!!

మీ పార్టనర్ ఇంతకు ముందు వేరే వారితో శృంగారం జరిపి ఉంటే అతనికి ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా వచ్చాయా అలాంటివి ఏమైనా అతను ఎదుర్కొన్నాడా అన్న విషయాలు మీరు క్లారిఫై చేసుకోవడం చాలా హెల్ప్ అవుతుంది… ఎందుకంటే ఇవన్నీ శారీరక సంబంధాలు కాబట్టి మీ ఆరోగ్యం అనేది మీ పార్ట్నర్ ఎలా ఉంటున్నారు అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది… అందుకే మీరు రిలేషన్షిప్ లో ఉన్న వ్యక్తి తో కలిసి కూర్చుని అన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడండి… ఒకవేళ వారికి ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే వాటికి సొల్యూషన్ గురించి ఆలోచించండి… మీ వంతుగా మీ పార్ట్నర్ మంచి జీవితం గడపడానికి సాయం చేస్తూ ఉండండి… ఒకవేళ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తే కచ్చితంగా పాటించండి.

3. అనుమానాలు పెంచుకోకండి!!!!

దాదాపుగా ఇప్పుడు ఉన్న యూత్ అంతా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటున్నారు… తాము ఎవరినైనా లవ్ చేస్తే అక్కడ బ్రేకప్ జరిగితే అవన్నీ మర్చిపోయి జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నారు… అయితే తాము ప్రేమించిన లేదా పెళ్లి చేసుకున్న పార్టనర్ గనక ఇంతకుముందు వేరే వారితో శారీరక సంబంధాలు పెట్టుకున్నాడు వాళ్లతో శృంగారం జరిపాడు అన్న విషయాలు తెలిసినప్పుడు మాత్రం వారిలో కొంచెం డిస్టబెన్స్ అనేది మొదలవుతుంది… తమ పార్టనర్ ఇంకా వేరే వాళ్ళతో ఇప్పటికీ శృంగార సంబంధాలు కొనసాగిస్తున్నాడా??? వాళ్లను ఎంతవరకు నమ్మొచ్చు??? అని అనుమానాలు పెంచుకుంటున్నారు… అనవసరంగా ఇలాంటి లేనిపోని అనుమానాలు రావడం వల్ల వారి ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ దెబ్బతింటుంది… ఒకవేళ మీకు అలాంటి అనుమానాలు వచ్చినా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని దాన్ని క్లియర్ చేసుకోండి… మీ పార్ట్నర్ కనుక ఇంకా వేరే వాళ్ళతో శృంగార సంబంధాలు పెట్టుకున్నాడు అని తెలిస్తే వారికి బ్రేకప్ చెప్పండి… అంతేగాని మనసులో అనుమానం పెట్టుకొని ఆ రిలేషన్ షిప్ లో ఉండకండి.

4. శృంగారమే జీవితం కాదు క్షమించడం నేర్చుకోండి!!!

మీరు ఒక వ్యక్తిని ఇష్టపడి ప్రేమించే అతనితో రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయినప్పుడు వారి గురించి మీకు ఏమైనా భరించలేని నిజాలు తెలిసినట్టు అయితే ముఖ్యంగా శృంగారం లాంటి విషయంలో వారి గత అనుభవాలు అంత మంచివి కాదని మీకు అర్థం అయినప్పుడు నిజంగా మీకు ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటే అవన్నీ మర్చిపోండి… వాళ్లు అలాంటి తప్పులు చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్లను క్షమించండి… ఎందుకంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే శృంగారం మాత్రమే జీవితం కాదు… దాని కంటే విలువైనవి గొప్పవి జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి… ఒకవేళ మీకు మీ పార్ట్నర్ శృంగార జీవితం గురించి ఏవైనా పాత జ్ఞాపకాలు తెలిసి మీరు డిస్టర్బ్ అయ్యి మెంటల్గా అప్సెట్ అయితే కనుక వారిని పెద్ద మనసుతో క్షమించి ఒకసారి అన్ని మర్చిపోండి… వాళ్లతో కలిసి మీరు మరొక కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి.


సో ఫ్రెండ్స్ అవ్వండి మీరు ఒక రిలేషన్ షిప్ లో ఉన్న లేదా ప్రేమించిన లేదా పెళ్లి చేసుకున్న మీ పార్ట్నర్ గనక అతని గత జీవితం లో ఏవైనా శృంగారపరమైన సంబంధాలు పెట్టుకుని ఉంటే ఒకటికి  రెండుసార్లు వాళ్లతో అన్ని విషయాలు డిస్కస్ చేసి మీ అనుమానాలను క్లియర్ చేసుకోండి… అలాగే వాళ్ళు ఏమైనా పొరపాటు చేసినట్లు మీకు తెలిస్తే కనుక వారిని క్షమించి ఇద్దరూ కలిసి మళ్లీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి… విష్ యూ ఆల్ ది బెస్ట్!!!! 

Related Articles

Stay Connected

0FansLike
3,050FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!