24.7 C
New York
Sunday, September 19, 2021

జనసేనను తెర వెనుక వుండి నడిపిస్తున్న నాయకుడెవరు.?

మెగాస్టార్ చిరంజీవి 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేసి చెప్పుకోదక్క స్థాయిలోనే సీట్లు సాధించారు కానీ Cm అవ్వాలన్న తన కలకి చాలా దూరంగానే ఆగిపోయారు.. ఆ తర్వాత కాల గమనంలో రాజకీయాలకి దూరమయ్యారు సాధారణంగా ఎవరైన తాను సాధించింది తమ వారసులు సాధించాలని ఆశిస్తూ ఉంటారు, దాని కోసం తమ వంతు సాయం అందిస్తుంటారు.. ఇపుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అదే ప్లాన్ చేసారని పబ్లిక్ టాక్ వినిపిస్తుంది. రాజకీయ పరంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టి ప్లాప్ అయినా చిరంజీవి తన కోరికను తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ద్వారా తీర్చుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో విఫలమయ్యాక ఇక పాలిటిక్స్ కి దూరంగా ఉంటూ సినిమాల్లో మాత్రమే నటిస్తుంటారని అందరు భావించారు కానీ అంతకుమించిన వ్యవహారం తెర వెనుక నుండి నడుపుతున్నారని తాజా సమాచారం. ఇన్నాళ్లు చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారని తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకి చిరంజీవి మద్దతు లేదని మెగా ఫాన్స్ బాధపడ్డారు కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం వెనక చిరంజీవియే ఉన్నారని, ఆయన అటు సినిమా ఇటు  రాజకీయా జీవితాలను కూడా తీర్చిదిద్దుతున్నారని తాజాగా నాదెండ్ల మనోహర్ సంచలన కామెంట్స్ చేసారు.. చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వాడానికి సిద్ధమౌతున్నారని.. జనసేన పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో పట్టు సాధించడానికి కష్టపడుతున్నారు అనే విషయం నాదెండ్ల మనోహర్ మాటలను బట్టి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు చిరంజీవి సూచనలు తీసుకుంటున్నారని, మెగాస్టార్ తన సుదీర్ఘ రాజకీయ ఎండింగ్స్ లో పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇస్తున్నారు.. ఎప్పుడు పవన్ కళ్యాణ్ కి అండగా ఉంటారని నాదెండ్ల చెప్పడం విశేషం.. చిరంజీవి సలహా మేరకు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నారని,  రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ పవన్ కళ్యాణ్ కొన్ని సంవత్సరాలు సినిమాల్లో కూడా నటించాలనీ చిరంజీవియే సూచించారని, పవన్ కళ్యాణ్ తన అన్నయ సలహాలు అనుసరిస్తున్నారని నాదెండ్ల చెప్పారు.. పవన్ కళ్యాణ్ కి చిరంజీవి గారు నైతిక మద్దతు ఇస్తున్నారని తన సోదరుడు కి మద్దతుగా కచ్చితంగా బహిరంగంగా బయటకి వస్తారని ఈ సందర్భంగా హామీ ఇచ్చారని తెలిపారు.. నాదెండ్ల చెప్పింది గనక నిజం అయితే అది జనసేనకి పెద్ద ధైర్యాన్ని ఇస్తుందని ఆంధ్రాలోని జనసేన పార్టీ రాజకీయ అధికారం దిశగా నడిపిస్తుందని ఆశపడుతున్నారు. మెగాస్టార్ జనసేన ద్వారా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయ్ అని జనసేన నేతలు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడానికి చిరంజీవి తన స్కెచ్ గీసారని కూడా అంటున్నారు అయితే దీనిపై చిరంజీవి నుంచి మాత్రం ఎలాంటి అధికారక ప్రకటన రాలేదు.. చిరంజీవి స్పందిస్తే కానీ జనసేనకి చిరు మద్దతు ఉందా తమ్ముడు పవన్ కళ్యాణ్ వెనకాల చిరంజీవి ఉన్నారా అనే విషయాలేవీ ఇంకా వెలుగులోకి రాలేదు. అయితే తమ సామజిక వర్గాన్ని ఏకం చేసి బీసీల మద్దతు కూడగట్టగలిగితే జనసేనకి మెరుగైన అవకాశాలు ఉంటాయి అని జనసేన నేతలు నమ్ముతున్నారు.. చిరంజీవి కూడా ఈ తరహాగా ఆలోచనలను చేసి జనసేనని వెనక నుండి నడిపించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మరియు పింక్ రీమేక్ లో సినిమాలో బిజీ ఉన్నపటికీ రాజకీయాల్లో కూడా తన సమయాన్ని తప్పకుండ కేటాయిస్తారని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles