17.8 C
New York
Tuesday, September 21, 2021

జనసేనాని కి ఒక్క అవకాశం ఇద్దాం ..!

రాయలసీమ ఈ పేరు తెలియని తెలుగు వారుండరు. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను వినని వారు ఉండరు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారే, ఎన్నో ఏండ్లు పరిపాలన చేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నది.. కీలకంగా పని చేస్తుంది ఆ ప్రాంతం వారే.. అంతే కాదు టీడీపీ వైసీపీలో ఎంతో మంది గొప్ప నాయకులం అని చెప్పుకునే వారు సైతం రాయలసీమ ప్రాంతం వారే.. మరి ఇంత మంది నాయకులు ఉన్న ప్రాంతం నాటి నుంచి నేటి వరకు కరువు ప్రాంతంగానే కొనసాగుతుంది. రాయలసీమలో రత్నాలు పండిస్తామన్న నాయకులు ఏమయ్యారు.? ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతం.. సరైన నీరు ఉండవు.. పంటలలు సరిగ్గా పండవు. అయితే రాయలసీమ కేవలం ఇప్పుడు మాత్రమే కాదు నాటి నుంచి అదే స్థితిలో కోనసాగుతుంది. ఉమ్మడి పాలకులు ఆంధ్రప్రదేశ్ నాయకులే అయినప్పటికీ ఆ ప్రాంతం పరిస్థితి మారలేదు.. రాష్ట్ర విభజన తరువాత కూడా రాయలసీమ పప్రాంతం పరిస్థితిలో మార్పు రాలేదు. పేరుకే నీటి ప్రాజెక్ట్లు అంటూ వాటిని పేపర్లకే పరిమితం చేస్తున్నారు నాయకులు. రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ రాయలసీమకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు.. అంతే కాదు ఉమ్మడి రాష్ట్రంలోను టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాయలసీమ అభివృద్ధి శూన్యం. ఇక ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూడా రాయలసీమ అభివృద్ధిని పక్కన పెట్టేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం అదే తీరును కొనసాగించింది. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ రాయలసీమ అభివృద్ధిని మాటల్లోనే చేస్తుంది తప్ప చేతల్లో చేయడం లేదు, ఇక ప్రతిపక్షంగా ఉన్న టిడిపి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు.. ఎందుకంటే మేము చేయలేదు, ఇక వైసీపీ ఏం చేస్తుందిలే అనుకున్నతున్నారు ఏమో.! ఇప్పుడిప్పుడే బలంగా తయారవుతున్న జనసేన రాయలసీమ పై అభివృద్ధి పై గొంతు ఎత్తుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. రాయలసీమ జిల్లాల అభివృద్ధి కోసం., అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాలు అందజేయడంలో అధికారపక్షం చూపుతున్న నిర్లక్ష్యం కారణంగా ఇబ్బందులు పడుతున్న వారి తరుపున పోరాడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిర్ణయించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమలో పర్యటించి రాయలసీమ ప్రాంత ప్రజలకు ధైర్యం చెప్తున్నాడు. రాయల సీమ రైతాంగం సమస్యలు తెలుసుకునేందుకు రాయలసీమ జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ‘జనసేన ఆత్మీయ యాత్ర’ పేరుతో సీమ సమస్యలపై రైతాంగం, మేధావులతో చర్చించారు జనసేనాని. రైతులు పడుతున్న కష్టాలను నేరుగా తెలుసుకుని వారి సమస్యలపై స్పందించి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు. తనకి అసలు ఓట్లు వేయకున్న కూడా ప్రజల కోసం.. మూడు పూటలా తిండి పెడుతున్న అన్నదాతల కోసం, తన తల్లిదండ్రులలాంటి వారి కోసం.. తోబుట్టువుల వంటి అక్క చెల్లి అన్న తమ్ముడి కోసం.. వారి జీవితాలను  సుఖంగా సంతోషంగా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ రాయలసీమలో తిరిగి అందరి కష్టాలను కన్నీటిని కళ్లారా చూసాడు. నేను ప్రజా నాయకుడిని చెప్పే ఒక్క రాజకీయ నాయకుడు అయిన మీ దగ్గరకి వచ్చి.. మీ సమస్యను పరిష్కరించడా.. కనీసం మీ దగ్గరకు వచ్చి మీ సమస్యను అడిగాడా.. పవన్ కళ్యాణ్ కి మనం ఒక్క ఓటు వేయకున్న కూడా ఎటువంటి స్వార్థం లేకుండా రాయలసీమ ప్రజల కష్టాలను తెలుసుకుని, కన్నీటిని తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఒక్కసారి ఆలోచించండి ఏళ్లకు ఏళ్ళు పాలించిన నాయకుడు కనీసం ఓ చూపు కూడా చూడలేదు.. కానీ తనని మనం గెలిపించకపోయిన కూడా మనకోసం మన సమస్యలను తన సమస్యలుగా భావించి పాలకులని ప్రశ్నిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి ఎటువంటి పదవి అధికారం లేకుండా మన కోసం ఇంత ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ ని ఎందుకు గెలిపించలేం.. ఆయన అధికారంలో పదవిలో ఉంటే మన గురించి ఇంకెంత చేస్తాడు.. కాబట్టి మనం జనసేన కి ఓటు వేసి.. పవన్ కళ్యాణ్ కి అధికారం  ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related Articles

Stay Connected

0FansLike
2,950FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!