17.8 C
New York
Tuesday, September 21, 2021

జనసేనాని రాజకీయాలకు పనికి రాడు అనే వాళ్ళకి ఇదే మన సేన సమాధానం….

చదువులో ఫెయిల్ అయిన వ్యక్తి ఏం సాదిస్తాడు లే.. అనుకునే వారికి సమాధానం అతడు… రాజకీయపు బాటలో ఉన్న ముళ్ల కంచెను దాటుకుంటూ.. రాజకీయం అంటే చుక్క ముక్క అనే వారికి సమాధానం అతడు… పవన్ కళ్యాణ్ నడిచే వ్యక్తి కాదు.. ఒక శక్తి అని తెలియజేశారు.. అవినీతి నాయకుల గుండెల్లో గుబులు పుట్టించాడు..పవన్ కళ్యాణ్ కు ప్రజలంటే ప్రాణం. సమాజానికి సేవ చేయాలనే తపనతో, తన పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యవజన విభాగం అధ్యక్షుడుగా పవన్ పార్టీ ప్రచారం చేశారు. దీంట్లో 19 అసెంబ్లీ స్థానాల్లో పాటు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది ప్రజారాజ్యం పార్టీ. తర్వాత పార్టీని నడిపించడం కష్టంగా భావించిన చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, కేంద్ర మంత్రిగా పదవీ పొందాడు. అన్న తీరును విభేదించిన పవన్ కళ్యాణ్ తర్వాత కొన్ని రోజుల పాటు అన్నింటికీ దూరంగా ఉన్నాడు.తనకు సమాజం పట్ల ఉన్న ఆసక్తి, సేవ చేయాలనే తపన తో, ప్రజలకు అవినీతి రాజకీయ నాయకులు చేసే అరాచకాలను చూసి పవన్ తట్టుకోలేకపోయాడు. దీంతో 2014 మార్చి 14 న ప్రజల ముందుకు వచ్చాడు, తనలో ఉన్న బాధ అనే అగ్ని పర్వాతాన్ని కొల్లగొట్టాడు. ఎప్పుడూ 5 నిమిషాలకు మించి మాట్లాడాని వ్యక్తి దాదాపు రెండు గంటల పాటు అనర్గళంగా ప్రజలకు తన భావాలను తెలిపాడు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తెలిపాడు.రాష్ట్రాన్ని విభజించినతీరుకు కాంగ్రెస్ ను దోషిగా నిందిస్తూ, కాంగ్రెస్ ఎన్నికలలో గెలవకుండా పోరాడాలని తన అభిమానులకు పిలుపునిచ్చాడు.అతను 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశాడు. జనసేనపార్టీతో మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికి… తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ-బీజేపీ కూటమికి ప్రచారం చేశాడు.ఇతని ప్రచారంతోనే టి.డి.పి ఏపీలో అధికారంలోకి రాగలిగింది. కాంగ్రెస్ హటావ్- దేశ్ బచావ్ అన్న ఆయన నినాదాన్ని అందుకున్న అభిమానులు, ప్రజలు ఏపీలో ఒక్కసీటుకూడా కాంగ్రెసుకు దక్కనివ్వలేదు.ఆచరణ పూర్వకమైన విధానాలతో ప్రజానాయకుడిగా ఉద్దానం, డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రైవేటీకరణ వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాడు. కానీ ఆతరువాత తన పార్టీని పటిష్టం చేసుకోకుండా తిరిగి సినిమాలలో నటించడం మొదలు పెట్టాడు. 2019 లో జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీని పోటీకి నిలిపాడు.స్వయంగా భీమవరం, గాజువాకలలో రెండు చోట్ల పోటీ చేసాడు పవన్ కళ్యాణ్ . ఈ ఎన్నికలలో తాను రెండు స్థానాలలోనూ పరాజయం పాలవ్వగా జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానంలో గెలుపొందగలిగింది. తెలంగాణాలోనూ పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. అయితే నాకు గెలుపు ముఖ్యం కాదు.. నా సిద్దాంతము ప్రశ్నించటం అని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులో , ప్రజలో ఉత్సాహం నింపాడు. ప్రస్తుతం BJP కలిసి తన పార్టీ ప్రాయాణాన్ని సాగిస్తున్నాడు. ఇంటికి నడపడానికి డబ్బు కావాలి.. డబ్బు కాలిగా కూర్చుంటే రాదు కదా, అలానే పార్టీని  నడపాలంటే ఎంతో కొంత ఖర్చు ఉంటుంది.. మరి దానికి డబ్బు కావాలి.. అందుకే తనకు తెలిసిన సినిమాలనే నమ్ముకుని మళ్ళీ సినిమాలు చేస్తూ డబ్బు సంపాదించి పార్టీకి ఇంటికి పెడుతున్నాడు.. మళ్ళీ మీరు విమర్శలు చేస్తారు.. రాజకీయాలకు పవన్ పనికి రాడు.. సినిమాలు చేస్తూ రాజకీయం ఎలా చేస్తాడని.. అవును నిజమే పవన్ కళ్యాణ్ పనికి రాడు మీల దొంగ దారుల్లో డబ్బు సంపాదించడానికి, మీల బినామిలను పెట్టి వ్యాపారాలు పెట్టడానికి.. మీల అవినీతి చేసి జైల్లో ఉండటానికి.. పవన్ కి తెలిసింది ఒక్కటే ప్రజలు.. వారి కోసం నిలబడటం..పవన్ ని విమర్శిస్తున్న వారు ఒక్కసారి మీకు ఆత్మ అనేది ఉంటే.. దాని సాక్షిగా నిజం చెప్పండి అసలు పవన్ ని విమర్శించే అర్హత మీకుందా.? అసలు ఎందుకు మాట్లాడుతున్నామో తెలియని రాజకీయ నాయకులు ఈరోజు పవన్ ని విమత్సహిస్తున్నారు. అసలు ఒక నేత మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడుతున్నారా.. మీకు గొంతు ఉంది కదా అని నోటికి వచ్చినట్టు అరుస్తున్నారేమో.! జనసేనాని కేవలం ఒక్క సైగ చేస్తే మీ రాజకీయ పీఠం కదిలిపోతుంది.. మీరు గెలిచింది డబ్బుతో.. ఆయన ఓడిపోలేదు ఆయనే గెలిచారు.. రాబోయే తరానికి ఆయనే మహాత్ముడు.ప్రజలు ఆపదలో ఉన్నారంటే ఆయనకు పార్టీ కులం మతం వర్గంతో సంబంధం లేదు.. ఆదుకోవడం ఒక్కటే తెలుసు, ఆయన సంపాదించిన దాంట్లో సగానికి పైగా పేద ప్రజలకు అందేలా చేస్తాడు పవనుడు.సేవే ఊపిరిగా ప్రజలే ప్రాణంగా, పోరాటమే తన జీవితంగా, స్వార్ధం లేని ప్రజా నాయకుడిగా… తన జీవితాన్ని సేవకు అంకితం చేసిన పవన్ కళ్యాణ్ … తన లక్ష్యాన్ని చేరుకుని ఉన్నత శిఖరాలకు చేరుకుని..  మన దేశం ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు

Related Articles

Stay Connected

0FansLike
2,950FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!