23.3 C
New York
Thursday, September 16, 2021

ఛీట్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నా, ఎందుకంటే???

భార్య భర్త, పతి పత్నీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఏ భాషలో చెప్పుకున్నా ఆడ మగ మధ్య ఒక మధురమైన సంబంధమే పెళ్ళి!!! ఇద్దరు మనుషులు కలిసి జీవిత చరమాంకం వరకు చేసే అందమైన జర్నేనే మ్యారేజ్ అయితే ఈ బంధం అందరి జీవితాల్లో ఓకే విధంగా ఉండదు కొందరి జీవితాల్లో వెలుగు నింపితే మరికొందరి జీవితంలో చీకట్లు అలుముకునెలా చేస్తుంది. సరైన జీవిత భాగస్వామి దొరికితే వివాహ బంధం ఎంత అద్భుతంగా వుంటుందో అలా దొరకకపోతే దానంత నరక కూపం ఇంకోటుందదు… అందుకే చాలా మంది పెళ్లికి ముందు ఎంత మందితో ప్రేమ కలాపాలు సాగించిన పెళ్లి మాత్రం మంచి వ్యక్తితో జరగాలని కోరుకుంటారు.మన దేశంలో పెళ్లిని ఒక పవిత్ర బంధంగా చూస్తారు ఒకసారి పెళ్లి చేసుకుంటే ఇక చచ్చేవరకు ఆ వ్యక్తి తోడు విడవ కూడదు అంటారు. ఒక పెద్ద పండగలా ఆ వ్యక్తి లైఫ్ లో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా చాలా గ్రాండ్ గా పెళ్ళి చేసుకుంటారు. 


అయితే ఈ మోడ్రన్ యుగంలో పెళ్ళి అనేది ఒక విధంగా చెప్పాలంటే పెద్ద జోక్ లా తయారయ్యింది… ఎంతో ప్రేమించుకుని పెళ్లి చేసుకుని కేవలం వారంలోనే విడిపోతున్నారు… అట్టహాసంగా ఊరంతా పిలిచి పెళ్లి చేసుకుని ఆరు నెలల్లో విడాకులు కూడా తీసుకుంటున్నారు… వీటికి కట్నం అని భార్య భర్తల మధ్య మనస్పర్ధలు అని ఒకరిని ఇంకొకరు చీటింగ్ చేశారని ఇలా ఎన్నో కారణాలు చెపుతున్నారు. మనం ఒక కొత్త వ్యక్తిని నమ్మి పెళ్లితో మన జీవితంలోకి ఆహ్వానిస్తే ఆ వ్యక్తి మనల్ని మోసం చేయడం అన్నది నిజంగా ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది అలాంటి వాళ్ళను దాదాపుగా ఎవరూ క్షమించరు కూడా మరి అలాంటిది ముంబైలో ఒక పెద్ద సాప్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న శ్యామ్ మాత్రం పెళ్లికి ముందే అది కేవలం ఇంకో వారంలో పెళ్లి ఉంది అనగా తనకు కాబోయే భార్య అయిన రియా తనని చీట్ చేస్తూ కనిపించినా ఆమెను క్షమించి తననే పెళ్ళి చేసుకున్నాడు. అదేంటి మోసం చేస్తూ తన పార్టనర్ తనకే దొరికినా ఆవిడను క్షమించి శ్యామ్ ఎందుకు పెళ్ళి చేసుకున్నాడు అంటారా?? అయితే పదండి అసలు ఆయన స్టోరీ ఏంటో తెలుసుకుందాం… 

శ్యామ్ అందరిలానే మామూలు యువకుడు ఒక మంచి అమ్మాయి దొరికితే తనని పెళ్ళి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకుని ఎన్నో కలలు కన్నాడు… ఇంట్లో వాళ్ళు ఒక మంచి సంబంధం కూడా చూశారు అమ్మాయి పేరు సరిత పరువు గల కుటుంబం ఒక్కతే కూతురు ఆమె ఫ్యామిలీలో అందరికీ శ్యామ్ చాలా బాగా నచ్చాడు ఇటు శ్యామ్ అమ్మానాన్నలకు కూడా సరిత నచ్చడంతో ఒకరోజు పెళ్లి చూపులు జరిగాయి. శ్యామ్ ఎలాంటి మొహమాటం లేకుండా సరితతో అన్ని విషయాలు మాట్లాడాడు తన లైఫ్ తన ప్లాన్స్ అన్నిటి గురించి ఆమెతో పెళ్లికి ముందే డిస్కస్ చేసాడు. సరితకు శ్యామ్ అన్ని విధాల నచ్చడంతో ఇరు కుటుంబాలు రెండు నెలల్లో పెళ్లి పెట్టుకున్నారు. సరిత, శ్యామ్ లు ఆ రెండు నెలల్లో చాలా క్లోజ్ అయ్యారు సినిమాలు, షాపింగ్ అంటూ బాగానే తిరిగారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కూడా… ఇటు శ్యామ్ పెళ్లికి తన ఫ్రెండ్స్ ను , బంధువులను కూడా ఇన్వైట్ చేసాడు. 


అంతా శ్యామ్ అనుకున్నట్టే జరిగిపోతుంది అయితే ఒకరోజు సరితను పికప్ చేసుకోవడానికి ఒక షాపింగ్ మాల్ దగ్గరికి వచ్చిన శ్యామ్ అక్కడ సరిత మరొక అబ్బాయితో రొమాన్స్ చేస్తూ కనిపించింది దాంతో ఒక్కసారిగా శ్యామ్ షాక్ అయ్యాడు తన సరిత తను ఒక వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇంకొక అబ్బాయితో రొమాన్స్ చేస్తూ కనిపించింది అది చూసి తట్టుకోలేక అక్కడి నుంచి ఇంటికి వెళ్లి తన రూమ్ డోర్ వేసుకుని ఎంతో ఏడ్చాడు… సరిత మంచి అమ్మాయి అనుకుంటే తన అసలు స్వరూపం ఇదా అంటూ ఎంతో బాధ పడ్డాడు… బయటి నుంచి ఇంట్లో అమ్మానాన్న బంధువుల పెళ్లి హడావిడి వాళ్ళ మాటలు వినిపించాయి… వాళ్లంతా తన పెళ్లి అని ఎంతో సంతోషంగా ఉన్నారు… తనేమో ఫ్రెండ్స్, రిలేటివ్స్, తన కొలీగ్స్ ఇలా అందరినీ పెళ్లికి పిలిచాడు… అన్నిటికంటే ముఖ్యంగా పెళ్లికి విపరీతంగా ఖర్చు పెట్టాడు దానికోసం ఎన్నో అప్పులు కూడా చెయ్యాల్సి వచ్చింది ఇప్పుడు సడెన్ గా తన పెళ్లి కేన్సిల్ చేసుకుంటే ఆ డబ్బులో ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు పైగా తను సడెన్ గా పెళ్లి ఆపేస్తే తన పేరెంట్స్ కు, ఫ్రెండ్స్ కు, బంధువులకు ఏమని సమాధానం చెపుతాడు చెప్పినా వాళ్ళు తనని అర్థం చేసుకుంటారా?? ఇవన్నీ ఆలోచించిన శ్యామ్ కు ఏం చేయాలో అర్థం కాలేదు… పెళ్లికి ముందు రోజు వరకూ ఎంతో తర్జన భర్జన పడ్డాడు కానీ చివరకు అసలేం జరగనట్టు సరితను పెళ్లి చేసుకున్నాడు. శ్యామ్ అలా ఎందుకు చేసాడు? సరితను ఎందుకు క్షమించాడు?? 


దానికి ఒక్కటే కారణం డబ్బు… అవును డబ్బే… శ్యామ్ తన పెళ్లి కోసం చేసిన ఖర్చులు అప్పులు తీర్చడానికే కొన్ని సంవత్సరాలు పడుతుంది… ఇక పెళ్లి కేన్సిల్ చేసుకున్నా కూడా ఆ అప్పులు కట్టక తప్పదు అందుకే జరిగింది మర్చిపోయి సరితను పెళ్లి చేసుకున్నాడు. రెండో కారణం సరిత తనని చీట్ చేసింది అయితే ఏంటి ఆమెను క్షమిద్దాం అనుకున్నాడు… దానికి తనింట్లో వాళ్ళ అమ్మతో జరిగిన ఒక సంఘటన ఆ నిర్ణయం తీసుకునేలా చేసింది… అదేంటంటే బయట నుంచి ఇంట్లోకి వచ్చిన శ్యామ్ కు ఏదో కూర చేసిన వాళ్ళ అమ్మ దాని రుచి చూడమని ఇచ్చిందట అయితే దాని రుచి కొత్తగా ఉందని శ్యామ్ చెపితే వాళ్ళ అమ్మ ఇంట్లో సరైన మసాలాలు లేక దీంట్లో వేరే మసాలా వేసి చేశా అని చెప్పిందట… ఆ మాటలు విన్న శ్యామ్ కు తనేం చేయాలో క్లియర్ గా అర్థం అయ్యిందట… సరిత తనని చీట్ చేసినా తను ఆవిడతో సరిగ్గా వుండి ఆమెను మార్చుకోవచ్చు కదా అలా కూడా తన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు కదా అనుకుని హ్యాపీగా శ్యామ్.. సరితను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తను అనుకున్నట్లే చేసి,ఆమె ఆలోచనల్లోంచి ఆ బోయ్ ప్రెండ్ ని తొలిగించి..ఆ ప్లేస్ లోకి తను వచ్చాడట. 


అదండీ మన శ్యామ్ సరితల స్టోరీ… ఒక్కోసారి మన పార్టనర్ తెలిసో తెలియకో మనల్ని చీట్ చేసినప్పుడు ఒక్కసారి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడం అన్నది మంచిదే కావొచ్చు అయితే ప్రతిసారీ ఇస్తే మొదటికే మోసం కూడా రావొచ్చు… సో మీ లైఫ్ పార్టనర్ ను జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles