23.2 C
New York
Tuesday, September 21, 2021

రతన్ టాటాను రాష్ట్రపతి చేయాలి.. మెగా బ్రదర్ కొత్త నినాదం వెనుక జనసేన హస్తముందా.?

మెగా బ్రదర్ కొత్త నినాదం ఎత్తుకున్నారు. తన డిమాండ్ ఏంటో బయట పెట్టారు. రాష్ట్రపతి పదవి ఎవరికి ఇవ్వాలో సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం అటు రాజకీయంగా…ఇటు సినీ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే…..మెగా బ్రదర్‌ నాగబాబు సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. నిత్యం ఏదో అంశం మీద కామెంట్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా నాగబాబు రాష్ట్రపతి అంశంపై స్పందించారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని.. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలన్నారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ రాష్ట్రపతిగా రతన్‌టాటా పేరును సూచించి.. అందరిని ఆశ్చర్యపరిచారు నాగబాబు. దేశంలోనే అతి పెద్ద ఇండస్ట్రీయలిస్ట్‌లో ఒకరైన రతన్‌ టాటా తదుపరి రాష్ట్రపతి కావాలని నాగబాబు తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో తెలిపారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం దాదాపుగా మరో ఏడాది వరకు ఉంది. దీని పైన జాతీయ స్థాయిలో కూడా గత కొన్ని రోజులుగా అప్పుడప్పుడు చర్చలు జరుగుతున్నా…నిర్దిష్టంగా ఎవరు పోటీలో ఉంటారనే అంశం పైన మాత్రం క్లారిటీ లేదు. ఇక ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ తదుపరి రాష్ట్రపతి రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ దాని గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అలాంటిది ఇప్పుడు ఇంత సడెన్‌గా రాష్ట్రపతి ఎన్నిక అంశం పైన నాగబాబు ఎందుకు స్పందించారనేది అంతు చిక్కని విషయం. ‘‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులును ఎదుర్కొంటుంది. రోజు రోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇలాంటి సమయంలో తదుపరి రాష్ట్రపతి రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు పన్నే వ్యక్తి కాకుండా.. దేశాన్ని తన కుటుంబంలా భావించి ప్రేమించే వ్యక్తి అయితే బాగుంటుంది. భారత దేశ తదుపరి రాష్ట్రపతిగా నేను ప్రతిపాదించే వ్యక్తి ఎవరంటే రతన్‌టాటా గారు’’ అంటూ నాగబాబు ట్వీట్‌చేశారు. దాంతో పాటు #RatanTataforPresident అనే హ్యాష్‌ ట్యాగ్‌ని షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆయన వ్యక్తిగతంగా రతన్ టాటాను రాష్ట్రపతిగా కోరుకోవటంలో అభ్యంతరం లేకపోయినా… ఆయన ఇప్పటికీ జనసేనలో ఉన్నారు. జనసేన-బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతోంది. కేంద్రంలో తదుపరి రాష్ట్రపతి ఎంపికపైన అధికారంలో ఉన్న బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎలక్ట్రాల్ కాలేజ్ లో ఉన్న బలం ఆధారంగా రాష్ట్రపతి ఎంపిక జరుగుతుంది. జనసేనకు రాష్ట్రపతి- ఉప రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్ట్రోల్ కాలేజ్ లో ప్రాతినిధ్యం లేదనే చెప్పాలి. అసెంబ్లీలో ఉన్న ఒక్క అభ్యర్ధి వైసీపీని అనధికారంగా మద్దతిస్తున్నారు. అయితే, నాగబాబు దేశంలో పరిస్థితులను వివరిస్తూ.. ఎలాంటి రాష్ట్రపతిని కోరుకుంటున్నారో చెబుతూ ప్రస్తావించిన అంశాల పైన చర్చ జరగుతోంది. ఎవరినైనా ఉద్దేశించి కావాలనే నాగబాబు అలా కామెంట్ చేసారా .. అలా వ్యవహరిస్తున్న వారు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే, వ్యాపార రంగంలో రాణించి.. మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకొనే రతన్ టాటా పేరును సైతం సడెన్ గా  ఈ సమయంలో నాగబాబు ఎందుకు ప్రస్తావించారనే ఆసక్తి కర చర్చ సాగుతోంది. రతన్ టాటాను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు బీజేపీ నుంచి ఏమైనా జరుగుతున్నాయా.. మిత్రపక్ష పార్టీగా జనసేనకు ఆ రకమైన సంకేతాలు ఏమైనా అందాయా అనేది మరో ప్రశ్న. రాష్ట్రపతి ఎన్నిక గురించి ప్రస్తావిస్తూ..ఎత్తుకు పై ఎత్తు వేసే వారు కాకుండా అంటూ నాగబాబు తన ట్వీట్ లో ప్రస్తావించటం పెద్ద దుమారమే రేపుతోంది. ఆయన ఉద్దేశం ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎవరు ఆ రకంగా ఎత్తుకు పై ఎత్తులు వేసారనే ప్రశ్నలు మొదలయ్యాయి. రాష్ట్రపతి పదవి గురించి స్పందించే సమయంలో ఇటువంటి కామెంట్స్ సరైనవేనా అనే చర్చ వినిపిస్తోంది. టాటా కుటుంబం దేశానికి అందించిన సేవల కారణంగానే ఆయన పేరు నాగబాబు ప్రస్తావించారని సన్నిహితులు చెబుతున్నారు. కలాం తరహాలో రాష్ట్రపతిగా రతన్ టాటా సమర్ధుడిగా నాగబాబు చెబుతున్నారు. అయితే, రతన్ టాటా కంటే సమర్ధులు లేరా అంటే తాను సమాధానం చెప్పలేనని కామెంట్ చేశారు. రతన్ టాటా బ్రహ్మచారిగా ఉంటూ.. దేశానికి ఎంతో సేవలు చేసారని చెప్పారు. గతంలో రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని కోరగా..తాను భారతీయుడిగా పుట్టటమే గొప్పగా ఆయన భావించారని… తనకు అది చాలంటూ..ఇక, భారత రత్న ఎందుకని ప్రశ్నించిన గొప్ప వ్యక్తి రతన్ టాటా అంటూ నాగబాబు కీర్తించారు. తన వ్యక్తిగత అభిప్రాయంటూ రతన్ టాటా పేరును నాగబాటు ప్రతిపాదించానా.. దీని పైన పవన్ స్పందించాల్సిన అవసరం రానున్న రోజుల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక, ప్రస్తుత రాష్ట్రపతి – ఉప రాష్ట్రపతి ఎంపిక సమయంలో 2 తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ- వైసీపీ-టీఆర్ఎస్ 3 పార్టీలు బీజేపీ ప్రతిపాదిత అభ్యర్ధులకే మద్దతు ప్రకటించారు. ఇక, రాష్ట్రపతి ఎన్నికలకు ముందే అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. అందులో ప్రధానంగా ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటే కాషాయ పార్టీకి ఎలక్ట్రోల్ కాలేజ్ లో బలం పెరుగుతుంది. రాజ్యసభలో సీట్లు పెరిగే అవకాశం ఉంది. అయినా..రాజ్యసభలో వచ్చే ఏడాది మరో 4 సీట్లు వైసీపీకి పెరగనున్నాయి. వీటి ద్వారా వైసీపీ బలం పదికి చేరుతుంది. దీంతో.. .బీజేపీ రాష్ట్రపతి ఎన్నికతో పాటుగా పెద్దల సభలో ముఖ్యమైన బిల్లులకు వైసీపీ మద్దతు అవసరం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇక, కొద్ది కాలం క్రితం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి రేసులో ఉన్నారనే ప్రచారం సాగుతున్నా..ఆయన ఖండించారు. ఏది ఏమైనా…ఇప్పుడు నాగబాబు సడన్ గా రాష్ట్రపతి పేరు ప్రతిపాదించటం.. అందుకు చెప్పిన కారణాలు మాత్రం చర్చకు కారణమవుతున్నాయి. ఇక, దీని పైన నాగబాబు మరలా స్పష్టత ఇవ్వటం లేదా జనసేన నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
2,952FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!