23.2 C
New York
Tuesday, September 21, 2021

Murder Mystery Solved By Apple Watch | Latest Telugu Crime Stories | Shri Tv Crime Telugu

రాత్రి 10 గంటలు. ఆర్తనాదాలు చేస్తూ ఇంట్లోంచి పరుగెత్తుకొచ్చింది కరోలిన్‌. ఏమిటి ఏమైందని పక్కింటతను కంగారుగా వచ్చాడు. కట్లు విప్పుకుంటూ ఆవరణలో అటు వైపు చూపించింది కరోలిన్‌ వణికిపోతూ. . అటు చూస్తే, కరోలిన్‌ అత్తగారు మిర్నా కింద పడిపోయి వుంది. గబగబా దగ్గరికి వెళ్ళాడు. ఆమె కూడా కట్టేసి వుంది. కదిపి చూస్తే కదలిక లేదు. ‘చంపేశారుఎటాక్‌ చేసి చంపేశారు!’ అరవసాగింది 20 ఏళ్ళ కరోలిన్‌. పోలీసులకి కాల్‌ చేశాడు. ‘ఓహ్‌ గాడ్‌!’ అని షాకయ్యారు పోలీసులు, రక్తసిక్తంగా ఉన్న ఆవిడ శవాన్ని చూసి. ఆస్ర్టేలియాలోని అడొలేడ్‌ పట్టణం, వేలీ వ్యూ ఏరియాలో సంఘటన ఎవరికీ నమ్మశక్యం కాలేదు. కరోలిన్‌ పోలీసులకి చెప్పినట్టు, రాత్రి ప్రాంతంలో దాడి ఏదీ జరగలేదు. ఒక గుంపు వచ్చి ఇరవై నిమిషాల పాటు దాడి జరుపుతూంటే, చుట్టు పక్కల తెలియకుండా ఉంటుందా? అత్తగారితో ట్రాఫిక్‌లో జరిగిన చిన్న గొడవకి పగబట్టి, గుంపు ఇంటి మీదకొచ్చి అత్త గార్ని కట్టేసి కొట్టారని చెప్పింది. తననీ ఇంట్లో పెట్టి తలుపేశారనీ, అందుకే అత్తగార్ని కాపాడుకోలేకపోయాననీ కరోలిన్‌ పోలీసులకి చెప్పిన మాటల్ని నమ్మలేదెవరూ! దాడి అబద్ధమని పోలీసులకి చెప్పేశారు.

మేజర్‌ క్రైం ఇన్వెస్టిగేషన్‌ బ్రాంచ్‌ ఎస్పీ డెస్‌ బ్రే, కరోలిన్‌ పిల్లలు ముగ్గుర్నీ సాలోచనగా చూడసాగాడుహతురాలు మిర్నా చేతికున్న వాచీ తీసి ఫోరెన్సిక్స్‌కి అందించారు అటోప్సీ డాక్టర్లు. ఫోరెన్సిక్‌ ఎనలిస్టు దాన్ని నమోదు చేసుకున్నాడు. ఎస్పీ డెస్‌ బ్రే అడిగాడు కరోలిన్‌ని, ‘‘నీ మొబైల్‌లో రాత్రి 7.02 నిమిషాలకి మీ ఆయనతో మాట్లాడినట్టుంది?’’‘‘ఔను, అప్పటికింకా ఎటాక్‌ జరగలేదు’’‘‘ఎప్పుడు జరిగింది?’’‘‘తొమ్మిదిన్నరకి. 20 నిమిషాలు బీభత్సం చేశారు. వాళ్ళు వెళ్ళిపోయిన పది నిమిషాలకి కట్లు విప్పుకుని సరిగ్గా పది గంటలకి బయటపడ్డాను’’‘‘వాళ్ళనే వాళ్ళు ఎవరూ లేరు గనుక, వాళ్ళ ఆనవాళ్ళు నేను అడగదల్చుకోలేదు నిన్ను’’‘‘సాక్షిని నేనొక్కదాన్నే గనుక, నా మాటలు నమ్మరు. నేనే పని చేసి ఉంటే పాటికి పారిపోకుండా ఉంటానా?’’ 

‘‘7.13కి మొబైల్‌ మీద నువ్వు బేలో షాపింగ్‌ చేసినట్టున్నావ్‌?’’‘‘చేశా’’‘‘ఎలా వుండే దానివి అత్తగారితో?’’ ‘‘ఫ్రెండ్స్‌లా వుండే వాళ్ళం మేము’’‘‘ఎటాక్‌ జరిగినప్పుడు పిల్లలెక్కడున్నారు?’’‘‘నేనే పైన గదిలో దాచేశా. వాళ్ళొచ్చి నన్ను కట్టేశారు’’‘‘అత్తగారు చేతికి స్మార్ట్‌ వాచీ పెట్టుకుంటుందా? దేనికి?’’ కరోలిన్‌ మొహం కందిపోయింది ప్రశ్నకి.‘‘చెప్పు?’’ఆమె గొంతు పెగల్లేదు. ఆందోళనగా చూసింది. జాలిగా చూశాడు డెస్‌ బ్రే, ‘‘ వాచీ నువ్వు తీసేసి జాగ్రత్త పడాల్సిందిప్చ్‌ సరే, ఇప్పుడు పారిపోకుండా ఇంటి పట్టునే ఉంటావు కదూ?’’ అనడిగాడు. ఫోరెన్సిక్‌ ఎనలిస్టు రిపోర్టిచ్చాడు. ఆపిల్‌ స్మార్ట్‌ వాచీ. ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌ హెల్త్‌ వాచీ ఇది. వైర్లెస్‌ గా ఇందులోంచి ఫోన్‌ని ఆపరేట్‌ చేసుకోవచ్చు.  ఎనర్జీ లెవెల్స్‌, హార్ట్‌ రేటు, మూవ్‌మెంట్స్‌ అన్నీ ఇది రికార్డు చేస్తుంది. ప్రైవసీ చట్టాల ప్రకారం, ఆపిల్‌తో న్యాయపరమైన ప్రక్రియ పూర్తి చేసి, హతురాలు మిర్నా డేటా పొందారు పోలీసులు. దాన్ని విశ్లేషించి, 7 నిమిషాలు కేసులో కీలకపాత్ర వహిస్తున్నాయని, 7 నిమిషాలే మరణ సమయమనీ తేల్చాడు ఎనలిస్టు. డేటా అంతా పరిశీలించి, కరోలిన్‌ని ప్రవేశ పెట్టమన్నాడు డెస్‌ బ్రే. పాలిపోయిన మొహంతో వచ్చింది. ‘‘అబద్ధాలు బాగా చెప్తావే? అత్తగారు అలాంటి వాచీ పెట్టుకున్నా నువ్వు హత్య చేశావు. చేసీ స్మార్ట్‌ వాచీని మాయం చేయకుండా నీ సాక్ష్యాలతో డిఫెన్స్‌ ఇచ్చావంటే, నిన్ను చూసి జాలేస్తోంది. నువ్వెప్పుడు చంపావో వాచీ చెప్పేసింది, ఇంకేంటి?’’‘‘నేను చంపలేదంటున్నాగా?’’‘‘వెల్‌, ఆపిల్‌ డేటా నిన్ను కాపాడుతుందా? సాయంత్రం 6.38 నిమిషాలకి మీ అత్తగారి గుండె విపరీతంగా కొట్టుకున్నట్టు డేటా చూపిస్తోంది. అంటే అప్పుడే ఆమె మీద దాడి మొదలై ఉండాలి. 6.45కి ఆమె స్మార్ట్‌ వాచీ హార్ట్‌ రేటు చూపించడం లేదు. అంటే గుండె ఆగిపోయిందన్న మాట. అంటే 6.45కే ఆమె చనిపోయింది. 7 నిమిషాల్లో అంతా అయిపోయింది. నువ్వేమో రాత్రి తొమ్మిదిన్నరకి ఎటాక్‌ జరిగిందనీ, అప్పుడే చనిపోయిందనీ అంటున్నావ్‌. కట్లు కట్టుకుని కట్టు కథలు చెప్పావ్‌. ఆపిల్‌ డేటాని నువ్వు ఛాలెంజ్‌ చేస్తావా?’’ ‘‘చంపలేదంటున్నాగా?’’ ‘‘నువ్వు రిపీట్‌ చేస్తున్న స్టేట్‌మెంట్‌కి నేను ఆశ్చర్యపడను. అత్తగార్ని చంపి మరీ ఏమీ ఎరగనట్టు ఫోన్లో భర్తతో కబుర్లాడావు. బే షాపింగ్‌ కూడా చేశావుదీనికి నిన్నేమనుకోవాలో తెలీక విస్తుపోతున్నాను. యూ ఆర్‌ అండర్‌ అరెస్ట్‌’’ ‘‘ఎందుకూ?’’ ‘‘అత్తగార్ని చంపినందుకు. ఆమె ఆస్తులన్నీ అనుభవించేందుకు’’ ‘‘అత్తగారికి ఆస్తులున్నాయా?’’ ‘‘షటప్‌, ముందు లోపలెయ్యండి దీన్ని!’’ అరిచాడు ఎస్పీ డెస్‌ బ్రే.

Related Articles

Stay Connected

0FansLike
2,952FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!