20.1 C
New York
Thursday, October 21, 2021

అలాంటప్పుడే మీ దాంపత్య జీవితం మెకానికల్ గా మారిపోతుంది | Must Follow these Tips

ఇప్పుడు యూత్ అంతా డేటింగ్, లివ్ ఇన్ రిలేషన్ షిప్ అంటూ చాలా ఫాస్ట్ గా ఉంటున్నారుఒక అమ్మాయి లేదా అబ్బాయి నచ్చితే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి నచ్చారని చెప్పడం డేటింగ్ చేద్దామా అని అడగడంఇక పెళ్లి అనేదాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకపోతే , లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనడం…. ఇలా యూత్ లైఫ్ స్టైల్, వాళ్ళ ఆలోచనల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే అది లవ్ అయినా లేక డేటింగ్ అయినా లేదా , లివ్ ఇన్ రిలేషన్ షిప్ అయినా ఒకసారి తమ పార్టనర్ తో కలిసి దాంట్లోకి ఎంటర్ అయితే ఇక అక్కడి నుంచి ఎన్నో విషయాలు జరుగుతాయి ఎవరైనా సరే వాటిని ఫేస్ చేయాల్సిందే. ఒక రిలేషన్ షిప్ ను కాపాడుకోవడం అన్నది ఈరోజుల్లో ఎంతో కష్టమైన పనిమీరు చేసిన తప్పులకు లేకపోతే మీ పార్టనర్ చేసే మిస్టేక్స్ వలనో మీ రిలేషన్ షిప్ దెబ్బ తింటుంది ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏదో తెలిసి తెలియక తప్పులు, గొడవలు జరిగి విడిపోతే అది వేరుకానీ అదే మీకే తెలియకుండా మీ రిలేషన్ షిప్ లో తప్పులు జరిగి అది మిమ్మల్ని మీ పార్టనర్ కు దూరం చేస్తే అదింకా బాధగా ఉంటుంది. ఇలా రిలేషన్ షిప్స్ లో బ్రేకప్ కు కారణమయ్యే కొన్ని సర్ ప్రైజ్ విషయాల గురించి ముంబైకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ దేశ వ్యాప్తంగా ఒక సర్వే చేసిందట దాంట్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయిఇప్పుడు వివరాలు మీకోసం

1. మీ శృంగార జీవితం మెకానికల్ గా ఉంటుంది!!!!
చాలా మంది ఎంతో కష్టపడి ఒక రిలేషన్ షిప్ లోకి ఎంటర్ అయ్యాకా తమ నిర్లక్ష్యం కారణంగా దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు తాము పెట్టాల్సిన ఎఫర్ట్ కూడా పెట్టరుఇక వాళ్ళ శృంగార జీవితం అయితే చాలా దారుణంగా ఉంటుందితమ పార్టనర్ మీద కోపంతోనో లేదా ద్వేషంతో నో శృంగారాన్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతారు. ఇక అక్కడి నుంచి వారి రిలేషన్ షిప్ లో సమస్యలు స్టార్ట్ అవడం జరుగుతుంది. ఒక రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు అబ్బాయి అమ్మాయి మానసికంగా శారీరకంగా కూడా కలిసి ఉండాలి ప్రాసెస్ లో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా అది మొత్తం రిలేషన్షిప్ నే దెబ్బ తీస్తుంది. ఎప్పుడైతే తమ పార్టనర్ తో శృంగారం చేయడాన్ని ఎదుటి వాళ్ళు మెకానికల్ గా ఫీలవుతూ ఉంటారో అక్కడ ఎదుటి వాళ్ళ మనసు గాయపడుతుంది…. దాంతో వాళ్ళకి తమ పార్టనర్ మీద మెల్లగా ప్రేమ అనేది తగ్గుతూ వెళుతుంది…. ప్రేమలేని చోట నమ్మకం ఉండదు దాంతో వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ అనేది అక్కడికి ఎండ్ అయిపోతుంది.

2. ఎక్కువ ప్రేమించడం!!!!
జీవితంలో ఏదైనా సరే ఒక లిమిట్ వరకు ఉంటేనే బాగుంటుందిఅవి అలవాట్లు కావచ్చు లేదా అభిరుచులు కావచ్చు లేదా ఒకరిని ప్రేమించడం అయినా కావచ్చుఅదే ఎక్కువ అయింది అంటే మొదటికే మోసం వస్తుందిఇది రిలేషన్ షిప్స్ కి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని ఇష్టపడి ప్రేమించి వాళ్ళతో ఒక రిలేషన్ షిప్ లోకి ఎంటర్ అయిన తర్వాత మన ప్రేమ అనేది వాళ్ళకి ఒక భారంగా అవ్వకూడదుకానీ కొంతమంది తమ రిలేషన్ షిప్ లో ఇలాంటి తప్పులు చేస్తుంటారు. తమ పార్టనర్ ను అతిగా ప్రేమించడంవాళ్ల మీద ఎక్కువ కేర్ తీసుకోవడంబాగా పొసెసివ్ అయిపోవడం లాంటివి చేస్తుంటారు. దాంతో వీళ్ళ ప్రేమను తట్టుకోలేక ఎదుటి వాళ్ళు రిలేషన్ షిప్ కి ఒక దండం పెట్టి వెళ్లిపోతారు. మనం ప్రేమించే వారికి ఎప్పుడూ మన ప్రేమ ఒక సమస్య అవకూడదు అప్పుడే అది అందంగా ఉంటుంది. చాలామంది యూత్ తాము ఒక క్రేజీ పర్సన్ అని తమ ప్రేమ సముద్రం అని ఇలా సినిమా డైలాగ్ లు ఎక్కడో చదివిన కొటేషన్స్ చెబుతుంటారుఅయితే అవన్నీ ఎదుటి వాళ్ళకి పిచ్చి గా కనపడతాయి కానీ దాంట్లో ప్రేమ కనిపించదు. అందుకే ఏదైనా కంట్రోల్లో ఉంటేనే మంచిది అని అర్థం చేసుకోవాలి.

3. హెల్తీ డిస్కషన్స్ జరగవు!!!!
  ఇద్దరు మనుషులు కలిసి ఒక రిలేషన్ షిప్ లో ఉండాలని నిర్ణయించుకున్నది తర్వాత వాళ్ళ మధ్య ఎన్నో అపార్ధాలు కలహాలు అనుమానాలు గొడవలు వస్తూనే ఉంటాయి. అయితే తమ మధ్య ఎలాంటి ఇబ్బంది కలిగిన లేదని తమకు ఎలాంటి సమస్య వచ్చినా ఇద్దరు కలిసి కూర్చొని దాని గురించి డిస్కస్ చేసుకోవడం అన్నది ఎప్పుడూ మంచే చేస్తుంది. కానీ చాలా మంది తమ ఇగో వల్ల లేదా ద్వేషంతో, కోపంతో, ఆవేశంతో డిస్కషన్స్ చేయకుండా అలాగే ఉండిపోతారు. దాంతో వాళ్ల మధ్య వచ్చిన చిన్న సమస్య కూడా పెద్దదిగా మారుతుందిఇక తర్వాత వాళ్ళు సమస్యని పరిష్కరించుకో లేక విడిపోవడం జరుగుతుంది. అందుకే తమ రిలేషన్ షిప్ లో చిన్న సమస్య వచ్చినా వెంటనే కలిసి కూర్చుని మాట్లాడుకుని దాన్ని సాల్వ్ చేసుకోవడం ఎలా అన్నది వాళ్ళు నేర్చుకోవాలి లేకపోతే వాళ్ళు తమ మధ్య ఉన్న రిలేషన్ షిప్ ను కోల్పోవాల్సి వస్తుంది.


4. మీరింకా సింగిల్ అని ఫీల్ అవుతారు!!!!
అబ్బాయి అయినా అమ్మాయి అయినా తాము ఒకరితో రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు వాళ్లతో చిన్న గొడవ జరిగినా చాలా ఈజీగా హర్ట్ అవుతారు. దాంతో మేమిద్దరం కలిసే ఉన్నాం అన్న విషయాన్ని పక్కన పెట్టి తాము ఒక్కరిమే ఉన్నాము అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. అది ఏదో కోపంలో చేసిన మెల్లగా అలవాటుగా మారుతుంది దాంతో వాళ్ల పార్టనర్ దాన్నొక అవమానంగా భావిస్తారుఇక అప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరిగి బంధం ముగిసిపోతుంది. మీరు ఒకరి తో కలిసి ఉన్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ వాళ్ళు ఒంటరి అన్న ఫీలింగ్ ఎదుటి వాళ్ళకి రానివ్వకూడదువాళ్ళలా ఫీలవకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న దాని మీద మీరు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీతో కలిసి జీవితం పంచుకోవాలని వచ్చిన ఒక వ్యక్తి మీరే తోడుగా లేరని తెలిస్తే ఎంతగా హర్ట్ అవుతారు అనేది మీరు ఆలోచించుకోవాలి.

5. ఇగో లు పక్కన పెట్టండి!!!!
ఎవరికైనా సరే అంతో ఇంతో ఇగో ఉంటుందిఅవసరాన్ని బట్టి ఒక్కోసారి అది బయటకు వస్తుంది. అయితే మీ ఈగో మీ పార్టనర్ ను బాధ పెట్టీ వాళ్లను మీకు దూరం చేసేది గా మాత్రం ఉండకూడదు. అందుకే ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఇద్దరిలోనూ ఇగో ఉన్నప్పుడు తమ పంతం కోసం ఎవరో ఒకరు తగ్గడం మంచిది. మీ ఇగో నే సాటిస్ఫై అవ్వాలి అన్న రూల్స్ లాంటివి ఏమీ పెట్టుకోకండిమీ ఇగో ని ఎలా అయినా మీరు సాటిస్ఫై చేసుకోవచ్చు దానికి వేరే దారులు బతకం కానీ అదే ఒక్కసారి మీ పార్టనర్ మనసు విరిగిన మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతే మాత్రం మీరు దానికి చాలా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది

సో ఫ్రెండ్స్ మీకు తెలియకుండానే మీ రిలేషన్ షిప్ లో మీరు చేసే తప్పులు ద్వారా మీరు మీ పార్టనర్ కు దూరం కావడం అన్నది జరుగుతుంటుంది. అందుకే ఒక వ్యక్తి తో కలిసి ఉన్నప్పుడు తను అన్ని విధాలుగా అర్థం చేసుకోనీ వాళ్లని క్షమించ గలిగేంత పెద్ద మనసు మీకు ఉండాలి. ఒకసారి మీరు రిలేషన్ షిప్ లో కి ఎంటర్ రావాలని నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్!!!!

Related Articles

Stay Connected

0FansLike
2,990FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!