23.3 C
New York
Friday, September 17, 2021

పవన్ కళ్యాణ్ కోసం నాదెండ్ల మనోహర్ ఇంత చేస్తున్నాడా ?

ఓ వ్యక్తి కొన్ని సిద్ధాంతాలకు తన జీవితాన్ని అందిస్తాడు. ఆ సిద్ధాంతాల కోసం తన ప్రయాణాన్ని సాగిస్తాడు. అది రాజకీయం అయిన ఉద్యోగం అయిన. ఓ వ్యక్తి ఒకరిని బలంగా నమ్మితే.. తను నమ్మిన సిద్ధాంతాలు కూడా తనలాగే ఉంటే ఇక ఆ ఇద్దరి ప్రయాణం జీవితం ఆఖరి క్షణం వరకు సాగుతుంది. సరిగ్గా ఈ మాటలు ప్రస్తుతం ఓ పార్టీలో కీలకంగా కొనసాగుతున్న వ్యక్తికి.. సరిపోతాయి. ఆయనే జనసేన పార్టీ ఛైర్పర్సన్ నాదెండ్ల మనోహర్. 2014 లో ప్రజల కోసం ఆవిర్భవించిన జనసేన పార్టీ లో ఎందరో రాజకీయ నేతలు వచ్చి పోయారు.. వారు కేవలం రాజకీయ నేతలు మాత్రమే.. వీరు వచ్చి పోవడంతో జనసేన పార్టీకి ఒరిగింది ఏంలేదు. కానీ జనసేన పార్టీ కొన్ని సిద్ధాంతాల కోసం ఆవిర్భావించింది. పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ సామాజం కోసం పార్టీని పెట్టాడు.. జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు. తన లాగే సమాజం కోసం పని చేసే వారిని పార్టీలో కీలకంగా ఉంచాడు. దాంట్లో నాదెండ్ల మనోహర్ ఒకరు. మనోహర్ ఉమ్మడి రాష్ట్రం నుంచే రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు.. ఎమ్మెల్యేగా పని కూడా పని చేశారు. శాసనసభ స్పీకర్ గా పని చేసిన అనుభవం ఆయనది. సమాజానికి సేవ చేయాలనే తపన.. ప్రజల కోసం పని చేసే తత్వం ఆయనలో మెండుగా ఉన్నాయి. ఇక తన సిద్ధాంతాలకు అనుగుణంగా సిద్ధాంతాలు కలిగిన పార్టీలు లేవు. కానీ ప్రజల కోసం పుట్టిన జనసేన సిద్ధాంతాలు నాదెండ్ల మనోహర్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నాయి. దీంతో ఆయన జనసేన వైపు చూసాడు. ప్రస్తుత రాజకీయాల్లో గెలవాలంటే చుక్క ముక్క అనేది రాజకీయ నాయకుల సిద్ధాంతం. ప్రజలను మభ్య పెట్టడం. మతాలను రెచ్చగొట్టి చిచ్చు పెట్టి ఓట్లు పొందడం ఇది కేవలం వారి కోసం పెట్టుకున్న పార్టీలు. కానీ జనసేన పార్టీ అలా కాదు ప్రజల కులం పుట్టింది. దాంట్లో పని చేసే ప్రతి వ్యక్తి ప్రజల కోసం పని చేసే ప్రజా నాయకుడు. జనసేన సిద్ధాంతాలు నచ్చి.. పవన్ కళ్యాణ్ ఆశయం నచ్చి తను పార్టీలో చేరుతున్న అని చెప్పి నాదెండ్ల జనసేనలో చేరారు. అంతే కాదు ఎన్నికల్లో ఓటమి తరువాత ఎవ్వరికీ వారు నోటికి వచ్చినట్టు జనసేనని, పార్టీ నాయకత్వాన్ని విమర్శించారు.. విమర్శించే వారి నోటికి నాదెండ్ల తన మాటలతో నోటిని ముయిస్తాడు.కులం లేకుండా సామాజిక స్పృహ, మత వివక్ష లేని రాజకీయాలు, భాషా వైవిధ్యానికి గౌరవం, మన సంప్రదాయాలు మరియు సంస్కృతికి రక్షణ, ప్రాంతీయ ఆకాంక్షలను నిర్లక్ష్యం చేయకుండా జాతీయత, అవినీతికి వ్యతిరేకంగా నిర్విరామ పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే పురోగతి వంటి అంశాలు మా లక్ష్యాలని వాటి కోసం గెలుపు ఓటములు పదవులు లేకుండా తాము పోరాటం చేస్తున్నామని, మమ్మల్ని విమర్శించే వారు  మా సిద్ధాంతాలో ఒక్క అంశంపై అయిన మీరు పోరాటం చేస్తున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles