17.7 C
New York
Tuesday, October 19, 2021

నాగ చైతన్య OTT ఎంట్రీ నిర్ధారించబడింది

ప్రస్తుతం ఓటీటీ కంటెంట్ .. సినిమాలతో పోటీ పడుతోంది. స్టార్ హీరోలు, క్రేజీ హీరోయిన్స్ .. ఓటీటీ కంటెంట్ పై మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో వివిధ భాషలకు చెందిన పలువురు నటీనటులు .. వెబ్ సిరీస్ లో నటిస్తూ.. సత్తా చాటుకుంటున్నారు. అలాగే.. దాంతో పాటు మంచి పేరు కూడా తెచ్చుకుంటున్నారు . టాలీవుడ్ బ్యూటీ సమంతా ఆల్రెడీ ‘ఫ్యామిలీ మ్యాన్’ 2 వెబ్ సిరీస్ లో విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆ వెబ్ సిరీస్ ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. అలాగే.. సమంత ఆహాలో .. సామ్ జామ్ టాక్ షో కూడా చేసింది. ఇక ఇప్పుడు సమంత భర్త నాగచైతన్య వంతు వచ్చింది. త్వరలో చైతూ ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. అమెజాన్ ప్రైమ్ లో నాగచైతన్య ఒప్పందం కూడా చేసుకున్నట్టు వినికిడి. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టుకున్న చైతూ.. ఇప్పుడు ఓటీటీ కంటెంట్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగార్జున కూడా ఓటీటీలోకి అడుగుపెడుతున్నట్టు తెలిపారు. అయితే తండ్రి కన్నా ముందుగానే చైతూ.. ఓటీటీ ప్రవేశం చేస్తాడని టాక్స్ వినిపిస్తున్నాయి. మరి చైతూ చేసేది వెబ్ సిరీసో, సినిమానో, టాక్ షో నో ఇంకా తెలియదు. త్వరలోనే నాగచైతన్య ఓటీటీ ఎంట్రీకి సంబంధించిన ప్రకటన వస్తుందని టాలీవుడ్ టాక్. మరి చైతూ ఓటీటీలో చేయబోయేది ఏమిటి అన్న విషయం తెలియాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే.

Related Articles

Stay Connected

0FansLike
2,988FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!