23.6 C
New York
Monday, September 20, 2021

రోగుల ప్రాణాలను కాపాడేందుకు శ్రమిస్తున్న నర్సులకు 2 నెలల జీతాన్ని బోనస్ గా ఇవ్వాలి – జనసేనా డిమాండ్

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నర్సులందరికీ తనదైన శైలిలో శుభాకాంక్షలు  తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే.. నర్సులు నిజంగానే సేవాముర్తులు.. చికిత్స చేయండి అంటూ హాస్పటల్లో చేరిన దగ్గర్నుండి నుంచి మనం కోలుకొని తిరిగి ఇంటికి వెళ్ళేవరకు వెన్నంటే ఉండి సేవలు చేస్తారు. అనుక్షణం నర్స్.. సిస్టర్ అంటూ పిలిచినా విసుగు చెందకుండ వస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సమయంలో కరోనాను కట్టడి చేసేందుకు అటు డాక్టర్స్‏తోపాటు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. తమ ప్రాణాలను కూడా లేక్కచేయకుండా.. కరోనా రోగులకు దగ్గరుండి మరీ సేవలు అందిస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ.. రోగులే తమ పిల్లలుగా భావిస్తూ అహోరాత్రులు శ్రమిస్తున్న చల్లని దేవతలు. కరోనా బాధితులకు ఫ్లూయిడ్స్‌ అందించడం, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు ఇవ్వడం, ఆక్సిజన్‌ పెట్టడం వంటి అనేక సపర్యలు చేస్తున్నారు. కరోనా పోరులో సేవలు చేస్తూ.. వారిలో కొందరు ఈ మహమ్మారికి బలయ్యారు. అయిన ఏమాత్రం అధైర్య పడకుండా.. కోవిడ్ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. అటు డాక్టర్లకు, ఇటు రోగులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ స్వీయ రక్షణతోపాటు… బాధితులను కూడా రక్షించేందుకు పాటుపడుతున్నారు. ఇంతటి సేవ చేస్తూ.. ఉద్యోగంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కోంటూ.. వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి దూరంగా ఉంటూ ఈ కష్ట కాలంలో సేవలు అందిస్తున్న ప్రతి ఒక్క నర్సుకు మనస్పూర్తిగా ధన్యవాదలు తెలియజేస్తూ   కరోనా కష్టకాలంలో నర్సులను ప్రత్యేకంగా గుర్తించి 2 నెలల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కరోనాతో భయాందోళనల్లో ఉన్న రోగులందరికీ నర్సులు అందిస్తున్న సేవలు గుర్తించి, గౌరవించాలన్నారు. రోగులకు వైద్య చికిత్స అందించే సమయంలో ఎంతో సహనంతో, కరుణతో సపర్యలు అందిస్తున్న సిస్టర్ల త్యాగం మానవీయమైనదని పవన్ కళ్యాణ్ కొనియాడారు. కరోనాతో ప్రపంచం అల్లకల్లోలమైపోతున్న నేటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను లెక్కకుండా, కుటుంబసభ్యులను రిస్క్‌లో పెట్టి రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్య సేవలందిస్తున్న నర్సుల రుణం తీర్చుకోలేనిదని జనసేనాని అన్నారు. కోవిడ్, ఐసీయూ వార్డుల్లో వైద్యులతో సమానంగా సాహసోపేతంగా విధులు నిర్వహిస్తున్న నర్సుల సేవలు చిరస్మరణీమన్నారు. గంటల తరబడి పీపీఈ కిట్లు ధరించి రోగుల ప్రాణాలను కాపాడేందుకు శ్రమిస్తున్న నర్సులను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరముందన్నారు. అంతేకాదు వారందరికీ ప్రోత్సహకరంగా ఉండేలా 2 నెలల వేతనాన్ని అదనంగా ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వారికిచ్చే ఓ కానుకగా భావించాలన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
2,948FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles