23.6 C
New York
Monday, September 20, 2021

పవన్ ఫ్యాన్స్ Vs పరకాల – సోషల్ మీడియాలో మెగా సమరం

సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రజారాజ్యం మాజీ నేత – జనసేన అభిమానుల మధ్య వార్ నడుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో సలహాదారుడిగా పని చేసిన పరకాల ప్రభాకర్ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన సతీమణి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్దిక శాఖా మంత్రిగా ఉన్నారు. అయితే 4 రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా పరకాల ప్రభాకర్ కామెంట్లు పోస్టు చేయటం.. దానికి స్పందనగా పవన్ అభిమానులు రియాక్ట్ అవ్వటం.. వాటికి మళ్ళీ పరకాల సమాధానం చెబుతూ గట్టిగా కౌంటర్ ఇవ్వటం జరుగుతోంది. పరకాల ట్వీట్లలో కొన్నింటిని పరిశీలిస్తే.. 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వాళ్లంటూ పరోక్షంగా జనసేనానిని ఉద్దేశించి కామెంట్స్ చేసినట్లుగా కనిపించింది. దీనికి కొనసాగింపుగా… పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వటంతో.. ఇక పరకాల కూడా ఓపెన్ అయిపోయినట్లుగా ఆయన ట్వీట్లను చూస్తే అర్ధమౌతోంది. 2009లో కాంగ్రెసోళ్ల పంచెలూడగొడతానంటూ.., మరి కాంగ్రెస్ లో ఎందుకు చేరినట్లంటూ ఒక ట్వీట్ లో ప్రశ్నించారు. అది, మెగా బ్రదర్స్ ను ఉద్దేశించి చేసినదిగానే అర్దం అవుతోంది. ఇక, 2014లో సైకిల్‌ ఎందుకు ఎక్కినట్టు.. 2017 లో పాచిపోయిన లడ్డూ అన్నవారు ఇప్పుడు కమలం పువ్వు చెవిలో పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నట్టు.. భీమవరం, వైజాగుల్లో ఏదో పీకేస్తానని తుస్పుమన్నారు శుంఠలు, ఎందుకని.. రేపటి వరకు వీటిల్తో పిసుక్కోండి. రేపు తీరుబడి అయ్యాక మళ్ళీ ఇంకోసారి వీపు పగిలేలా బాదుతా ఇంకా ఏరైనా మిగిలితే..అంటూ ట్వీట్ చేసారు. ఆయన తన ట్వీట్లలో ఎక్కడా ఎవరి పేరు ప్రస్తావించటం లేదు. కానీ, ఆయన చేస్తున్న ట్వీట్లు మాత్రం మెగా బ్రదర్స్ గురించి అనే సమాధానం అభిమానుల నుంచి వస్తోంది. అయితే ఈ ట్వీటా వ్యవహారాన్ని గమనించిన  పవన్ ఫ్యాన్స్ సీరియస్ గానే రియాక్షన్ ఇచ్చారు. అందుకే వారు ఆ స్థాయిలో పరకాలను టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ఒక రకంగా పవన్ ఫ్యాన్స్ Vs పరకాల అన్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే జరుగుతోంది. పరకాల పరోక్షంగా ముందు జనసేనను టార్గెట్ చేసారనేది జనసైనికుల వాదన. ఇక, తాజాగా పరకాల చేసిన వరుస ట్వీట్లలో.. ఇంకా గోక్కుంటున్న గజ్జి బ్యాచ్ కి అంటూ ట్వీట్ చేశారు. కిరాయి ముడుతోందా నన్ను తిడుతున్నందుకు. కానీ జోరు తగ్గిందే. కిట్టుబాటు కావడంలేదా.. సరే, నేల టిక్కెట్‌-ఈల బ్యాచ్‌ బాబాయ్‌‌లకు, పిన్నిలకు, ఈ ప్రశ్నలకు సమాధానం రాయించుకు రండి ఆఫీసులో ఎవరితోనైనా..మళ్ళీ ఈ ఛాయలకొచ్చారో, ఖబడ్దార్! అంటూ పోస్టు చేసారు. పరకాల ప్రభాకర్ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావటం.. పరకాల ఏపీలో చంద్రబాబు వద్ద మీడియా సలహాదారుడిగా వ్యవహరించారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తరువాత పరకాల కూడా తన పదవికి రాజీనామా చేసారు. కాంగ్రెస్ – బీజేపీ- ప్రజారాజ్యం పార్టీల్లో పని చేసిన అనుభవం పరకాలకు ఉంది. అయితే, పరకాల ముందుగా పేర్లు ప్రస్తావించకుండా పోస్టింగ్ లు పెడుతూనే.. తనను విమర్శిస్తున్న జనసైనికులకు హెచ్చరికలు చేస్తూ వచ్చారు. పరకాల ట్విట్టర్ ఎకౌంట్ అదే విధంగా వాటికి కౌంటర్ గా పవన్ ఫ్యాన్స్ చేస్తున్న పోస్టింగ్ లు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక నైనా, ఈ వార్ ఆగుతుందా లేక మరింత కాలం కొనసాగుతుందా అనేది ఇప్పుడు తాజాగా పరకాల చేసిన ట్వీట్ కు వచ్చే స్పందనతో స్పష్టం కానుంది.

Related Articles

Stay Connected

0FansLike
2,948FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles