23.6 C
New York
Monday, September 20, 2021

పవన్ కళ్యాన్ ను కలిసేందుకు ఓ అభిమాని పాదయాత్ర

ఇప్పుడు అభిమానులంతా ఓ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. తమని అభిమానించే అభిమానిని కలిసేందుకు పాదయాత్రని చేస్తున్నారు. 200, 300 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరి అభిమాన నటులను కలుస్తున్నారు. ఆ మధ్య అల్లు అర్జున్ ఫ్యాన్ ఒకరు ఇలానే చేశారు. బన్నీ వారిని ఆప్యాయంగా కలిసి ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నారని అడిగాడు. ఇక మరోపక్క సోనూ సూద్ కోసం కూడా ఫ్యాన్స్ కాలినడకన ముంబై చేరుకున్నారు. తెలంగాణా నుండి ముంబై వరకు వెళ్లి సోనూ సూద్ ను కలిశారు. అయితే సోనూ కూడా వారి అభిమానానికి ఫిదా అయ్యారు. ఇలాంటివి ఇంకెవరు ఎప్పుడు చేయొద్దని చెప్పారు. ఇక రీసెంట్ గా రాం చరణ్ కోసం ముగ్గురు అభిమానులు అదే పని చేశారు. లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఓ అభిమాని పాదయాత్ర మొదలు పెట్టాడు. మహబూబ్ నగర్ జిల్లా అమ్మాపురం కి చెందిన రవి పవర్ స్టార్ కు వీరాభిమాని ఎలాగైనా పవన్ ని కలవాలని అనుకున్నాడు. ఈమధ్య కాలినడకన వెళ్లి హీరోలను కలుస్తున్న కొందరిని చూసి తనకు కూడా అలాంటి ఆలోచన వచ్చింది. వెంటనే పవన్ ఫోటోతో ఓ ప్లకార్డ్ పట్టుకుని ఆయన్ను కలిసేందుకు పాదయాత్ర స్టార్ట్ చేశాడు.

ఇంతకీ వీరంతా కేవలం తమ అభిమాన నటుడిని చూడటానికి మాత్రమే పాద యాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం మీడియా మాధ్యమాలు అధికమవడంతో ఇలాంటివి వైరల్ గా మారుతున్నాయి. వాళ్లు కూడా పాపులర్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 

సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ ను కలిసేందుకు పాదయాత్రగా బయలుదేరాడు ఓ వీరాభిమాని. చిన్ననాటి నుంచి పవన్ కళ్యాణ్ ను అభిమానించే రవి అనే అభిమాని.. చాలాసార్లు ఆయనను కలిసేందుకు ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యం కాలేకపోయింది. పవన్ ను ఎట్టి పరిస్థితుల్లో కలవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ కు పాదయాత్ర మొదలు పెట్టాడు రవి. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన రవికి హీరో పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ప్రేమ. పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమాను చూడడమే కాకుండా ఆయనలా నిత్యజీవితంలోనూ ఉండే ప్రయత్నం చేసే వాడు రవి. పవన్ కళ్యాణ్‌ను కలిసి తన అభిమానాన్ని చాటాలని చాలా సార్లు అనుకున్నాడు. కానీ నెరవేరలేదు. అయినప్పటికీ రవి వెనుకడుగు వేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ను కలవాలనే ఉద్దేశంతో ఒంటరిగా అమ్మాపురం నుంచి పాదయాత్రగా హైదరాబాద్ కు బయలు దేరాడు. పవన్ పట్ల రవి చూపుతున్న అభిమానాన్ని అమ్మాపురం గ్రామస్తులు కొనియాడుతున్నారు. రవికి మద్దతుగా నిలుస్తున్నారు గ్రామస్తులు. కాకపోతే.. ఇలా పాదయాత్రలు చేయడాన్ని హీరోలు ఎంకరేజ్ చేయకపోవడం మంచిది లేదంటే అందరు ఇలానే చేసి హీరోలను ఇబ్బంది పెడుతుంటారు. మరి ఈ పాదయాత్ర ప్రోగ్రాం కి హీరోలు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.

Related Articles

Stay Connected

0FansLike
2,947FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles