19 C
New York
Thursday, October 21, 2021

ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పవన్ కళ్యాణ్

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు ఈ రోజు. ప్రధాని 71వ పుట్టినరోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న నరేంద్ర మోదీ అభిమానులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు వెల్లువగా మారింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాటు చాల మంది అంతర్జాతీయ ప్రముఖులు విషెస్ చెప్తున్నారు. రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ తో పాటు , అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ , అరవింద్ కేజ్రీవాల్ , రాహుల్ గాంధీ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవనీయులైన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు మీకు మా అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ ఘనమైన, స్ఫూర్తినిచ్చే అంకిత భావం కలిగిన నాయకత్వంలో మన భరతమాత విప్లవ ముని శ్రీ అరబిందో కలలు కన్న విధంగా తన నిజమైన కీర్తి శిఖరాలను తాకగలదని ఆశిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు .

Related Articles

Stay Connected

0FansLike
2,990FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!