23.2 C
New York
Tuesday, September 21, 2021

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ రంగంలోకి వచ్చింది అధికారం చేజిక్కించుకోవడం కోసం కాదు.?!

రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం. సినీ పరిశ్రమలో సక్సెస్, ఫెయిల్యూర్.. అనే లెక్కలేసుకోకుండా సాగింది పవన్ కళ్యాణ్ కెరీర్. కానీ, రాజకీయాల్లో అలా కుదరదు. ఆ విషయాన్ని అనుభవపూర్వకంగా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నారు. 2024 ఎన్నికల నాటికి జనసేన పార్టీ ఎలా రాజకీయంగా సిద్ధమవుతుంది పవన్ కళ్యాణ్ నాయకత్వంలో.? అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. సినీ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ రంగంలోకి వచ్చింది అధికారం చేజిక్కించుకోవడం కోసం కాదు. సేవ చేయడం కోసం. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని చాలా మంది చెప్పడం చూశాం. చూస్తూనే ఉన్నాం. అలాంటి చాలా మందిలా కాదు, పవన్‌ కళ్యాణ్‌ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఐదేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించినప్పుడు ఏ భావజాలంతో అయితే ఉన్నాడో ఇప్పుడూ ఆయనలో అదే భావజాలం. అప్పుడూ, ఇప్పుడూ ఆయన పదవి కోసం ఆశ పడింది లేదు. జనసేనను అధికారంలోకి తీసుకొస్తామని చెప్పింది ప్రజలకు మెరుగైన పాలనను అందించడం కోసమే. అధికారం దక్కకపోయినా, జనంలోనే ఉంటాననీ, గెలిపించినా, గెలిపించకపోయినా ప్రజల తరపునే నిలబడతానని చెప్పే ధైర్యం ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఎంతమందికి ఉంది.? నేను ముఖ్యమంత్రిని అయిపోతా.. అంటే జనం గెలిపించేయరు. మంచి, చెడుల బేరీజు జనానికి బాగా తెలుసు. లక్షలాదిమంది అభిమానులు పవన్ కళ్యాణ్ సొంతం. వీళ్ళెవరూ జనసేనను కాదని ఇంకో పార్టీకి ఓటేసే అవకాశమే లేదు. కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులమని చెప్పుకునే కొందరు మాత్రం, పైకి ఒకలా నటిస్తూ, తెరవెనుకాల ఇంకో తరహా రాజకీయం చేస్తున్నారు. నిజానికి, కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల వల్లనే జనసేన పార్టీ ఇప్పుడు ఈ రోజు ఈ స్థాయిలో నిలబడింది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. జనసైనికులంటే, పవన్ కళ్యాణ్ అభిమానులే. పవన్‌ కళ్యాణ్‌ ఒక్కడే కానీ ఆయన వెనకాల బోలెడంత సైన్యం ఉంది. డబ్బులు ఖర్చు చేస్తే వచ్చే సైన్యం కాదది. ఒక్క పిలుపుతో అక్కడికక్కడ, అప్పటికప్పుడు జన సంద్రాన్ని సృష్టించగల శక్తి ఆయన మాటకుంది. పవన్‌ కళ్యాణ్‌ అంటే వ్యక్తి కాదు, శక్తి. కానీ జనసైనికులు ఎంతమంది ఓటర్లను వీళ్ళంతా ప్రభావితం చేయగలుగున్నారు.? అన్నదానిపైనే పార్టీ భవితవ్యం ఆధారపడి వుంది. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోయినా, టీడీపీ – బీజేపీ కూటమికి మద్దతిచ్చింది. కానీ, 2019 ఎన్నికల నాటికి ఈక్వేషన్స్ మారిపోయాయి. ప్రస్తుతం కేవలం బీజేపీతోనే జనసేన ప్రయాణం కొనసాగుతోంది. ఇది, ఇంకో మూడేళ్ళపాటు ఇలాగే కొనసాగుతుందా.? అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. కరోనా నేపథ్యంలో కొంతకాలం రాజకీయాల నుంచి ‘విరామం’ తీసుకున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవబోతున్నారు. ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు రాజకీయాలు.. 2 పడవల ప్రయాణం పవన్ కళ్యాణ్ కొత్తగా చేస్తున్నదేమీ కాదు. కానీ, ఈసారి చాలా చాలా ప్రత్యేకం. రెండేళ్ళు గడిచిపోయింది.. ఇంకో మూడేళ్ళు.. ఈ మూడేళ్ళు అత్యంత కీలకం.ఇంకో రెండున్నరేళ్ళలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈలోగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన బలపడాలంటే, మిత్రపక్షంతో మరింత సఖ్యత అవసరం. లేదా, మిత్రపక్షం బీజేపీని కాదని ఒంటరిగా.. మరింత ధైర్యంగా ముందడుగు వేయాల్సిందే.

Related Articles

Stay Connected

0FansLike
2,952FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!