23.6 C
New York
Monday, September 20, 2021

“సిగ్గులేని వెధ‌వ వెల్లంప‌ల్లి” – ఏపీ దేవాదాయ శాఖ మంత్రిపై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫైర్

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయడం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈమధ్య ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారని ఎద్దేవా చేయ‌డంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోపం క‌ట్టలు తెంచుకుంది. ఈ నేప‌థ్యంలో ఆయనను ట్విటర్‌లో ఓ ఆట ఆడుకుంటున్నారు. “సిగ్గులేని వెధ‌వ వెల్లంప‌ల్లి” అనే యాష్ ట్యాగ్‌తో సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. గతంలో పవన్ టీషర్టును పబ్లిసిటీ కోసం లాంచ్ చేసిన వెల్లంపల్లి ఫొటోలను పెట్టి ఎద్దేవా చేస్తున్నారు. పెయిడ్ న్యూస్ ఛానెల్స్‌కు చేరే వ‌ర‌కు ఈ హ్యాష్ ట్యాగ్ స్ప్రెడ్ చేయాలంటూ ప‌వ‌న్ ఫ్యాన్స్ కోరుతున్నారు. “సిగ్గులేని వెధ‌వ వెల్లంప‌ల్లి” అనే యాష్ ట్యాగ్ నేష‌న‌ల్ వైడ్ ట్రెండింగ్‌లో వ‌చ్చేందుకు జ‌నసైనికులు కృషి చేస్తున్నారు. ఇదెక్కడి ట్రెండింగు మహాప్రభో.. అని బహుశా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నెత్తీ నోరూ బాదుకుంటూ వుండి వుండొచ్చేమో. లేదంటే, ఇలా ట్రెండింగ్ అయ్యేందుకే జనసేన పార్టీ మీదా, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీదా వివాదాస్పదమైన కామెంట్స్ చేశారేమో వెల్లంపల్లి శ్రీనివాస్. గతంలో భీమవరం ఎమ్మెల్యే కూడా ఇదే పని చేశారు. ఆ తర్వాత కొడాలి నాని.. లిస్టులో పేర్ని నాని కూడా వున్నారు. కన్నబాబు కూడా అడపా దడపా పబ్లిసిటీ స్టంట్లు కోరుకుంటుంటారు. వారి ముచ్చట జనసైనికులెందుకు కాదంటారా.? తీర్చేస్తున్నారు.. కనీ వినీ ఎరుగని రీతిలో ట్రెండింగులోకి వచ్చేస్తున్నారు వైసీపీకి చెందిన ముఖ్య నేతలు. ఒకరికేమో చిడతల నాని.. ఇంకొకరికేమో మునిసిపాలిటీ వ్యాన్, మరొకరికేమో బోడి లింగం.. ఇలా రకరకాల పేర్లతో, రకరకాల రూపాల్లో సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు జనసైనికులు. తాజాగా, మంత్రి వెల్లంపల్లి శ్రినివాస్ తన మాట మీద అదుపు కోల్పోయారు. అధినేత మెప్పు కోసం తాపత్రయపడే క్రమంలో.. మంత్రి పదవిని ‘కొనసాగించుకోవాలనే’ ఆలోచనతో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదా, జనసైనికుల మీదా, జనసేన పార్టీ మీదా మాట తూలేశారు వెల్లంపల్లి శ్రీనివాస్. ‘సిగ్గులేని వెధవలు..’ అంటూ వెల్లంపల్లి నోరు జారడంతో.. అసలు కథ మొదలైంది. ‘సిగ్గులేని వెధవ వెల్లంపల్లి’ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు పోటెత్తేస్తున్నాయ్. 50 వేల ట్వీట్లు దాటి.. లక్ష ట్వీట్ల వైపుగా పరుగులు పెడుతోంది ఈ ప్రవాహం. ఎక్కడిదాకా ఈ వ్యవహారం వెళుతుందోగానీ.. రాష్ట్ర రాజకీయాల్లో ఓ మంత్రికి సంబంధించి ఇదో సరికొత్త రికార్డు అయ్యేలా వుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మంత్రిగారు గనుక.. కాస్త ఎక్కువ గుస్సా అయితే, కేసులు పెట్టే అవకాశమూ లేకపోలేదు. కానీ, ఎంతమంది మీద కేసులు పెడతారు.? అన్నదే ఇక్కడ ఇంకో చర్చ. అయినా, మంత్రిగారే మాట తూలాక.. సామాన్యులు ఎందుకు దానికి ఘాటైన సమాధానం ఇవ్వకూడదు.? నిజమే మరి, కుక్క కాటుకి చెప్పుదెబ్బ.. అని పెద్దలు ఊరికే అన్నారా.? అంటూ జనసైనికులు సోషల్ మీడియాలో పిచ్చ క్లారిటీతో కనిపిస్తున్నారు. దేవాలయాలపై దాడులు జరిగితే పట్టించుకోని మంత్రి.. దుర్గ గుడి సాక్షిగా ఎప్పటికప్పుడు వివాదాలు తెరపైకొస్తున్నా పట్టించుకోని మంత్రి.. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే స్థాయి కలిగి వున్నారా.? అన్నది జనసైనికుల సూటి ప్రశ్న. అన్నటికీ మించి, గతంలో బీజేపీ నేతగా వున్నప్పుడు, పవన్ కళ్యాణ్ సాయం కోరిన వెల్లంపల్లికి, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే స్థాయి ఎక్కడుందని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఆనాటి వెల్లంపల్లి కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రెండింగ్ అవుతున్నాయి.. అవీ అప్పటి వైసీపీ మీద ఆయనగారు చేసిన విమర్శలు కావడం విశేషం.

Related Articles

Stay Connected

0FansLike
2,948FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles