23.3 C
New York
Thursday, September 16, 2021

కత్తి మహేష్‌ వీలైనంత త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఫాన్స్ ప్రార్ధనలు

కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. చిన్నపిల్లాడిని అడిగినా కూడా పవన్, మహేష్ కత్తి మధ్య గొడవ జరుగుతుందని చెప్పేస్తాడు. అంతగా కొన్నేళ్లుగా పవన్ అభిమానులను రెచ్చగొట్టాడు ఈయన. అలాంటి మహేష్ కత్తి ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. క‌త్తి మహేష్ రీసెంట్‌గా త‌న తన మిత్రుడు, బిజినెస్ పార్ట్నర్ సురేష్‌తో కలిసి.. వారు ప్రారంభించబోతున్న ఒక మిల్లెట్స్, ఇంకా ఒక పెద్ద ప్రాజెక్టు విషయంలో నెల్లూరు నుండి హైద‌రాబాద్‌ కి ప్ర‌యాణం చేస్తున్న క్రమంలో ఆయ‌న కారు ప్ర‌మాదానికి గురైంది. వెంట‌నే ఆయ‌న‌ను హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. నిన్న క‌త్తి మ‌హేష్ ఆరోగ్యం విష‌మించిన‌ట్టు వార్త‌లు రాగా, సాయంత్రం ఆయ‌న క్షేమంగానే ఉన్న‌ట్టు బాబు గోగినేని తెలియజేసారు. మహేష్ కు పెద్ద ప్రమాదం జరిగింది. ప్రాణానికి అపాయం లేదు, స్పృహలోనే ఉన్నారు. ముఖం మీద, ముక్కుకు కలిగిన పెద్ద గాయాలకు చికిత్స జరిగింది. క‌త్తి మ‌హేష్ ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ను వెంటిలేర‌ప్ ఆసుప‌త్రిలో
ఉంచారు. ఒక క‌న్నుబాగానే ఉన్నా, మ‌రో క‌న్ను కాపాడడం స‌వాల్‌గా మారింది. అందుకే ఆ క‌న్నుకి చికిత్స అందించేందుకు అపోలో లో గానీ, శంకర నేత్రాలయ హాస్పిటల్స్‌లో గానీ చికిత్స చేయించే ప్రయత్నంలో ఉన్నారని తెలియ‌జేశారు. అయితే త‌మ‌కు విరోధి అయిన క‌త్తిమ‌హేష్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తుండడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ”కత్తి మహేష్
గారు కోలుకోవాలని నా శ్రీరాముణ్ణి వేడుకుంటున్నాం. ప్రాణం ఎవరికైనా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారు మాకు ద్వేషించడం నేర్పలేదు. శత్రువుని అయినా క్షమించు అని నేర్పించారు” అని పేర్కొంటూ ట్వీట్స్ చేస్తున్నారు పవన్ అభిమానులు. పూన‌మ్ కౌర్ అయితే ”రాముడిని, సీతని నీ అవసరానికి ఇష్టమొచ్చినట్టుగా వాడుకున్నావ్, వదిలేశావ్ ఏళ్ల నుంచి పద్దతిగా తన పని తాను చేసుకునే బ్రహ్మణ అమ్మాయిని.. నువ్ ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇకనైనా అసలు జీవితాన్ని చూస్తావ్ అని. ఇప్పటికైనా అమ్మాయిలను, అమ్మని గౌరవించడం నేర్చుకో జై శ్రీరామ్” అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ సైతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.ఈయన పరిస్థితి తెలిసిన తర్వాత పాత విషయాలన్నీ అంతా మరిచిపోయారు. సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ కత్తి మహేష్ అంటూ పోస్ట్ చేస్తున్నారు. అందులో మరో విశేషం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. ఓ మనిషి ఉన్నపుడే పగలు ప్రతీకారాలు ఉంటాయి. అదే మనిషి చావు బతుకుల మధ్య పోరాడుతున్నపుడు.. అవన్నీ మరిచిపోతారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్‌తో పాటు అందరూ ఇదే చేస్తున్నారు. మానవత్వం చూపిస్తున్నారు.. కత్తి మహేష్‌ను వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles