14.6 C
New York
Saturday, September 25, 2021

జనసేనాని నేర్పిన సేవ మార్గంలోనే జన సైనికులు

మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ ఏ కష్టం వచ్చిన, ఎవరికీ ఏ అన్యాయం జరిగిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి తలుపులు తడుతారు అనే విషయం మన అందరికి తెలిసిందే, ఇప్పటి వరుకు అలాంటి సంఘటనలు మనం ఎన్నో చూసాము, ప్రభుత్వం ద్వారా నష్టపోయిన ప్రజలు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్తే కచ్చితంగా తమకి లాభం చేకూరుతుంది అని నమ్మే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది, ఇక సినిమాల్లో ఉన్నంత కాలం మిత్రులుగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత శత్రువులుగా మారి ఆయనపై విమర్శలు చెయ్యడం కూడా మనం ఇది వరుకు చాలా సార్లు చూసాము, ఉదాహరణకు కమెడియన్ అలీ, కోన వెంకట్ వంటి వారు పవన్ కళ్యాణ్ కి ఎంత మంచి మిత్రులో మన అందరికి తెలిసిందే, అయితే వీళ్ళు  2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు మనం ఎన్నో చూసాము, ఇక పవన్ కళ్యాణ్ సపోర్టుతో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీకి సంబంధించిన మీడియా ఆయన సపోర్టు ఇక తమ పార్టీకి ఉండబోదు అని గ్రహించిన సమయంలో ఆయనపై సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ఆర్టిస్టులతో తమ మీడియా చానెల్స్ ద్వారా లైవ్ డిబేట్స్ పెట్టించి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంపై ఎన్ని విమర్శలు చేసేవారో మన అందరికి తెలిసిందే. ఆలా విమర్శలు చేసిన వారిలో మనం కత్తి మహేష్ ని అంత తేలికగా మరచిపోలేము, అప్పట్లో ఏ న్యూస్ ఛానల్ పెట్టిన ఈయనే కనిపించేవాడు, పవన్ కళ్యాణ్ పై ఈయన చేసిన ఆరోపణలు ఎలాంటివో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, దాదాపు 8 నెలల పాటు ప్రతి రోజు 24 గంటలు కత్తి మహేష్ ని స్టూడియోస్ లో కూర్చో బెట్టి లైవ్ డిబేట్స్ చేసేవాళ్ళు, కత్తి మహేష్ కేవలం పవన్ కళ్యాణ్ మీదనే కాదు, దేవుడు అయినా శ్రీ రాముని పై కూడా విమర్శలు చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, మత కలహాలకు దారి తీసే విధంగా ఉన్న కత్తి మహేష్ కామెంట్స్ ను ఖండిస్తూ ఆయన్నీ తెలంగాణ ప్రభుత్వం 6 నెలల పాటు నగర బహిష్కరణ చేసిన విషయాలు అన్ని మనకి తెలుసు, ఇది ఇలా ఉండగా కత్తి మహేష్ కి ఎమ్మెదనే నెల్లూరు జాతీయ రహదారి సమీపంలో కార్ యాక్సిడెంట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే, ఈ యాక్సిడెంట్ లో కత్తి మహేష్ కి తీవ్రమైన గాయాలు తగిలినా ప్రాణాలతోనే బయట పడ్డారు, అయితే కత్తి మహేష్ కి యాక్సిడెంట్ జరిగింది అనే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆయన కోలుకోవాలి అని చాలా మంది మెసేజీలు పెట్టారు, అంతే కాకుండా కత్తి మహేష్ కి జనసేన పార్టీ కార్యకర్తల నుండి వైద్యానికి నిమిత్తం డబ్బులు సహాయం చేసారు అని, అంతే కాకుండా ప్రమాదానికి గురి అయినా కత్తి మహేష్ ని పవన్ కళ్యాణ్ అభిమానులే కాపాడారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎవ్వరు మాపై ఎన్ని విష ప్రచారాలు చేసిన, మమల్ని ఎంత బాధ పెట్టిన కూడా, మా నాయకుడు మాకు నేర్పించిన సేవ మార్గంలోనే మేము నడుస్తాము అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో కత్తి మహేష్ కోలుకోవాలి అని ప్రార్థనలు చేస్తున్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు గతంలో జరిగిన సంఘటనలను మనసులో పెట్టుకొని జరిగిన ఈ సంఘటనపై జాలి చూపించకపోయిన, అధిక శాతం మంది అభిమానులు కత్తి మహేష్ కోలుకోవాలి అనే ప్రార్థనలు చేస్తున్నారు, ఇక కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని, కాకపోతే ఈ ప్రమాదం లో ఆయన కళ్ళు బాగా దెబ్బతిన్నాయని, ఉన్న 2 కళ్ళలో ఒక్క కన్ను పొయ్యే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం, అయితే శంకర్ నేత్రాలయ వైద్య బృందం కత్తి మహేష్ కంటి చూపుని తిరిగి రప్పించేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు, మరి ఆయన సంపూర్ణ ఆరోగ్యం తో బయట పడాలి అని మన అందరం కోరుకుందాము

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!