23.3 C
New York
Friday, September 17, 2021

పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు.. శక్తి

రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం. సినీ పరిశ్రమలో సక్సెస్, ఫెయిల్యూర్.. అనే లెక్కలేసుకోకుండా సాగింది పవన్ కళ్యాణ్ కెరీర్. కానీ, రాజకీయాల్లో అలా కుదరదు. ఆ విషయం ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నారనిపిస్తుంది. ఎందుకంటె 2024 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ ఎలా రాజకీయంగా సిద్ధమవుతుంది.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. లక్షలాదిమంది అభిమానులు పవన్ కళ్యాణ్ సొంతం. వీళ్ళెవరూ జనసేనను కాదని ఇంకో పార్టీకి ఓటేసే అవకాశమే లేదు. కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులమని చెప్పుకునే కొందరు మాత్రం, పైకి ఒకలా నటిస్తూ, తెరవెనుకాల ఇంకో తరహా రాజకీయం చేయగలరు. నిజానికి, కేవలం పవన్ కళ్యాణ్ అభిమానుల వల్లనే జనసేన పార్టీ ఇప్పుడు ఈ రోజు ఈ స్థాయిలో నిలబడింది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. జనసైనికులంటే, పవన్ కళ్యాణ్ అభిమానులే. ఎంతమంది ఓటర్లను వీళ్ళంతా ప్రభావితం చేయగలుగున్నారు.? అన్నదానిపైనే పార్టీ భవితవ్యం ఆధారపడి వుంది. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోయినా, టీడీపీ – బీజేపీ కూటమికి మద్దతిచ్చింది. కానీ, 2019 ఎన్నికల నాటికి ఈక్వేషన్స్ మారిపోయాయి. ప్రస్తుతం కేవలం బీజేపీతోనే జనసేన ప్రయాణం కొనసాగుతోంది. ఇది, ఇంకో మూడేళ్ళపాటు ఇలాగే కొనసాగుతుందా.? అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. ఇంకా చెప్పాలంటే.. పవన్‌ కళ్యాణ్‌ ఒక్కడే కానీ ఆయన వెనకాల బోలెడంత సైన్యం ఉంది. డబ్బులు ఖర్చు చేస్తే వచ్చే సైన్యం కాదది. ఒక్క పిలుపుతో అక్కడికక్కడ, అప్పటికప్పుడు జన సంద్రాన్ని సృష్టించగల శక్తి ఆయన మాటకుంది. పవన్‌ కళ్యాణ్‌ అంటే వ్యక్తి కాదు, శక్తి. సినీ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ రంగంలోకి వచ్చింది అధికారం చేజిక్కించుకోవడం కోసం కాదు. సేవ చేయడం కోసం. ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామని చాలా మంది చెప్పడం చూశాం. చూస్తూనే ఉన్నాం. అలాంటి చాలా మందిలా కాదు, పవన్‌ కళ్యాణ్‌ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఐదేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించినప్పుడు ఏ భావజాలంతో అయితే ఉన్నాడో ఇప్పుడూ ఆయనలో అదే భావజాలం. అప్పుడూ, ఇప్పుడూ ఆయన పదవి కోసం ఆశ పడింది లేదు.జనసేనను అధికారంలోకి తీసుకొస్తామని చెప్పింది ప్రజలకు మెరుగైన పాలనను అందించడం కోసమే. అధికారం దక్కకపోయినా, జనంలోనే ఉంటాననీ, గెలిపించినా, గెలిపించకపోయినా ప్రజల తరపునే నిలబడతానని చెప్పే ధైర్యం ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఎంతమందికి ఉంది.? నేను ముఖ్యమంత్రిని అయిపోతా.. అంటే జనం గెలిపించేయరు. మంచి, చెడుల బేరీజు జనానికి బాగా తెలుసు. జనం ఆదరిస్తే, జనసేన అధికారంలోకి వస్తుంది. లేకపోతే రాదు. కానీ అసలంటూ జనసేన జనంలోకే వెళ్లకూడదని కుట్రలు పన్నితే ఎలా.? జనసేన, టీడీపీతో కలిసి పోటీ చేస్తుందని ఒకరు, వైఎస్సార్‌సీపీతో కలిసిపోతుందని ఇంకొకరు, బీజేపీతో అంటకాగుతోందని మరొకరు, టీఆర్‌ఎస్‌తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతోందని వేరొకరు. ప్రతీరోజూ జనసేనకు వ్యతిరేకంగా పుకార్లు పుట్టిస్తూనే ఉన్నారు. రాజకీయాల్లో ఇలాంటి ప్రచారం మామూలే అయినా, క్యారెక్టర్‌ అసాసినేషన్‌ అత్యంత హేయం. టీడీపీని నమ్మేవాళ్లున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అభిమానించేవాళ్లున్నారు. టీఆర్‌ఎస్‌ని ఇష్టపడేవాళ్లున్నారు. బీజేపీనీ, కాంగ్రెస్‌ పార్టీనీ సమర్ధించేవాళ్లున్నారు. వామపక్షాల వెంట నడిచేవాళ్లూ ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వం. ఏకత్వంలో భిన్నత్వం మన గొప్పతనం. ఎవరితోనో పవన్‌ కళ్యాణ్‌ కలిస్తే ఇంకెవరికో ఎందుకు నొప్పి పుట్టాలి.? ఆ కలయిక మంచిదో కాదో నిర్ణయించాల్సింది ప్రజలు. ఈ లోగా కడుపుబ్బరం ఆపుకోలేని లేకితనం.. ఎవరికైనా ఎందుకుండాలి. ఆ మాటకొస్తే, ఏ పార్టీకి అయినా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది. ఇలా ఆలోచించడానే పోజిటివ్‌ పాలిటిక్స్‌ అంటాం. ప్రస్తుత రాజకీయాల్లో పోజిటివ్‌ పాలిటిక్స్‌ అనే మాట చాలా మందికి నచ్చకపోవచ్చు కాక. కానీ అది నిషేధిత వ్యవహారం కాదు కదా. సర్వేల్లో నాలుగైదు శాతం మాత్రమే ఓటు బ్యాంకు జనసేనకు వస్తుందని వింటున్నాం. ఆ నాలుగైదు శాతం చూస్తే, ఇతర రాజకీయ పార్టీలు భయపడుతున్నాయంటే, జనసేన బలం నాలుగూ కాదు, ఐదూ కాదు, అంతకు మించి ఎన్నో రెట్లు ఎక్కువని ఒప్పుకుంటున్నట్లే కదా. జనసేన అయినా, ఇంకో రాజకీయ పార్టీ అయినా, మరో రాజకీయ పార్టీ అయినా ధైర్యంగా రాజకీయాలు చేయాలి. భయపడడంలోనే ‘పడడం’ ఉంటుంది. ఇదీ నిజం. ఇదే పవనిజం. కరోనా నేపథ్యంలో కొంతకాలం రాజకీయాల నుంచి ‘విరామం’ తీసుకున్న పవన్ కళ్యాణ్, తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అవబోతున్నారు. ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు రాజకీయాలు.. 2 పడవల ప్రయాణం పవన్ కళ్యాణ్ కొత్తగా చేస్తున్నదేమీ కాదు. కానీ, ఈసారి చాలా చాలా ప్రత్యేకం. రెండేళ్ళు గడిచిపోయింది.. ఇంకో మూడేళ్ళు.. ఈ మూడేళ్ళు అత్యంత కీలకం. ఇంకో రెండున్నరేళ్ళలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈలోగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన బలపడాలంటే, మిత్రపక్షంతో మరింత సఖ్యత అవసరం. లేదా, మిత్రపక్షం బీజేపీని కాదని ఒంటరిగా.. మరింత ధైర్యంగా ముందడుగు వేయాల్సిందే.!

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles