23.6 C
New York
Monday, September 20, 2021

పవన్‌ కళ్యాణ్‌ అనేది ఓ పేరు మాత్రమే కాదు, అదొక బ్రాండ్‌

రాజకీయాల్లో బలం వుండాలి.. బలగం కూడా వుండాలి. మరి, జనసేనాని పవన్‌కళ్యాణ్‌కి ఆ బలం, బలగం రెండూ వున్నాయా.? అంటే ఖచ్చితంగా 100 కి 200% ఉన్నాయనే చెప్పవచ్చు. ముందు రాజకీయాల్లో పవన్ ‘జీరో’ అన్నవారే, ఇప్పుడు ‘హీరో’ అంటూ జనసేన పార్టీ గురించి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించీ చర్చించుకుంటుండడం విశేషం. సినీ నటుడిగా పవన్‌కళ్యాణ్‌కి వున్న అభిమానుల సంఖ్య తక్కువేమీ కాదు. పవన్‌కళ్యాణ్‌ సినీ నటుడు మాత్రమే కాదు, అంతకు మించి ఆయనలో ఏదో ‘శక్తి’ వుందని ఆయన అభిమానులు నమ్ముతారు. ఓ ‘మతం’ అనే స్థాయిలో పవన్‌కళ్యాణ్‌ని ఇష్టపడ్తారు. ఆ ఇష్టానికి అభిమానులు పెట్టుకున్న పూర్తి పేరు ‘పవనిజం’. పవన్‌కళ్యాణ్‌ అంటే ఓ నిజం.. పవన్‌కళ్యాణ్‌ అనేది ఓ పేరు మాత్రమే కాదు, అదొక బ్రాండ్‌.. అని నమ్మే అభిమానులు.. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ‘పవర్‌ స్టార్‌’ అని పిలిచినా, ‘పవర్‌ కింగ్‌’ అంటూ ఆయన్ని అభిమానించే ఓ గాయకుడు పిలుచుకున్నా.. పవన్‌ కళ్యాణ్‌ పేరు చెప్పగానే ఓ ‘పవర్‌’ ఆటోమేటిక్‌గా జనరేట్‌ అయిపోతుంటుంది ఆయన్ని అభిమానించేవారిలో. ఏముంది పవన్‌ కళ్యాణ్‌లో అంత ప్రత్యేకత.? అది ఆయన్ని అభిమానించేవారికి మాత్రమే తెలుసు. ‘పవనిజం’ అంటూ ఓ ‘ఇజం’ క్రియేట్‌ చేసేసుకున్నారు పవన్‌ కళ్యాణ్‌
అభిమానులు. ఆయనలో ఎంత ప్రత్యేకత లేకపోతే.. ఆయన్ని అంతలా అభిమానించేస్తారు.? సినిమా హిట్టయినా.. ఫట్టయినా పవన్‌ కళ్యాణ్‌పై ‘క్రేజ్‌’ అస్సలేమాత్రం తగ్గదు. ఆ మాటకొస్తే, ఏనాడూ పవన్‌ కళ్యాణ్‌ బాక్సాఫీస్‌ లెక్కల గురించి పట్టించుకోలేదు. ‘సినిమా కోసం పనిచేయాలనుకున్నప్పుడు, ప్రాణం పెట్టేయడమొక్కటే తెలుసు’ అంటాడాయన. ఆ కమిట్‌మెంట్‌ అభిమానులకు బాగా నచ్చుతుంది. జస్ట్‌ సినిమా అభిమానులే కాదు, తెరపై ఆయన్ని చూసి విజిల్స్‌ వేయడమే కాదు.. అంతకు మించిన ప్రత్యేకతని పవన్‌ కళ్యాణ్‌లోఆయన అభిమానులు చూస్తున్నారు. అదే, వ్యక్తిత్వం. ఎవరైనా ఎన్నయినా విమర్శలు చేయొచ్చుగాక. కానీ, అలా విమర్శించే వారికీ తెలుసు పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిత్వమేంటో. ఎవరికో చెంచాగిరీ చేయాలి కాబట్టి, పవన్‌ కళ్యాణ్‌ని అడ్డగోలుగా విమర్శిస్తారుగానీ.. అంతకు మించి నిఖార్సుగా పవన్‌ కళ్యాణ్‌ని విమర్శించడానికి వాళ్ళ దగ్గర సరైన పాయింటే వుండదు. అదీ పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేకత. పబ్లిసిటీకి దూరంగా, పవన్‌ కళ్యాణ్‌ చేసే సేవా కార్యక్రమాలుంటాయి. సాయం పొందిన వ్యక్తులు.. ఎప్పుడో ఒకప్పుడు, ఆ సాయం గురించి చెబితే తప్ప, పవన్‌ కళ్యాణ్‌ ఇలా సాయం చేశాడట.. అన్న విషయం బయటకు పొక్కదు. ఇలాంటి సంఘటనలు ఒకటా.? రెండా.? పదా? పాతికా.? లెక్కలేనన్ని కన్పిస్తాయి. సినీ జీవితం తనకు చాలా ఇచ్చింది.. మరి, ప్రజల కోసం ఏం చేయగలను.? అన్న ఆలోచనతోనే రాజకీయాల్లో తొలి అడుగు అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో పడింది. కొన్ని కారణాలతో, కొన్నాళ్ళపాటు రాజకీయాలకు దూరమవ్వాల్సి వచ్చింది. ఈసారి, జనసేన పార్టీతో జనంలోకి వచ్చారు పవన్‌ కళ్యాణ్‌. గెలవడమంటే.. ఎవర్నో ఓడించడం కాదు.. వ్యవస్థలో మార్పుని తీసుకురావడమనే భావనతో జనసేన పార్టీని.. ఆ జనం కోసమే నడుపుతున్నారు.అందుకే, తమకు సమస్య వస్తే.. ఆ జనం తొలుత జనసేన పార్టీ తలుపు తడుతున్నారు. మార్పు కోసం జనసేన.. అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ‘పవర్‌’ ఆయన పేరులోనే వుంది. ఆ పవర్‌ ఇప్పుడు ప్రజా సేవ కోసం ఉపయోగపడుతుంది. అధికారం చేజిక్కించుకోవడమంటారా.? తాను కోరుకున్న మార్పుని సాధిస్తే.. అది అధికార పీఠమెక్కడం కంటే ఎక్కువ ‘కిక్కు’ ఇస్తుంది. ఆ కిక్కునే కోరుకుంటున్నారు జనసేనాని. దటీజ్‌ పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. ఇంతకీ 2024 ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ని రాజకీయంగా ‘హిట్‌’ చేస్తారా? ఏమో, 2024 ఎన్నికల దాకా వేచి చూడాలి. మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులే, ఆయన తమ్ముడైన పవన్‌కళ్యాణ్‌నీ అభిమానించడం మొదలు పెట్టారు. అయితే, తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సినీ పరిశ్రమలో సంపాదించుకున్నట్టే.. తనకంటూ ప్రత్యేకంగా అభిమానుల్నీ సంపాదించుకున్నారు పవన్‌కళ్యాణ్‌. చిరంజీవిని అభిమానించేవారంతా పవన్‌కళ్యాణ్‌ని అభిమానిస్తారు. అయితే, పవన్‌ అభిమానులు మళ్ళీ ప్రత్యేకం. అవసరమైతే చిరంజీవిని ప్రశ్నించడానికైనా పవన్‌ అభిమానులు వెనుకడుగు వేయరు. ఆ ‘పవనిజం’ కొన్నిసార్లు మెగా కాంపౌండ్‌కి కొన్ని చిక్కులు తెచ్చిపెట్టింది కూడా. కానీ, వాళ్ళంతా దురభిమానులేననీ.. పవన్‌ని అభిమానించేవారెవరూ, ‘అన్నయ్య’ చిరంజీవినిగానీ, ఇతర మెగా కుటుంబ సభ్యులనుగానీ ద్వేషించరనే వాదనా ఒకటి వినిపిస్తుంటుందనుకోండి. అది వేరే సంగతి. 2009 ఎన్నికలకు ముందే పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చారు. అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి మెయిన్‌ పిల్లర్‌ తమ్ముడే. అన్నయ్య సెక్యూరిటీ దగ్గర్నుంచి, పార్టీ సిద్ధాంత రూపకల్పన వరకు, అభిమానుల్ని ఒక్కతాటిపైకి తీసుకురావడం దగ్గర్నుంచి.. పార్టీపై అవాకులు చెవాకులు పేలేవారికి కౌంటర్లు ఇవ్వడం వరకు.. పవన్‌కళ్యాణ్‌ చూపిన శ్రద్ధ అంతా ఇంతా కాదు. ‘యువరాజ్యం’ అధ్యక్షుడిగా ప్రజారాజ్యం పార్టీ యూత్‌ వింగ్‌ బాధ్యతల్ని పవన్‌ నిర్వర్తించారు. అయితే, ఆ తర్వాత పార్టీలో చిన్నపాటి సమస్యల కారణంగా, అన్నయ్య మీద అభిమానం వున్నా, ఆ తర్వాత పార్టీకి పవన్‌ దూరం కాక తప్పలేదు. పార్టీ పెట్టి, ఆ వెంటనే జనంలోకి వెళ్ళిపోయి.. ఆ తర్వాత ఫలితం ఆశించినట్లు రాకపోతే ఏంటి సంగతి.? అన్న ప్రశ్నకు ప్రజారాజ్యం ద్వారా సమాధానం దొరికింది కనుకనే, పవన్‌ ‘జనసేన’ విషయంలో ఆచి తూచి వ్యవహరించారు.బీజేపీ – టీడీపీలకు 2014 ఎన్నికల్లో మద్దతిచ్చారు. కొంతకాలం ఆ 2 పార్టీల పాలననీ గమనించారు. విసుగెత్తి, తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఏది ఏమైనా, ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ వాక్యూమ్‌ పవన్‌కళ్యాణ్‌కి కలిసొచ్చే అంశం. చిరంజీవి, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు లేని వాక్యూమ్‌ ఇప్పుడు స్పష్టంగా కన్పిస్తోంది. దాన్ని పవన్‌కళ్యాణ్‌ భర్తీ చేయగలిగితే, జనసేన రాజకీయ పార్టీకి మంచి భవిష్యత్తు వుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. మరి, పవన్‌ ఆలోచనలు.. వ్యూహాలు..ఆంధ్రప్రదేశ్‌లో జనసేనకు అధికారం కట్టబెడ్తాయా.? జనసేన రాజకీయ ప్రస్థానమెలా వుంటుంది.? వేచి చూడాల్సిందే.

Related Articles

Stay Connected

0FansLike
2,948FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles