17.8 C
New York
Tuesday, September 21, 2021

బీజేపీతో పవన్ కల్యాణ్ మైండ్ గేమ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు, బీజేపీ నేతలకు మధ్య దూరం పెరిగినట్లే కన్పిస్తుంది. దేశానికి బలమైన నాయకత్వం అవసరమని, ఆ బలమైన నేత ప్రధాని మోదీ ఒక్కరేనని, అందుకే జనసేన బేషరతుగా బీజేపీతో కలిసి పనిచేస్తుందని, ఈ పొత్తు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతుందని గతంలో బల్లగుద్ది చెప్పారు. అటు ఏపీ బీజేపీ, ఇటు తెంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తరచూ తమ ప్రకటనల్లో జనసేనాని పవన్ తో పొత్తును, స్నేహాన్ని క్రమం తప్పకుండా ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే పేరుకు పొత్తు ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్.. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బీజేపీని సమర్థించాలని జనసైనికులకు పిలుపు ఇవ్వలేదు. తాజాగా బీజేపీకి వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల్ని పోటీకి దింపారు. అటు ఏపీలోని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలోనూ జనసేన బరిలోకి దిగుతుందని పార్టీ నేతలు కరాకండిగా చెప్పేసారు. దాంతో  ఈమధ్య జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వారి మధ్య మరింత దూరం పెంచింది. జనసేనపై ఎన్నో ఆశలుపెట్టుకున్న బీజేపీకి తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు షాక్ ఇచ్చాయనే చెప్పాలి. జనసేన ఓటు బ్యాంకు తమకు షిఫ్ట్ కాలేదన్న ఆగ్రహం బీజేపీ నేతల్లో ఉంది. టీడీపీకే ఆ ఓట్లు పడటంతో భవిష్యత్ రాజకీయం ఎలా నడపాలన్న దానిపై ఇటీవల సీనియర్ నేతలు మంతనాలు జరిపినట్లు తెలిసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లక్షలాది మంది అభిమానులున్నారు. అది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అభిమానులు ఓట్లతో పాటు కాపు సామాజికవర్గం ఓట్లు కూడా అండగా ఉంటాయని బీజేపీ భ్రమించింది. బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఓట్లు తమ వైపు టర్న్ కాకపోవడంతో బీజేపీ అగ్రనేతలు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రనాయకత్వం జనసేనను బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను మరోసారి తెరపైకి తేనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల సమయంలోనే బీజేపీ ఈ ప్రతిపాదన తెచ్చినా పవన్ కల్యాణ్ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. పవన్ కల్యాణ్ బిజెపిపై వివాదాస్పదమైన కామెంట్స్ కూడా  చేశారు బిజెపి రాష్ట్ర నాయకత్వం తనను వాడుకుని వదిలేసిందని జనసేన నాయకులు తన దృష్టికి తెచ్చారని, గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, అలాంటివారితో మీరు ఇంకా స్నేహం చేయాలని చెప్పే ధైర్యం తనకు లేదని ఆయన ఆయన అన్నారు.  జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తే అసలుకే ముప్పు ఏర్పడుతుందని సన్నిహితులు సలహా ఇస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే గౌరవప్రదమైన స్థానాలు సాధించగలమని చెబుతున్నారు. మొత్తం మీద బీజేపీకి, పవన్ కల్యాన్ కు మధ్య దూరం పెరిగిన మాట వాస్తవం. 

Related Articles

Stay Connected

0FansLike
2,950FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!