14.6 C
New York
Saturday, September 25, 2021

రూపాయి ఖర్చు లేని రాజకీయం… జనసేన కే సాధ్యం

మన దేశంలో ఎన్నికలు అంటే గుర్తుకు వచ్చేది నోట్ల కట్టలు, బిర్యానీ ముక్కలు, మందు చుక్కలు.. ఇదే విధానం గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొనసాగుతుంది.. వినపడుతోంది కూడా. ఎన్నికలు ఏవైనా సరే.. ముందుగా ఉండాల్సింది, ప్రజలకు మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టి గెలిచి మళ్ళీ ప్రజలను దోచుకోవడం ఇదే మన నాయకుల అదే రాజకీయ నాయకుల ఎన్నిక నియమం ఏమో.? రాజకీయ నాయకులు వాళ్ళ తలరాతేమో కానీ మనది తలరాత, మన దేశ తలరాత రాసేది వారే, స్వాతంత్రము వచ్చే 75 ఏండ్లు అయినా అన్ని వనరులు వున్నా మనము అభివృద్ధి చెందలేదు అంటే కారణము ఎవరు ? అయినా ఎవరినో అనుకుంటే ఏమి లాభము.? మీరే రాజకీయ ఎందుకు రంగాన్ని శాసించ కూడదు.? ఆసక్తి వుండి, ఎన్నికలో నిలబడటానికి ఖర్చు గురించి ఆలోచిస్తున్నారా.? అవును.. ఎన్నికల్లో నిలబడాలంటే మన దేశంలో డబ్బు ఉండాలి.. పలుకు బడి ఉండాలి, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయి ఉండాలి, ఇక అందులోనూ కులం మళ్ళీ వర్గం.. ఇవి అన్ని ఉంటేనే రాజకీయ రంగ ప్రవేశం చేయాలి.. ప్రస్తుతం ఇదే అందరి మదిలో, మెదడులో మెదులుతున్న ప్రశ్న. రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలి అని ఎంతో మందికి ఉంటుంది. యువ రక్తం సైతం రాజకీయాల్లోకి రావాలని ఉరకలు వేస్తుంది. కానీ మనీ అనే మ్యాటర్ దానికి అడ్డు కట్ట వేస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో మనీ తో పని లేకుండా, కులం మతం మాట లేకుండా యువత రాజకీయాల్లోకి రావడానికి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే అంశాన్ని తీసుకువచ్చాడు ప్రజా నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మనీ లేకుండా, కులం మతం వర్గం లేకుండా కూడా రాజకీయాల్లోకి రావాలని, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని.. యువతతోనే మార్పు సాధ్యం అని యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు జనసేనాని. కేవలం పిలుపు ఇస్తే కాదు, ఆచరించి చూపించాలి సరిగ్గా పవన్ అదే చేసాడు. తను ప్రజలకు చెప్పిన మాటనే తాను తూచా తప్పకుండా పాటించాడు.. ఇంకా పాటిస్తున్నాడు. పవన్ చెప్పిన జీరో బడ్జెట్ పాలిటిక్స్ ని రాజకీయ నాయకులు విమర్శించారు, ఎందుకంటే వారు రాజకీయ నాయకులు మనీ మతం కులం వర్గం లేకుండా వారికి రాజకీయాలు తెలీదు కాబట్టి. కానీ ప్రజాస్వామ్యం, ప్రజలు పాలన తెలిసిన నాయకులు జీరో బడ్జెట్ పాలిటిక్స్ ని సమర్థిస్తారు. ఇదిలా ఉండగా పవన్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో ప్రజల్లోకి వెళ్ళాడు. రాజకీయ నాయకులు ప్రజలను పూర్తిగా ఓట్లు అంటే డబ్బు అనేలా మభ్య పెట్టారు, దీంతో పవన్ నిలబడిన ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నారు. కానీ పవన్ ఓడింది నోట్ల కట్టల రాజకీయంలో తప్పా, ప్రజల్లో కాదు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్  ప్రజల్లో చైతన్యం వచ్చేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఏ ఎన్నిక  జరిగిన కూడా జనసేన మంచి ఫలితాలు సాధిస్తుంది. ఇక ఎన్నికల్లో బరిలో నిలిచిన జనసేన పార్టీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పోటీ చేస్తున్నారు.ఇదిలావుండగా పలుకుబడి లేకుండా, పైసలు లేకుండా రాజకీయాలపై, ప్రజా సేవ పై ఆసక్తి ఉన్న యువతకు అవకాశం కల్పించి సమాజ సేవ కోసం నాయకులుగా, ప్రజా నాయకులుగా, సేవకులుగా, సైనికులుగా తయారు చేస్తున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్. రాజకీయాలంటే చుక్క ముక్క అని, కులం మతం అనే వారికి సమాధానం చెప్పి మార్పు వచ్చేలా జీరో బడ్జెట్ పాలిటిక్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ యువతను రాజకీయాల్లోకి తీసుకు రావాలని, యువతతోనే మార్పు సాధ్యమని నిరూపిస్తున్నాడు

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!