23.2 C
New York
Sunday, September 19, 2021

కడప క్వారీలో పేలుడు సంఘటన తన హృదయాన్ని కలచివేసిందన్న పవన్ కళ్యాణ్

కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్ళపల్లి శివారు ప్రాంతంలో ఉన్న ముగ్గురాయి గనుల్లో భారీ పేలుడు సంభవించి పది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఘటనా స్థలంలో మృతదేహాన్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇప్పటికే ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ,టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించగా తాజాగా ఈ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.  వెళ్తే.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కొద్దిరోజుల క్రితం కరోనా సోకిన సంగతి తెలిసిందే. దాదాపు 4 వారాలుగా ఆయన తన ఫామ్ హౌస్ లో కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఐతే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో జనసేన కార్యకర్తలతో పాటు పవన్ అభిమానులు ఆందోళన చెందారు. ఐతే వారందరికీ పవన్ శుభవార్త చెప్పారు. పవన్ కల్యాణ్ కరోనా నుంచి కోలుకున్నట్లు జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.

3 రోజుల క్రితం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ టెస్టులో ఆయనకు నెగెటివ్ వచ్చింది. ప్రస్తుతం పవన్ బాగానే ఉన్నారని.. కాకపోతే కాస్త నీరసంగా ఉన్నరని జనసేన తెలిపింది. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం, వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ కరోనా బారిన పడ్డారు. తొలుత ఆయన సెక్యూరిటీ సిబ్బందికి వైరస్ సోకింది. తర్వాత పవన్ కు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్పటి నుంచి పవన్ కల్యాణ్ తన సొంత వ్యవసాయక్షేత్రంలో చికిత్స తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కు వ్యక్తిగత వైద్యుడితో పాటు అపోలో హాస్పిటల్స్ కు చెందిన వైద్య బృందం ట్రీట్ మెంట్ అందించింది. తాజాగా పవన్ కు నెగెటివ్ రావడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఐతే పవన్ కు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. మరోవైపు తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతిఒక్కరికీ పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ వైద్యులు ఇచ్చే సూచనలు పాటించాలని పవన్ పిలుపునిచ్చారు. కరోనా సోకడంతో పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చారు. తిరుపతి ఉపఎన్నికకు సంబంధించిన చివరి ప్రచార సభలో పవన్ పాల్గొనలేకపోయారు. ఓవైపు కరోనాతో ఇబ్బంది పడుతున్నా.. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా నుంచి కోలుకున్న పవన్ కల్యాణ్ కడప జిల్లాలోని మామిళ్లపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో జరిగిన భారీ పేలుడులో 10 మంది దుర్మరణం చెందిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర విషాదకరమన్నారు. జిలిటెన్‌స్టిక్స్ పేలి 10 మంది మృత్యువాత పడ్డారనే వార్త హృదయాన్ని కలచివేసిందన్నారు. ఈ విషాదకర ఘటనలో చనిపోయినవారిని గుర్తించలేని పరిస్థితి ఉందని భావోద్వేగం చెందారు. దీన్ని బట్టి ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి.. మృతుల కుటుంబాలకు న్యాయబద్ధమైన పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. గని యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles