23.2 C
New York
Tuesday, September 21, 2021

ధైర్యం బయటకొచ్చి ఓటేయలేమా ?” అని ప్రజలను ప్రశ్నించిన పవన్ కల్యాణ్

టెంపుల్ సిటీ తిరుపతిలో జనసేన-బీజేపీ పార్టీలు సమర శంఖం పూరించాయి. తిరుపతిలో ఉపఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశాయి. తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్.. వైసీపీపై నిప్పుల వర్షం కురిపించారు. వైసీపీ గూండాలకు ఎంతకాలం భయపడతామని .. సామాన్యులపై ప్రతాపం కాదు దమ్ముంటే తనపై చూపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ బాబాయి వివేకా దారుణ హత్యకు గురైతే ఇంతవరకూ ఎవరు చంపారో తెలియకపోవడం విచారకరమని ఆయన విమర్శించారు. బీజేపీ అభ్యర్థి రత్న ప్రభ కుటుంబం రాష్ట్రానికి ఐఏఎస్ ఎన్నో సేవలు చేశారని.. ఆమెను గెలిపిస్తే తిరుపతి మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ”జీవితంలో నాకు ఏ కోరికా లేదు. దేశభక్తి మాత్రమే ఉంది. పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రన్ని కొందరు నాశనం చేస్తున్నారు. ఏ గుండాలకైనా ఎంతకాలం భయపడతాం. పులి వెందుల పేరు ఎవరి మీద దౌర్జన్యాలు చేస్తారు. పులివెందుల పేరు దుర్మార్గాలకు, దోపిడీకి అడ్రస్‌గా మారిపోయింది. మానవ హక్కులు కాలరాసి పోతున్నాయి. ఫ్యాక్షన్ గుండాలకు భయపడే వ్యక్తి పవన్ కల్యాణ్ కాదు. మర్యాదగా ఉండకపోతే రోడ్లపైకి వచ్చి చొక్కాలు పట్టుకొని లాగుతాం. ఏ గుండాలకైనా ఎంతకాలం బయటపడతాం. తిరుపతిని ఎవరు అభివృద్ధి చేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలి. నేను కోట్లు సంపాదిస్తా. కోట్లు పన్నుకడతా. జనాలకు ఇస్తా. అధికారం బదలాయింపు జరగాలి.” అని పవన్ కల్యాణ్ తెలియజేసారు. ”మార్పు రావాలి అంటే ముందు ఓటు వెయ్యాలి మీరు.భాద్యతల్ని విస్మరిస్తే హక్కుల్ని కోరే అధికారం ప్రజలుగా మనకి ఉండదు. రోడ్లమీదకొచ్చి పోరాటం చేయమనట్లేదు, మన భాద్యత ఓటు వేయడం, ఆ భాద్యతని సరిగా వినియోగించుకోవడం మన కర్తవ్యం. గాంధీ, బోస్, ఆజాద్ లాంటి మహనీయులని స్మరించుకుంటాం, వారి స్పూర్తి కొనసాగాలని కోరుకుంటాం. ఓటేసే రోజు మాత్రం సెలవు రోజుగా భావిస్తాం. 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ మృత్యువుని ముద్దాడ్డాడు, మనం ప్రాణాళివ్వాల్సిన అవసరం లేదు, ధైర్యం బయటకొచ్చి ఓటేయలేమా ?” అని ప్రజలను ప్రశ్నించారు జనసేనాని. పవన్ ప్రసంగిస్తుండగా సీఎం సీఎం అంటూ అభిమానులు, కార్యకర్తలు గట్టిగా అరిచారు. ఐతే సీఎం పదవి వచ్చినా రాకపోయినా.. తుదిశ్వాస వరకు ప్రజల పక్షాన ఉంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాను ప్రజల గుండెల్లో ఉన్నానని అది చాలని ఆయన అన్నారు. కాగా, పవన్ కల్యాణ్‌కు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ రాఖీ కట్టారు. అనంతరం పంచ్‌ డైలాగులతో ప్రసంగించారు. రావడం లేటు కావచ్చు గానీ రావడం మాత్రం పక్కా అని పవన్ డైలాగ్ పేల్చారు. ఇన్నాళ్లు తనను వైసీపీ నేతలు ట్రోలింగ్ చేశారని.. ఇప్పుడు తనకు అండగా పవన్ తమ్ముడు వచ్చారని, ఇప్పుడు ట్రోల్ చేసే దుమ్ముందా అని ఆమె విరుచుకుపడ్డారు.

Related Articles

Stay Connected

0FansLike
2,952FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!