23.6 C
New York
Monday, September 20, 2021

కరోనా బారిన పడిన పవన్ కళ్యాణ్ కు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్

తెలుగు సినీరంగంలో చాలామంది సినీ నటీనటులు, నిర్మాతలు, దర్శకులు కరోనా బారిన పడ్డారు. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఈయనకు కూడా గత 10 రోజుల కింద పాజిటివ్ వచ్చింది. ఈ విషయం స్వయంగా జనసేన పార్టీ సభ్యులే తెలిపారు. దాంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. 5 రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది. దాంతో ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు.  అయినా కూడా ఈయన క్వారంటైన్‌ లోనేఉండటానికి కారణం చాలా బలంగానే ఉంది. బయట ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు. కరోనా ఎంతగా తన ఉగ్రరూపాన్ని చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి కామన్ మ్యాన్ అయినా ఒక్కటే.. పవర్ స్టార్ అయినా ఒక్కటే. అందర్నీ అటాక్ చేయడమే కరోనాకు తెలిసిన మంత్రం. ఈ క్రమంలోనే పవన్ కళ్యాన్ తో సహా తెలుగు సినీరంగంలోనూ చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అయితే పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని.. ఆయన ఆరోగ్యం గురించి కంగారు పడాల్సిన పనే లేదని జనసేన వర్గాలు తెలియజేశాయి. సాధారణంగా నెగిటివ్ వచ్చిన తర్వాత బయటికి వచ్చేస్తుంటారు. క్వారంటైన్ నుంచి విముక్తి పొందుతుంటారు. వకీల్ సాబ్ సినిమాకు పని చేసిన నివేదా థామస్, దిల్ రాజు లాంటి వాళ్లు కూడా కరోనాను జయించిన తర్వాత బయటికి వచ్చారు. కానీ పవర్ స్టార్ మాత్రం ఇప్పటికీ క్వారంటైన్‌లోనే ఉన్నారు. కొన్ని రోజులు ఐసోలేషన్‌లో ఉన్న ఈయన.. ఇప్పుడు హోమ్ క్వారంటైన్‌కు వెళ్ళిపోయారు. మరికొన్ని రోజులు అక్కడే ఉండాలని పవన్  కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అక్కడే వైద్యుల బృందం ఆయన్ని నిరంతరం పరీక్షిస్తున్నారు. అయితే నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా పవన్ బయటికి ఎందుకు రావడం లేదని అభిమానులు ఆరా తీస్తున్నారు. దీని వెనక కారణం కూడా పెద్దదిగానే  ఉంది. పవన్ కళ్యాణ్‌ కు నెగిటివ్ వచ్చినా కూడా లోపల ఊపిరితిత్తులకు మాత్రం కాస్త ఇన్ఫెక్షన్ సోకిందని తెలుస్తుంది. దాంతో లోపలే ఉండి చికిత్స తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్‌ . ప్రస్తుతం ఈయన శంకర్‌పల్లిలో ఉన్న ఫామ్ హౌజ్‌లో ఉన్నారు పవన్. ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పవన్ ఆరోగ్యం విషయంలో అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. అయితే ప్రమాదమేం లేదని.. పవన్ ఇప్పుడు పర్ఫెక్టుగా ఉన్నాడని.. ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్తున్నారు సన్నిహితులు. కాకపోతే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందనేది వైద్యుల సూచన. అందుకే కరోనాను జయించిన తర్వాత కూడా ఇప్పటికీ క్వారంటైన్‌లోనే ఉన్నాడు పవర్ స్టార్. హరిహర వీరమల్లుతో పాటు అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్‌లలో నటిస్తూ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్.

Related Articles

Stay Connected

0FansLike
2,947FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles