22 C
New York
Wednesday, September 22, 2021

తెలిసీ పెళ్లైన వాడితో రిలేషన్ షిప్ పెట్టుకున్నా… ఆ తర్వాతే….??

జనరల్ గా పెళ్లికి ముందు ప్రేమ అంటే అందులో ఎలాంటి రిస్క్ కానీ తప్పు కానీ లేవంటారు కానీ అదే పెళ్లి తర్వతా అది కూడా తన పార్టనర్ తో కాకుండా బయట వ్యక్తులతో ప్రేమ అంటే అది హైలీ రిస్క్!!!! అయితే ఈ మోడ్రన్ వరల్డ్ లో అలాంటివి చాలా ఎక్కువగానే జరుగుతున్నాయి. అలాంటి ఒక సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది దీంట్లో చాలా ట్విస్ట్ లే ఉన్నాయి అలా పెళ్లయిన వ్యక్తిని ప్రేమించిన అమ్మాయి పేరు సంజనా వయసు 26 ఇయర్స్… ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. మరి అలాంటి అమ్మాయి పెళ్లయిన అతన్ని ఎలా లవ్ చేసింది ఎందుకు లవ్ చేసింది?? దాని గురించి తానే తన సొంత బ్లాగులో షేర్ చేసుకుంది… ఇప్పుడు ఆ విషయాలన్నీ మనం కూడా తెలుసుకుందాం పదండి…

సంజనా తన లైఫ్ లో అప్పటికే ఇద్దరితో లవ్ లో పడింది అయితే తన బ్యాడ్ లక్ ఆ రెండు లవ్ స్టోరీ లు కూడా హ్యాపీ ఎండింగ్ కాదు. మొదటగా సంజనా ప్రేమించిన అబ్బాయి ఆవిడ మీద అనుమానాలతో గొడవలు పెట్టుకుని బ్రేకప్ చెప్పాడు. ఆ తర్వాత సంజనకు తన కంపెనీలో పనిచేసే ఆకాష్ ప్రపోజ్ చేశాడు సంజన ముందు నో చెప్పినప్పటికీ ఆకాష్ పట్టుదలగా ట్రై చేయడం తన ప్రేమలో సంజనకు నిజాయితీ కనిపించడంతో ఆకాష్ లవ్ కు ఎస్ చెప్పిందట… వాళ్లిద్దరి లవ్ స్టోరీ దాదాపు రెండు సంవత్సరాల పాటు బాగానే నడిచింది. ఆ తర్వాత ఆకాష్ తన అసలు స్వరూపం బయట పెట్టాడు సంజన డబ్బులు వాడుకుంటూ ఆమెను మెంటల్ గా టార్చర్ పెడుతూ రకరకాలుగా ఆవిడను హింసించాడు అన్నీ మౌనంగా కొన్ని రోజులు భరించిన సంజన చివరికి భరించలేక ఆకాష్ కు బ్రేకప్ చెప్పింది. 

తన లైఫ్ లో రెండు సార్లు లవ్ ఫెయిల్యూర్ అయిన సంజన ఇక ఏ మగాడి జోలికి వెళ్లకుండా వర్క్ లో పడిపోయింది. అయితే ఒకసారి ఓ ప్రాజెక్ట్ పని మీద బెంగుళూర్ వెళ్ళిన సంజన అక్కడే ఫస్ట్ టైమ్ ప్రదీప్ కుమార్ ను చూసింది అందంగా మంచి హైట్, పర్సనాలిటీ తో బాగా అట్రాక్టివ్ గా కనిపించాడు. ఆ తర్వాత సంజన కంపనీ ప్రాజెక్ట్ ను ప్రదీప్ కుమార్ కంపనీ కలిసి టేకప్ చేయడంతో ఇద్దరూ కలిసి పని చేశారు.అప్పుడే ఇద్దరి మధ్య మంచి స్నేహం మొదలయింది. అయితే ఇక మీదట అబ్బాయిల జోలికి వెళ్లకుండా వుండాలని నిర్ణయం తీసుకున్న సంజన ప్రదీప్ కుమార్ తో ఎక్కువగా అడ్వాన్స్ అవలేదు. 

అయితే ఇద్దరు కలిసి చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అవడంతో ఒక పార్టీలో సంజన, ప్రదీప్ కుమార్ మళ్ళీ కలిశారు. పార్టీ అయిపోయిన తర్వాత సంజన ప్రదీప్ మధ్య చిన్నపాటి రొమాన్స్ జరిగింది అప్పుడే ప్రదీప్ తనకు ఆల్రెడీ పెళ్ళి అయ్యింది అన్న విషయాన్ని సంజనకు చెప్పాడు షాక్ అయిన సంజన ప్రదీప్ కు ఏం చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేసింది. ఆ తర్వతా ప్రదీప్ కుమార్ నుంచి ఎన్నో మెసేజ్ లు, కాల్స్ వచ్చాయి వేటికి కూడా సంజన రిప్లై ఇవ్వలేదు. చివరకు ప్రదీప్ కుమార్ డైరెక్ట్ గా సంజన దగ్గరికి ప్రదీప్ కుమార్ వచ్చాడు తను తన భార్యతో సంతోషంగా లేనని అందుకే తాను మరొక తోడు కోరుకుంటున్నా అని సంజనుకు చెప్పాడు చెట్టంత మగాడు చిన్న పిల్లాడిలా తన ముందు ఏడుస్తుంటే సంజన కరిగిపోయింది. అలా ఇద్దరి మధ్య ఒక ఇల్లీగల్ రిలేషన్ షిప్ మొదలయ్యింది.

తాము చేస్తుంది తప్పు అని తెలిసినా సంజన ప్రదీప్ కుమార్ తమ రిలేషన్ షిప్ ను అలాగే కంటిన్యూ చేశారు. సంజనకు ప్రదీప్ బాగా నచ్చాడు తనకోసం ఎన్నో గిఫ్ట్స్ తెచ్చేవాడు ప్రతి నెలలో దాదాపు 15 రోజులు తన ఫ్లాట్ లో తనతోనే వుండేవాడు ఇద్దరి కలిసి సినిమాలకు, పార్టీలకు, పబ్ లకు బాగానే తిరిగారు అయితే ఒకరోజు రాత్రి ప్రదీప్ కుమార్ సెల్ ఫోన్ కు అతని కొడుకు నుంచి నాన్న ఎక్కడున్నావ్ చెల్లికి బాగా జ్వరంగా ఉంది త్వరగా ఇంటికిరా అనే వాయిస్ మెసేజ్ వచ్చింది అది విన్న సంజాన తాను ఇన్ని రోజుల నుండి ఎంత పెద్ద తప్పు చేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకుంది వెంటనే ప్రదీప్ కుమార్ ను అతని భార్య పిల్లల దగ్గరకు వెళ్ళిపొమ్మంది. ఇక అక్కడి నుంచి సంజన ప్రదీప్ కుమార్ తో ఎక్కువగా కలవలేదు మాట్లాడలేదు.

అయితే సరిగ్గా ఒక సంవత్సరం తరువాత ప్రదీప్ కుమార్ తన భార్యతో విడిపోయానని సంజన కు మెసేజ్ పెట్టాడు. తన భార్య పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయిందని తానిప్పుడు ఒంటరి వాడినని ఒక్కసారి తనని కలవమని మెసేజ్ పెట్టాడు.దాంతో సంజన కరిగిపోయి మళ్ళీ ప్రదీప్ కుమార్ కు దగ్గరయింది. అలా ఆరు నెలలు వారి మధ్య రిలేషన్ షిప్ కంటిన్యూ అయ్యింది.అయితే కంపనీ ప్రాజెక్ట్ పని మీద కొన్ని రోజులు అమెరికా వెళ్ళింది. ఆ తర్వాత సంజన మళ్లీ ఇండియా వచ్చిన తర్వతా తను ప్రదీప్ కుమార్ ను కలవడానికి ట్రై చేసినపుడు అతని నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు సంజన కాల్స్ లిఫ్ట్ చేసేవాడు కాదు తన మెసేజ్ లకు రిప్లై ఇచ్చేవాడు కాదు అసలెందుకు ఇలా చేస్తున్నాడు అని సంజన ప్రదీప్ గురించి ఆరా తీస్తే తను ఇంకో అమ్మాయితో రిలేషన్ షిప్ లో వున్నాడని తెలిసింది దాంతో సంజన బాగా హర్ట్ అయ్యింది. 

అనవసరంగా ప్రదీప్ కుమార్ తో రిలేషన్ పెట్టుకుని తప్పు చేశానని సంజన బాధ పడింది. ఇక ఆ తర్వాత ప్రదీప్ కుమార్ తో ఆవిడ టచ్ లోకి వెళ్ళలేదు. అయితే కంపనీ పని మీద ముంబై వచ్చిన ప్రదీప్ కుమార్ సడెన్ గా సంజన ఫ్లాట్ కు వచ్చి తనకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ముందు ప్రదీప్ కుమార్ ను తిట్టి వెళ్ళిపొమ్మని సంజన కొప్పడ్డా ఆ తర్వాత మళ్లీ అతని తీయని మాటలకు కరిగిపోయి ప్రదీప్ కుమార్ తో రిలేషన్ షిప్ స్టార్ట్ చేసింది. అయితే కొద్ది రోజుల్లోనే ప్రదీప్ కుమార్ మళ్ళీ వేరొక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ సంజన కు అడ్డంగా దొరికి పోయాడు. అంతే ఆ ఒక్క సంఘటనతో సంజనాకు తన లైఫ్ లో తాను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థం అయ్యింది. తమ సెల్ ఫోన్ లో ప్రదీప్ కుమార్ నంబర్ డిలీట్ చేసి ముంబైలో తన జాబ్ కు రిజైన్ చేసి ఎవరికీ చెప్పకుండా అమెరికాకు వెళ్లిపోయింది.ప్రదీప్ కుమార్ లాంటి చీటర్స్ ను తాము మొదటి సారి నమ్మడమే తప్పని అలాంటిది అతన్ని మళ్ళీ మళ్ళీ నమ్మి తప్పు చేశానని పెళ్లి అయిన వాడితో రిలేషన్ షిప్ పెట్టుకోవడం ఎంత పెద్ద త ప్పో అన్న విషయం సంజనాకు బాగా అర్థం అయ్యిందట.

మనం చేస్తుంది ఒక తప్పుడు పని అయినప్పుడు ఖచ్చితంగా అందులో మోసాలు, అవమానాలే ఎదురవుతాయి అందుకే ఎవ్వరూ ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్ షిప్స్ ను ఎంకరేజ్ చేయొద్దని సంజన తన బ్లాగ్ లో రాసుకుంది. సో ఫ్రెండ్స్ మీ లైఫ్ లో అనవసరమైన రిలేషన్స్ పెట్టుకోకండి పెట్టుకుని కష్టాల్లో పడకండి.

Related Articles

Stay Connected

0FansLike
2,951FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!