21.9 C
New York
Tuesday, September 28, 2021

పర్ఫెక్ట్ కపుల్సే కానీ విడిపోయారు,కారణం తెలిస్తే మతిపోతుంది

వారిద్దరిది అపురూపమైన జంట… చిలకా గోరింకలు… ఆమె కోసం అతను… అతని కోసం ఆమె పుట్టారు… మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఇలా చెప్పుకుంటూ పొతే అబ్బో పర్ఫెక్ట్ కపుల్ గురించి మీరు ఎన్నో మాటలు వినే ఉంటారు… చూసే ఉంటారు… అయితే అలాంటి కపుల్స్ కూడా విడిపోతారు అలాంటివి మన కళ్ళ ముందే ఎన్నో జరిగాయి… జరుగుతున్నాయి కూడా మరయితే పర్ఫెక్ట్ కపుల్స్ కూడా ఎందుకు విడిపోతారు…?? వాళ్ళు అందరిలా కాదు కదా అన్ని విధాల ఒకరినొకరు అర్థం చేసుకుని అద్భుతంగా ఉంటారు కదా..?? అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే అలాంటి పర్ఫెక్ట్ కపుల్స్ ఎందుకు విడిపోతున్నారు అన్నదాని మీద పూణె కు చెందిన ఇద్దరు ఫ్రెండ్స్ వికాస్ అండ్ స్వరూప్ ఒక రీసెర్చ్ చేశారు. వాళ్ల రీసెర్చ్ లో భాగంగా దాదాపు 500 మంది పర్ఫెక్ట్ కపుల్స్ ను వాళ్ళు కలిసి వాళ్ళని ఎన్నో విషయాల మీద ఇంటర్వ్యూ చేశారట అప్పుడే పర్ఫెక్ట్ కపుల్స్ విడిపోవడం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్న వికాస్ స్వరూప్ లు ఆ వివరాలన్నీ తమ అఫిషియల్ వెబ్ సైట్ లో పబ్లిష్ చేశారు ఇప్పుడు ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకోసం…

1. పర్ఫెక్ట్ కపుల్స్ అనిపించుకోవడం వాళ్ళకు ఒక భారంగా మారిందట!!!!

నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజమండీ… పర్ఫెక్ట్ కపుల్స్ అని ఒకసారి అందరిలో పేరు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు తమలాగ వుండడం మరిచిపోయారు… ప్రతిసారి జనం కోసం సోషల్ మీడియా మంచి ఫోటోలు పెట్టడం కోసమే వాళ్ళు టూర్ లకు తిరిగే వారట తప్పా నిజంగా మనస్ఫూర్తిగా వుండడం మరిచిపోయారట… ఎప్పుడూ గొడవలు పడకుండా వుండడానికి ట్రై చేయడం, అతి జాగ్రత్త, బయటకు తమ ఎమోషన్స్ స్వేచ్ఛగా ఎక్స్ ప్రెస్ చేయలేక పోవటంతో అలా లోపల ఉండిపోయిన అన్ని ఫీలింగ్స్ ఎప్పుడో ఒకప్పుడు బయటకు వచ్చి ఒకరినొకరు నిందించుకుని విడిపోతున్నారు… వినడానికే చాలా విచిత్రంగా ఉన్నా కూడా ఇది అందరూ నమ్మాల్సిన నిజం.

2. కెరీర్, వ్యక్తిగత ఇష్టాలు వాళ్ళను విడిపోయేలా చేశాయి!!!!

ఎంత పర్ఫెక్ట్ కపుల్స్ అయినప్పటికీ వ్యక్తిగతంగా ఇద్దరికీ వేరు వేరు కెరీర్స్ వుంటాయి వేరు వేరు ఇష్టాలు కూడా వుంటాయి అయినప్పటికీ చాలాసార్లు బయటి వాళ్ళకోసం అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఇద్దరికీ ఒకటే ఇష్టం అన్నట్టు ఉంటారట… అయితే ఒక టైమ్ వచ్చినప్పుడు తమ కెరీర్ కోసం తమ లైఫ్ పార్టనర్ ను వదులుకోవడానికి అసలేం ఆలోచించరట… ప్రేమ… పెళ్లి ఇవి ఇద్దరు మనుషులను ఒకేదగ్గర కలిపి వుంచడం లో ఎంత పెద్ద రోల్ ప్లే చేసినా ఒక మనిషి తనకిష్టమైన కెరీర్ మిస్ చేసుకోవడం అన్నది వాటిని మరింత ఎక్కువగా డామినేట్ చేస్తుంది సో ఇక్కడ పర్ఫెక్ట్ కపుల్స్ విషయంలో అదే జరిగింది. బెంగుళూర్ కు చెందిన ఉమ, శేఖర్ లు పర్ఫెక్ట్ కపుల్స్ బెస్ట్ ఎగ్జామ్ పుల్ అయితే శేఖర్ లక్షల రూపాయల సాలరీ వచ్చే సాప్ట్ వేర్ జాబ్ వాసిలేసి తనకిష్టమైన సినిమా ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఉమ వద్దు అందట శేఖర్ అయినా కూడా వినకుండా తన జాబ్ కు రిజైన్ చేయడంతో ఉమ అతనితో విడిపోయింది. ఇక్కడ వారిద్దరిదీ దాదాపు 5 ఇయర్స్ జర్నీ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు వికాస్, స్వరూప్ లు ఎందుకంటే తన లైఫ్ లో మనిషి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేది తన కెరీర్ నే అంట దాన్ని మిస్ చేసుకోవడం అంటే తమ జీవితాన్ని తాము కోల్పోయినట్లే అనుకుంటారట.

3. ఒకరి అలవాట్లు మరొకరిని దూరం చేస్తాయి!!!!

రేఖ, భార్గవ్ ముంబైకి చెందిన డాక్టర్స్ ఇద్దరూ కాలేజ్ లో చదువుకున్నప్పుడే ఒకరినొకరు లవ్ చేసుకున్నారు ఆ తర్వతా మంచి జాబ్స్ లో సెటిల్ అయ్యి పెళ్లి చేసుకున్నారు. ఒక రెండు సంవత్సరాలు వారి కాపురం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా బాగానే ఉన్నా భార్గవ్ కు కాలేజ్ రోజుల నుంచి డ్రింకింగ్, కాసినో లాంటి అలవాట్లు వుండడంతో పెళ్ళి తర్వతా కూడా అతను వాటికి అడిక్ట్ అయ్యాడట ముందు భార్గవ్ ను మార్చాలని రేఖ ట్రై చేసినా కూడా భార్గవ్ మారాలేదట దాంతో చివరకు రేఖ భార్గవ్ కు డైవర్స్ ఇచ్చిందట… ఈ కేసులో తన పర్సనల్ హ్యాబిట్స్ భార్గవ్ లైఫ్ ను పాడు చేశాయని వికాస్, స్వరూప్ లో రీసెర్చ్ లో తేలిందట… అంటే మీ వ్యక్తిగత ఇష్టాలు, అలవాట్లు మంచివి కాకపోతే అవి మీ పార్టనర్ ను మీకు దూరం చేయడమే కాకుండా మీ లైఫ్ ను కూడా నాశనం చేస్తాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి అంటున్నారు వికాస్ స్వరూప్ లు.

4. అనుకోని అతిథి కి అట్రాక్ట్ అవుతారు!!!!

బోర్… చాలా చిన్న పదమే అయినప్పటికీ ఇదెంత పవర్ ఫుల్ అంటే మనుషుల జీవితాలనే మార్చేస్తుంది. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ కపుల్స్ అని మాట్లాడుకుంటున్న కొంత మంది లైఫ్ లను ఇదే ఎక్కువగా మార్చేసిందట… కొన్ని సంవత్సరాల పాటు పర్ఫెక్ట్ కపుల్స్ గా లైఫ్ ను ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసిన వాళ్ళు సడెన్ గా వాళ్ళకు కొత్తగా పరిచయమైన వ్యక్తులకు అట్రాక్ట్ అవడంతో వాళ్ళ జీవితాలు తారు మారయ్యయట… ఎందుకంటే సగటు మనిషికి ఎప్పుడూ ఏదో ఒకటి తన జీవితంలో కొత్తది కావాలి అది దొరకకపోతే మనిషి పిచ్చి వాడు అయ్యే ప్రమాదం కూడా ఉందట… అదే ఈ పర్ఫెక్ట్ కపుల్స్ విషయంలోనూ జరిగిందంట. దాదాపు 10 ఇయర్స్ పాటు పర్ఫెక్ట్ కపుల్స్ గా కాపురం చేసిన వినయ్ అండ్ లతలు కూడా విడిపోవడానికి బోర్ అనేది ఒక ముఖ్య పాత్ర పోషించిందట… ఎందుకో ఒక తెలియని బోర్ ఫీల్ అయిన వినయ్ 10 ఇయర్స్ తర్వతా తన కంపెనీ లో పని చేసే ఇషికా కు అట్రాక్ట్ అయ్యాడట లత వినయ్ ను మార్చాలని చూసినా తమ రిలేషన్ షిప్ ను బ్రేక్ చేయొద్దని వినయ్ కు ఎంత చెప్పినా వినకుండా ఆమెతో విడిపోయాడట. ఒక్కోసారి మన లైఫ్ పార్టనర్ మీద మనకే తెలియని ఒక విసుగు వస్తుందట అలాంటప్పుడు జాగ్రత్త పడి వారిని సరికొత్తగా ప్రేమించడం మొదలు పెట్టాలట లేకపోతే ఈ పర్ఫెక్ట్ కపుల్స్ లాగానే మీ పార్టనర్ కు మీరు దూరం అవుతారు అని హెచ్చరిస్తున్నారు వికాస్ అండ్ స్వరూప్ లు.

సో ఫ్రెండ్స్ …అదండీ పర్ఫెక్ట్ కపుల్స్ బ్రేకప్ విశేషాలు. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ కపుల్స్ అంటూ ఎవరూ ఉండరు అలా ఉన్న వారి జీవితాల్లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వుంటాయి. అందుకే మీరు పర్ఫెక్ట్ కపుల్స్ లా వుండాలని కాకుండా మీ జీవిత భాగస్వామికి నచ్చెట్టుగా వుండడం నేర్చుకోండి వాళ్ళకు గౌరవం ఇవ్వండి వారితో నమ్మకంగా ఉండండి… అప్పుడు మీరే గొప్ప లైఫ్ పార్టనర్ అవుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్!!!!

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!